సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మహిళా జాతి విస్తారమైంది, వారు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనగలరు
బీహార్‌లోని దర్భంగాకు చెందిన విబిఎస్‌వై లబ్ధిదారు శ్రీమతి ప్రియాంకా దేవితో ముచ్చటించిన ప్రధాని
ఏ పథకమైనా విజయవంతం కావాలంటే, అది ప్రతి లబ్ధిదారుకు చేరాలిః ప్రధానమంత్రి
Posted On:
09 DEC 2023 3:22PM by PIB Hyderabad
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర (విబిఎస్‌వై) లబ్ధిదారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ముచ్చటించారు. ఈ పథకాల ప్రయోజనాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సమయానుకూలంగా చేరేలా చూడడం ద్వారా ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ పథకాలు సంతృప్త స్థాయి చేరేందుకు దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్రను చేపడుతున్నారు.
తన భర్త ముంబైలో రోజు కూలి పని చేస్తాడని, కోవిడ్ మహమ్మారి, తదనంతర కాలంలో కుటుంబ ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిన తరుణంలో, తాను ఒకదేశం, ఒక రేషన్ కార్డ్ పథకం, పిఎంజికెఎవై, జన్‌ధన్ యోజన లాభాలను ఉపయోగించుకున్నానని, బీహార్‌లోని దర్భంగాలో విబిఎస్‌వై లబ్ధిదారు, గృహిణి అయిన శ్రీమతి ప్రియాంకా దేవి ప్రధానమంత్రికి వివరించారు.
ఆ ప్రాంతంలో మోడీ కి గ్యారంటీ వాహనం పట్ల ఉత్సుకతను గురించి కూడా చెప్పారు. మిథిల ప్రాంతంలో విబిఎస్‌వై వ్యాన్‌ను సంప్రదాయ ఆచారాలతో స్వాగతించినట్టు శ్రీమతి ప్రియాంక ప్రధానికి తెలిపారు. తాను పిల్లల చదువును, తన కుటుంబ ఆరోగ్యాన్ని గురించి మరింత మెరుగ్గా పట్టించుకునేందుకు ప్రభుత్వం తమకు సమకూరుస్తున్న ప్రయోజనాలు తోడ్పడుతున్నాయని ఆమె తెలిపారు.
దేశంలోని ప్రతి గ్రామానికీ మోడీ కీ గ్యారెంటీ వాహనం వెడుతున్నందుకు సంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఆమె స్వగ్రామంలో ప్రభుత్వ పథకాల గురించి అవగాహనను పెంచవలసిందిగా ప్రధాన మంత్రి మోడీ శ్రీమతి ప్రియాంకను కోరారు. ఏ పథకమైనా విజయవంతం కావాలంటే అది ప్రతి లబ్ధిదారుకు అందుబాటులోకి రావాలని, చేరాలని ఆయన ఉద్ఘాటించారు. మోడీ కీ గ్యారెంటీ వాహనం ద్వారా, తనే స్వయంగా మారుమూల ఉన్న లబ్ధిదారులను చేరుకొని, అర్హుడైన ప్రతిపౌరుడినీ కవర్ చేయాలనే సంకల్పంతో ఉన్నానన్నారు. జాతి ఆధారంగా మహిళలలో చీలికను తీసుకువచ్చి, విభజించే రాజకీయాల పట్ల అప్రమత్తతతో ఉండవలసిందిగా మహిళలను హెచ్చరిస్తూ, నిరాటంకమైన ప్రభుత్వ మద్దతుకు హామీ ఇచ్చారు. మాకు మహిళ ఒకటే జాతి, అందులో విభజనలు లేవు. మహిళా జాతి విస్తారమైంది, వారు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనగలరు అని ఆయన అన్నారు.
****
(Release ID: 1984634)