పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

కాప్ 28 సమావేశంలో భారతదేశ జాతీయ విధానాన్ని సమర్పించిన కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్

Posted On: 09 DEC 2023 3:57PM by PIB Hyderabad

యూఏఈ  దుబాయ్ లో జరుగుతున్న కాప్  28 సమావేశంలో భారతదేశ  జాతీయ విధానాన్ని  కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈరోజు  సమర్పించారు. 

మంత్రి  ప్రకటన  పూర్తి పాఠం  

గౌరవనీయులు, స్నేహితులు, మహిళలు,ప్రతినిధులారా ,

 

* ముందుగా కాప్  28 సమావేశానికి ఆతిధ్యం ఇస్తున్నయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి , ప్రభుత్వ  ఆతిథ్యానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు

*  కాప్  28 సమావేశాన్ని  "కాప్  ఫర్ యాక్షన్"గా నిర్వహిస్తున్న కాప్  28 అధ్యక్ష దేశానికి   భారతదేశం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను.  అభినందించింది, ఇది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ప్రారంభంతో సమావేశాలు మొదటి రోజు నుంచి కార్యాచరణ దిశగా కదలడం అభినందనీయం. 

స్నేహితులారా 

* వాతావరణ మార్పులకు ప్రతిస్పందనగా ప్రపంచ స్థాయిలో అమలు జరుగుతున్న  కార్యాచరణ-ఆధారిత చర్యలకు సహకారం అందించడంలో  భారతదేశం ముందుంది.  ప్రజలు, గ్రహం మధ్య అవినాభావ సంబంధం ఉందని,  మానవ శ్రేయస్సు, ప్రకృతి అంతర్గతంగా ముడిపడి ఉన్నాయన్న అభిప్రాయంతో భారతదేశం ఉంది. 

* పర్యావరణ పరిరక్షణ కోసం 'మిషన్ లైఫ్' పర్యావరణహిత జీవన విధానం  అమలులో భాగస్వాములు కావాలని భారతదేశ  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ ప్రజలకు  ఇచ్చిన పిలుపు భారతదేశం అనుసరిస్తున్న కార్యాచరణ-ఆధారిత విధానానికి నిదర్శనం. మిషన్ లైఫ్ ఆదర్శాలను మరింతగా పెంచుతూ, వినూత్న పర్యావరణ కార్యక్రమాలు, సాధనాల మార్పిడి కోసం ఒక ప్రపంచ వేదిక ఏర్పాటు చేయడానికి  భారతదేశం గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

* ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశం ఆమోదించిన  న్యూ ఢిల్లీ డిక్లరేషన్‌లో  చారిత్రాత్మక  గ్రీన్ డెవలప్‌మెంట్ ఒడంబడికను ఆమోదించాయి. 

స్నేహితులారా, 

* భారతదేశం ప్రారంభ అడాప్టేషన్ కమ్యూనికేషన్‌తో పాటు 2019 జిహెచ్జీ  ఇన్వెంటరీ ఆధారంగా మూడవ జాతీయ విధానాన్ని  ఖరారు చేసింది. దేశ   ప్రజల అభివృద్ధి , శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ  వాతావరణ పరిరక్షణ అంశానికి  భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యత తెలియజేస్తోంది.  

* గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల నుండి ఆర్థిక వృద్ధిని విడదీయడానికి భారతదేశంలో విజయవంతంగా చర్యలు అమలు జరుగుతున్నాయి. 2005- 2019 మధ్యకాలంలో భారతదేశ జీడీపీ లో కర్బన  ఉద్గార తీవ్రతను 33% వరకు  విజయవంతంగా తగ్గించింది.  2030 నాటికి నిర్ణయించుకున్న ఎన్ డీ సి   లక్ష్యాన్ని  11 సంవత్సరాల ముందు భారతదేశం  సాధించింది. .

*  శిలాజేతర   ఇంధన ఆధారిత వనరులు ఉపయోగించి సాగుతున్న విధ్యుత్ ఉత్పత్తిని భారతదేశం  40% ఎలక్ట్రిక్ ఇన్‌స్టాల్ సామర్థ్యాన్ని సాధించింది. ఈ లక్ష్యాన్ని కూడా భారతదేశం కూడా 2030 లక్ష్యానికి తొమ్మిదేళ్లు ముందు సాధించింది.2017-2023 మధ్య కాలంలో భారతదేశం అదనంగా 100 జీ డబ్ల్యూ విధ్యుత్ సామర్థ్యాన్ని నెలకొల్పింది. దీనిలో 80% విద్యుత్ శిలాజేతర  ఇంధన ఆధారిత వనరుల ద్వారా సాగుతోంది. 

* సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ పరిరక్షణ జాతీయ లక్ష్యాలను భారతదేశం సవరించింది. 

స్నేహితులారా.. 

* పర్యావరణ పరిరక్షణ కోసం దేశంలో చర్యలు అమలు చేస్తున్న భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలకు తన సహకారం అందిస్తోంది. దీనిలో భాగంగా అంతర్జాతీయ సోలార్ అలయన్స్ (ISA), విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం కూటమి (CDRI), లీడ్‌ఐటి ఏర్పాటు , స్థితిస్థాపక ద్వీప రాష్ట్రాల కోసం మౌలిక సదుపాయాలు (IRIS), బిగ్ క్యాట్ అలయన్స్ లాంటి కార్యక్రమాలకు భారతదేశం తన సహకారం అందించింది. 

* ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశం అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన జీ-20 సమావేశంలో  గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్, ప్రారంభమయ్యింది.  జీవ ఇంధనాల అభివృద్ధి,  జీవ ఇంధనాల విస్తృత వినియోగంలో ప్రపంచ దేశాల సహకారం సాధించడానికి  గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ కృషి చేస్తుంది. 

స్నేహితులారా 

*  దుబాయ్‌లో జరుగుతున్న కాప్ 28 సమావేశంలో ప్రపంచ పరిస్థితిని సమీక్షించి పర్యావరణ పరిరక్షణ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపు దిద్దుకుంటుంది అని భారతదేశం ఆశిస్తోంది. 

* అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు అనుగుణంగా నిధుల సమీకరణ జరగాల్సి ఉంటుంది. 

* సమన్యాయం, పర్యావరణ అంశాలకు  తగిన న్యాయం జరిగేలా ప్రపంచ స్థాయిలో ప్రణాళిక అమలు జరగాలని భారతదేశం ఆశిస్తోంది. 

స్నేహితులారా.. .

* ప్యారిస్ ఒప్పందం  సూత్రాలు, ప్రక్రియలపై నమ్మకం, విశ్వాసాన్ని పునరుద్ధరించడం చాలా ముఖ్యమైన అంశం. 

*  ఒకే భూమి. ఒకే కుటుంబం. ఒకే భవిష్యత్తు స్ఫూర్తితో పనిచేసి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ప్రపంచ నిర్మాణం ఉమ్మడి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను.  

 అందరికీ ధన్యవాదాలు.

 

***



(Release ID: 1984569) Visitor Counter : 236


Read this release in: English , Urdu , Hindi