వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వ్యవసాయం మరియు అనుబంధ పరిశ్రమలలో స్టార్టప్‌లు

Posted On: 08 DEC 2023 5:13PM by PIB Hyderabad

వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ శాఖ (డీఏ అండ్ ఎఫ్డబ్ల్యూ) 2018–-19 నుండి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) కింద దేశంలో స్టార్టప్‌ల పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం కోసం “ఇన్నోవేషన్ మరియు అగ్రి -ఎంట్రప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్” కార్యక్రమాన్ని అమలు చేస్తోంది .  5 నాలెడ్జ్ పార్టనర్‌లు (కేపీలు) మరియు 24 ఆర్కేవీవై అగ్రిబిజినెస్ ఇంక్యుబేటర్లు (ఆర్ఏబీఐలు) స్టార్టప్‌ల ఇంక్యుబేషన్ మరియు ఈ ప్రోగ్రామ్ అమలు కోసం నియమించబడ్డాయి.

ఈ ప్రోగ్రాం కింద నియమించబడిన ఈ నాలెడ్జ్ పార్ట్‌నర్స్ (కేపీలు) మరియు ఆర్కవీవై అగ్రిబిజినెస్ ఇంక్యుబేటర్స్ (ఆర్ఏబీఐలు) ద్వారా స్టార్ట్-అప్‌లు శిక్షణ పొందుతాయి. అంతేకాకుండా ఇంక్యుబేట్ చేయబడతాయి. భారత ప్రభుత్వం అగ్రి-స్టార్టప్ కాన్క్లేవ్, అగ్రి ఫెయిర్ మరియు ఎగ్జిబిషన్‌లు, వెబ్‌నార్లు, వర్క్‌షాప్‌లతో సహా వివిధ జాతీయ స్థాయి కార్యక్రమాలను నిర్వహిస్తుంది.  వాటిని వివిధ వాటాదారులతో అనుసంధానించడం ద్వారా అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి వేదికను అందిస్తుంది.

కార్యక్రమం కింద మద్దతునిచ్చే అగ్రి-స్టార్ట్-అప్‌లు 'ఆలోచన' నుండి 'స్కేలింగ్' మరియు 'గ్రోత్ స్టేజ్' వరకు అమలులో వివిధ దశల్లో ఉన్నాయి. ఈ అగ్రి-స్టార్టప్‌లు వ్యవసాయం & అనుబంధ రంగాలలో  ఖచ్చితత్వ వ్యవసాయం, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ లాజిస్టిక్స్ & సరఫరా గొలుసు, వ్యవసాయ- ప్రాసెసింగ్ & ఆహార సాంకేతికత, వ్యర్థాల నుండి సంపద, సేంద్రీయ వ్యవసాయం, పశుపోషణ, పాడి & మత్స్య పరిశ్రమ వంటి వివిధ రంగాలలో పని చేస్తున్నాయి. అగ్రి-స్టార్టప్‌లు అభివృద్ధి చేస్తున్న, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో వివిధ సరసమైన మరియు వినూత్న పరిష్కారాలను అందిస్తున్నాయి.

ఈ కార్యక్రమం కింద రూ. 2019-–20 నుండి 2023–-24 వరకు మొత్తం 1524 అగ్రి స్టార్టప్‌లకు రూ.106.25 కోట్లు అందించబడ్డాయి. సంవత్సరం వారీగా వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

****



(Release ID: 1984837) Visitor Counter : 52


Read this release in: English , Urdu , Hindi