రక్షణ మంత్రిత్వ శాఖ
భారతీయ నావికాదళ ఓడ తర్ముగ్లి ప్రారంభం
Posted On:
14 DEC 2023 5:52PM by PIB Hyderabad
తూర్పు నావల్ కమాండ్ ఆధ్వర్యంలో 14 డిసెంబర్ 2023న విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ లో ఆకట్టుకునే కార్యక్రమంలో ఒక వేగవంతమైన దాడి చేయగల ఐఎన్ఎస్ తర్ముగ్లి అనే నావను భారతీయ నావికాదళం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ ఆఫ్ మెటీరియల్ వైస్ అడ్మిరల్ సందీప్ నైథానీ హాజరయ్యారు.
ఈ నౌక భారత ప్రభుత్వం 2006లో మాల్దీవుల నావికా రక్షణ దళాలకు (ఎంఎన్‌డిఎఫ్)కు కానుకగా ఇచ్చిన ట్రింకెట్ క్లాస్ (చిన్న వర్గపు) ఎఫ్ఎసి. ఈ ఏడాది మేలో ఈ నౌకను భారతీయ నావికాదళానికి తిరిగి వచ్చింది. దీనిని కొత్త ఎంసిజిఎస్ హురావీగా ఎంఎన్‌డిఎఫ్ కి ఇన్-సర్వీస్ వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్్టను కూడా అందిస్తున్నారు. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో విస్త్రతమైన పునరుద్ధరణ పనితర్వాత ఈ ఎఫ్ఎసి ప్రస్తుత అవతారంలో పునర్జన్మను పొందింది.
ఈ యుద్ధ నౌకకు ఎంటియు ఇంజిన్లను, ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలను, 30 ఎంఎం తుపాకీని, ఆధునిక రాడార్ వ్యవస్థను అమర్చారు. దీనిని భారత తూర్పు తీరంలో కెజి బేసిన్ ప్రాంత వ్యాప్తంగా మన ఒడిఎల పరిరక్షణ, తీర ప్రాంత నిఘా కోసం విస్త్రతంగా ఉపయోగించనున్నారు.
ఐఎన్ఎస్ తర్ముగ్లి కి కమాండర్ సత్పాల్ సింగ్ సంగ్వాన్ నాయకత్వం వహిస్తుండగా, నావల్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ (ఆంధ్రప్రదేశ్) నేతృత్వంలో కార్యకలాపాలు సాగిస్తుంది. అండమాన్ ద్వీప సముదాయంలో సుందరమైన ద్వీపం పేరు కలిగిన ఈ 46 మీటర్ల నౌక, 320 టన్నులను తొలగిస్తూ, 30 నాట్లను మించిన వేగాన్ని సాధించగలదు.
***
(Release ID: 1986500)
Visitor Counter : 120