సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రక్షిత స్మారక చిహ్నాల రక్షణ, భద్రతకు చర్యలు

प्रविष्टि तिथि: 14 DEC 2023 3:40PM by PIB Hyderabad

2013లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) పనితీరు ఆడిట్ నివేదిక 92 రక్షిత స్మారక చిహ్నాలు కనిపించకుండా పోయినట్లు పేర్కొంది. పాత రికార్డులు, ఆదాయ పటాలు, ప్రచురించిన నివేదికల ఆధారంగా నివేదించబడిన జాడలేని స్మారక చిహ్నాలను జాడ తెలుసుకోవడం/గుర్తించడానికి బలమైన ప్రయత్నాలు భారత పురావస్తు శాఖచే నిర్వహించబడ్డాయి. ఈ కసరత్తు మంచి ఫలవంతమైన ఫలితాలను అందించింది. 92 స్మారక చిహ్నాలలో 74 స్మారక చిహ్నాలు కనుగొనబడ్డాయి. రక్షిత స్మారక చిహ్నాలు మరియు ప్రాంతాల వద్ద వాచ్ మరియు వార్డ్ కోసం మల్టీ టాస్కింగ్ సిబ్బందిని నియమించారు. ఇంకా, ఎంపిక చేసిన స్మారక చిహ్నాల వద్ద ప్రైవేట్ భద్రతా సిబ్బందితో పాటు సీఐఎస్ఎఫ్ బలగాలను ఏర్పాటు చేశారు. కాలానుగుణ తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. రక్షిత స్మారక కట్టడాల రక్షణ మరియు భద్రతకు సంబంధించిన వివిధ అంశాల సమగ్ర పరిశీలన కోసం ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సమాచారాన్ని ఈరోజు రాజ్యసభలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి తెలిపారు.

***


(रिलीज़ आईडी: 1986501) आगंतुक पटल : 74
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी