రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు అమలు చేస్తున్న భారతీయ రైల్వే

Posted On: 08 DEC 2023 3:10PM by PIB Hyderabad

ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి, సామర్ద్యాన్ని పెంపొందించడానికి భారత రైల్వే శాఖ చర్యలు అమలు చేస్తోంది. పరికరాలు, ఉపకరణాల శక్తి సామర్థ్యాన్ని  పెంపొందించడానికి   స్థిరమైన భవనాలు, క్లౌడ్ ఆధారిత డేటా పర్యవేక్షణ,నిర్వహణ పోర్టల్ లాంటి కార్యక్రమాలు అమలు చేయడానికి రైల్వే శాఖ సమగ్ర విధానాన్ని రూపొందించి అమలు చేస్తోంది. ఈ విధానం కింద  బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) 5 స్టార్ గుర్తింపు కలిగిన  పరికరాలను రైల్వే శాఖ వినియోగిస్తోంది. ఇంధన పొదుపు, వినియోగాన్ని తగ్గించడం కోసం రైల్వే శాఖ  చేపట్టిన కొన్ని చర్యలు క్రింది విధంగా ఉన్నాయి:

1. ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (EMU) రైళ్లు, మెయిన్‌లైన్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (MEMU), కోల్‌కతా మెట్రో రేక్‌లు, వందే భారత్ రైళ్లలో రీజెనరేటివ్ బ్రేకింగ్‌తో కూడిన ఇన్సులేటెడ్-గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్ (IGBT) ఆధారిత 3-ఫేజ్ ప్రొపల్షన్ వ్యవస్థను  రైల్వే ప్రవేశపెట్టింది. .

2. పునరుత్పత్తి బ్రేకింగ్ సౌకర్యాలతో పూర్తి స్థాయిలో  ఎనర్జీ ఎఫెక్టివ్ త్రీ-ఫేజ్ ఎలక్ట్రిక్ లోకో ల ఉత్పత్తి జరుగుతోంది. 

3. రైల్వే స్టేషన్లు, సర్వీస్ భవనాలు, రైల్వే  క్వార్టర్లు, కోచ్‌లు, ఈఎంయులు/మెమో లతో సహా రైల్వే ఇన్‌స్టాలేషన్‌లలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి, మెరుగైన వెలుతురును అందించడానికి ఇంధన సమర్థవంతమైన లైట్ ఎమిటింగ్ డయోడ్ (LED) లైటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు 

4. కోచ్‌లు,భవనాలలో శక్తి సామర్థ్యపు బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ (BLDC) మోటార్ ఫ్యాన్‌లను ఉపయోగించడం.

5. పవర్ కార్ల లో డీజిల్ ఇంధన వినియోగాన్ని, శబ్ద వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రైళ్లలో ఎండ్ ఆన్ జనరేషన్ (EOG) రైళ్లలో  హెడ్ ఆన్ జనరేషన్ (HOG) వ్యవస్థ వినియోగం 

6. వినియోగ పాయింట్ల వద్ద తరచు  ఎనర్జీ ఆడిట్‌ నిర్వహణ 

7. కోస్టింగ్, డిజెనరేటివ్ బ్రేకింగ్ సౌకర్యం ఉపయోగించడం, ఒకవేళ యార్డ్ దూరం  15 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే ఇంధనాన్ని ఆదా చేయడం కోసం ఎలక్ట్రిక్ లోకో బ్లోయర్‌లను స్విచ్ ఆఫ్ చేయడం లాంటి అంశాలపై , లోకో పైలట్‌లకు  కౌన్సెలింగ్ 

8.  డ్రైవింగ్ టెక్నిక్ , మెరుగైన రోడ్ లెర్నింగ్ ద్వారా మెరుగైన శక్తి/ఇంధన సామర్థ్యాన్ని సాధించడానికి శక్తి/ఇంధనాన్ని ఆదా చేయడం కోసం లోకోమోటివ్ పైలట్‌లకు ప్రారంభ శిక్షణ సమయం, ప్రమోషనల్ ట్రైనింగ్ , రిఫ్రెషర్ కోర్సుల సమయంలో శిక్షణ 

9. ఆయిల్ కూలింగ్ బ్లోవర్ (OCB), ట్రాక్షన్ మోటార్ బ్లోవర్ (TMB) స్కావెంజ్ ట్రాక్షన్ మోటార్ బ్లోవర్ (ScTMB)కి విద్యుత్ సరఫరా సాఫ్ట్‌వేర్ లాజిక్ ద్వారా నిలిపి వేసే త్రీ ఫేజ్ లోకోమోటివ్‌లపై ఇంధన ఆదా మోడ్‌ను అందించడానికి మార్గదర్శకాలు జారీ 10. ఇంధనాన్ని ఆదా చేయడానికి లైట్ లోడ్‌లను లాగుతున్న మల్టీ యూనిట్ల (MU) ట్రైలింగ్ లోకోమోటివ్‌లు తొలగించబడ్డాయి. 

11. ఎల్హెచ్బీ  కోచ్‌ల నిర్వహణ, పరీక్ష కోసం వాషింగ్/సిక్ లైన్‌ల వద్ద 750వి  బాహ్య విద్యుత్ సరఫరాను అందించడం.

12. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ద్వారా పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ (PAT)లో భాగంగా  భారతీయ రైల్వే శాఖ కార్యక్రమాలు అమలు చేస్తోంది. 

13. హై టెన్షన్/లో టెన్షన్ ప్యానెళ్లలో ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోల్ ప్యానెళ్ల ఏర్పాటు.

14. రైలు సేవలు/ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా స్టేషన్లలో ఆటోమేటిక్ ప్లాట్‌ఫారమ్ లైటింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఉపయోగించడం.

15. ఇంధన పొదుపు కోసం సమీపంలోని యూనిటీ పవర్ ఫ్యాక్టర్‌ను నిర్వహించడానికి ట్రాక్షన్ సబ్-స్టేషన్‌లలో కెపాసిటర్ బ్యాంక్‌లను ఉపయోగించడం.

16. రైల్వే స్టేషన్‌ల హై మాస్ట్ టవర్ లైటింగ్‌లు/స్ట్రీట్ లైటింగ్/సర్క్యులేటింగ్ ఏరియాపై టైమర్‌ల ఉపయోగం.

17.  సంప్రదాయ గీజర్‌ల స్థానములో సోలార్ గీజర్‌ల ఏర్పాటు 

ఇంధన సంరక్షణ కోసం అమలు జరుగుతున్న  చర్యలను రైల్వే బోర్డుతో సహా జోనల్ రైల్వే/ఉత్పత్తి యూనిట్లు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తాయి. దీనికి సంబంధించి డివిజన్లు,వర్క్‌షాప్‌లలోని ప్రధాన లోడ్ కేంద్రాల శక్తి వినియోగం సాధారణ తనిఖీ, పర్యవేక్షణ చర్యలు అమలు జరుగుతున్నాయి. 

రైల్వే, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(Release ID: 1984336) Visitor Counter : 69


Read this release in: English , Urdu