సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి సంగ్రహాలయం ముఖ్య విశేషాలు
Posted On:
14 DEC 2023 3:39PM by PIB Hyderabad
ప్రధానమంత్రి సంగ్రహాలయ 2022 ఏప్రిల్ 14న గౌరవనీయులైన ప్రధాన మంత్రి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఇది భారతదేశంలోని ప్రధానమంత్రులందరి సహకారాన్ని గుర్తిస్తుంది. మన ప్రజాస్వామ్యం సమాజంలోని ప్రతి తరగతి మరియు శ్రేణి నాయకులకు దేశ నిర్మాణానికి దోహదపడే అవకాశాన్ని ఎలా అందించిందో కూడా చూపుతుంది. ఇది రెండు భవనాలలో విస్తరించి ఉన్న కొత్త డిజిటల్ మ్యూజియం. భవనం 1లో పాత తీన్ మూర్తి భవనం, శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ గ్యాలరీ, రాజ్యాంగ గ్యాలరీలు, తోషఖానా మరియు శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ ప్రైవేట్ వింగ్ ఉన్నాయి. బిల్డింగ్-2 శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి నుండి డాక్టర్ మన్మోహన్ సింగ్ వరకు వచ్చిన ప్రధానమంత్రుల వరకు సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక సంస్కరణల పరిస్థితులతో పాటు వ్యక్తిగత జీవితాన్ని ప్రదర్శిస్తుంది. ప్రతి గ్యాలరీ వారు భారత ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వారు చేసిన సేవలను ప్రధానంగా వివరిస్తూ ఏర్పాటు చేశారు. సంగ్రహాలయలో లైట్ అండ్ సౌండ్ షో ‘వీరంగనావోన్ కి మహాగాథ’ పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీని ద్వారా దేశం యొక్క గర్వాన్ని నిలబెట్టడానికి కృషి చేసిన వీర మహిళా యోధుల పురాణ గాథను ప్రదర్శిస్తుంది. మరో కార్యక్రమం 'నవ్య కి ఉడాన్' సందర్శకులకు గత 75 ఏళ్లలో అంతరిక్ష పరిశోధనలో భారతదేశం సాధించిన సాంకేతిక పురోగతుల సంగ్రహావలోకనం ఇస్తుంది. ప్రధానమంత్రి సంగ్రహాలయలో 'అనుభూతి' పేరుతో సందర్శకులు ఎంగేజ్‌మెంట్ జోన్‌ను ఏర్పాటు చేశారు, ఇక్కడ సందర్శకులు 'ప్రైమ్‌మినిస్టర్‌తో సెల్ఫీ', 'వాక్ విత్ ప్రైమ్ మినిస్టర్', 'లెటర్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్' మరియు దేశ వాస్తుకళ మరియు సాంకేతిక అద్భుతాలను ప్రదర్శించే వర్చువల్ హెలికాప్టర్ రైడ్‌ను ఎంచుకోవచ్చు. సందర్శకులు తాము ఎంగేజ్‌మెంట్ జోన్‌లో పాల్గొనాలనుకునే ప్రధానమంత్రిని ఎంచుకోవచ్చు. సందర్శకులు విజన్ 2047 ఫీడ్‌బ్యాక్ వాల్‌పై వారి స్ఫూర్తిదాయక సందేశాన్ని అందించవచ్చు అలాగే 'యూనిటీ చైన్'లో సమూహంలో పెద్ద గోడపై తమ ఉనికిని రికార్డ్ చేయవచ్చు. సంగ్రహాలయలో గోల్ఫ్ కార్ట్‌లు మరియు ప్రజలు సజావుగా వెళ్లేందుకు వీల్ చైర్లు, గైడ్‌లు/ఆడియో గైడ్‌లు, ఫలహారశాల మరియు సావనీర్ దుకాణం కూడా ఉన్నాయి. ఈ సమాచారాన్ని ఈరోజు రాజ్యసభలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి తెలియజేశారు.
***
(Release ID: 1986503)