ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఆర్థోపెడిక్ వ్యాధులపై అప్డేట్


ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి -జన్ ఆరోగ్య యోజన ఆర్థోపెడిక్ వ్యాధులకు సంబంధించిన 141 విధానాల చికిత్సను అందిస్తుంది.

రూ.5,289.4 కోట్ల విలువ చేసే 20.25 లక్షల హాస్పిటల్స్ అడ్మిషన్స్ ఈ పథకం కింద ఆర్థోపెడిక్చికిత్స కోసం అధీకృతం చేయబడ్డాయి.

Posted On: 08 DEC 2023 4:43PM by PIB Hyderabad

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి -జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై) ఆర్థోపెడిక్స్, ఆంకాలజీ, కార్డియాలజీ మరియు జనరల్ మెడిసిన్ మొదలైన 27 విభిన్న ప్రత్యేకతల క్రింద మొత్తం 1949 విధానాలకు సంబంధించిన చికిత్సను అందిస్తుంది. వీటిలో మొత్తం 141 విధానాలు ఆర్థోపెడిక్ వ్యాధులకు సంబంధించినవి. ఇంకా, డిసెంబర్ 4, 2023 నాటికి రూ.5,289.4 కోట్ల విలువ చేసే 20.25 లక్షల హాస్పిటల్స్ అడ్మిషన్స్ ఈ పథకం కింద ఆర్థోపెడిక్చికిత్స కోసం అధీకృతం చేయబడ్డాయి.  

ఎయిమ్స్ దేశంలోని అత్యున్నత తృతీయ సంరక్షణ ఆసుపత్రి. కాబట్టి చికిత్స కోసం దేశవ్యాప్తంగా రోగులు ఇక్కడికి వస్తారు.  అత్యవసర కేసులను ఎయిమ్స్ వెంటనే అంగీకరించినప్పుడు, బెడ్ లభ్యత ఆధారంగా ఎలక్టివ్ సర్జరీ విషయంలో కొన్నిసార్లు తదుపరి తేదీని అందిస్తుంది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి -జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై)   కింద శస్త్రచికిత్స/అడ్మిషన్ యొక్క ముందస్తు తేదీ కోసం రోగులు అధికారుల  నుంచి సహకారాన్ని కోరుకుకోవచ్చు. బెడ్స్, చికిత్స వంటివి అందుబాటులో ఉంటే అధికారుల నుంచి కూడా సహకారం అందుతుంది.  వివిధ ఎంప్యానెల్డ్ ఆసుపత్రులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వచ్చిన 4,198 ఫిర్యాదులలో 4,117 పరిష్కరించబడ్డాయి. ఇంకా, ఢిల్లీలోని ఎయిమ్స్కి సంబంధించి ఇలాంటి 16 ఫిర్యాదులు అందాయి. అవన్నీ విజయవంతంగా పరిష్కరించబడ్డాయి.

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి -జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై) కింద ఎంప్యానెల్ చేయబడిన ఆసుపత్రులు అర్హత కలిగిన లబ్ధిదారులకు ఎంప్యానెల్ చేసిన ప్రత్యేకతలకు నగదు రహిత చికిత్సను అందించడానికి కట్టుబడి ఉంటాయి. అలా చేయడంలో విఫలమైతే శిక్షార్హమైన చర్యకు దారి తీయవచ్చు.  ఇందులో డి-ఎంప్యానెల్‌మెంట్ కూడా ఉండవచ్చు. ఒకవేళ లబ్ధిదారులకు చికిత్స నిరాకరించబడినట్లయితే, ఒకరు పోర్టల్‌లో, జాతీయ కాల్ సెంటర్ 14555 ద్వారా లేదా మెయిల్, లెటర్, ఫ్యాక్స్ మొదలైన వాటి ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇది బాగా నిర్వచించబడిన ప్రక్రియ ప్రకారం గుర్తించబడుతుంది, రికార్డ్ చేయబడుతుంది, అంతేకాకుండా పరిష్కరించబడుతుంది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి -జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై) లబ్ధిదారుల యొక్క అన్ని ఫిర్యాదులు మూడు-అంచెల ఫిర్యాదుల పరిష్కార నిర్మాణం ద్వారా సమర్థవంతమైన, పారదర్శకంగా మరియు సమయానుసారంగా పరిష్కరించబడతాయి.

జాతీయ కాల్ సెంటర్ ద్వారా లేదా ఫిర్యాదుల పరిష్కార పోర్టల్ (https://cgrms.PM-JAY.gov.in/) లేదా ఏదైనా ఇతర మాధ్యమం ద్వారా స్వీకరించబడిన ఏదైనా ఫిర్యాదు కోసం సెంట్రల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీజీఆర్ఎంఎస్) ఏర్పాటు చేయబడింది. అవసరమైన చర్య కోసం ప్రతి ఎస్హెచ్ఏ వద్ద నియమించబడిన సంబంధిత రాష్ట్ర గ్రీవెన్స్ నోడల్ అధికారికి ఇది వెంటనే కేటాయించబడుతుంది. చాలాసార్లు, అవగాహన లేకపోవడం వల్ల లబ్ధిదారులు ఫిర్యాదులు లేవనెత్తారు. ఉదాహరణకు ఎంప్యానెల్ చేయని స్పెషాలిటీ కింద చికిత్స అందించనందుకు ఆసుపత్రికి వ్యతిరేకంగా ఫిర్యాదు నమోదైంది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ భాగెల్ ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో  ఈ విషయాన్ని తెలిపారు.

***



(Release ID: 1984836) Visitor Counter : 57


Read this release in: English , Urdu , Hindi