ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

"అందరికీ ఆరోగ్యం" పై - తాజా సమాచారం


ఆయుష్మాన్ భవ్ ప్రచారం ద్వారా లబ్ధిదారులకు - 3,00,24,031 ఆయుష్మాన్ కార్డుల జారీ

Posted On: 08 DEC 2023 4:45PM by PIB Hyderabad

జాతీయ ఆరోగ్య మిషన్ కింద, ప్రజలకు అందుబాటులో, సరసమైన ఆరోగ్య సంరక్షణ ను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా సార్వత్రిక ఆరోగ్య సేవలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.   జాతీయ ఆరోగ్య మిషన్ కింద, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా జనాభాలోని పేద, బలహీన వర్గాలకు అందుబాటులో, సరసమైన, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ను అందించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక, సాంకేతిక మద్దతు అందించడం జరుగుతోంది.  ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో మెరుగుదల, ఆరోగ్య సౌకర్యాల్లో తగినంత మానవ వనరుల లభ్యత, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణకు లభ్యత మరియు ప్రాప్యతను మెరుగుపరచడానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ సేవలు అందుబాటులో ఉండే, అట్టడుగు సమూహాలకు జాతీయ ఆరోగ్య మిషన్ మద్దతు ఇస్తుంది.

ప్రభుత్వం నాలుగు మిషన్ మోడ్ ప్రాజెక్టులను ప్రారంభించింది, అవి - ప్రధానమంత్రి-ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ (పీ.ఎం-ఏ.బి.హెచ్.ఐ.ఎం);  ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గతంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ & వెల్ నెస్ సెంటర్స్ (ఏ.బి-హెచ్.డబ్ల్యూ.సి.ఎస్);  ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య్య యోజన (పి.ఎం.జె.ఏ.వై) మరియు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎ.బి.డి.ఎం). 

ఆయుష్మాన్ భవ్ ప్రచార కార్యక్రమాన్ని గౌరవ భారత రాష్ట్రపతి 2023 సెప్టెంబర్, 13వ తేదీన ప్రారంభించారు.  ప్రతి గ్రామంలో / పట్టణంలో ఎంపిక చేసిన ఆరోగ్య సంరక్షణ సేవలు చివరి వ్యక్తి వరకు చేరేలా చేయడానికి, సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు గౌరవ ప్రధానమంత్రి నిబద్ధతకు అనుగుణంగా ఆయుష్మాన్ భవ్ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.    'ఆయుష్మాన్ - ఆప్కే ద్వార్ 3.0', 'ఆయుష్మాన్ మేళాలు- హెల్త్ అండ్ వెల్నెస్ స్థాయిలో, ఆయుష్ మేళాలు, ఆయుష్మాన్ సభలను చేర్చే విషయంలో - 'ఆయుష్మాన్ భవ్' ప్రచార కార్యక్రమం జోక్యం చేసుకుంటుంది.  2023 నవంబర్, 28వ తేదీ న తెలియ చేసిన విధంగా లబ్ధిదారునికి, 'ఆయుష్మాన్ భవ్' ప్రచార కార్యక్రమంలో జారీ చేసిన ఆయుష్మాన్ కార్డుల వివరాలు అనుబంధం-1 లో పొందుపరచడం జరిగింది. 

ప్రాథమిక, ద్వితీయ, తృతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి, ఇప్పటికే ఉన్న జాతీయ సంస్థలను బలోపేతం చేయడానికి, కొత్త మరియు అభివృద్ధి చెందుతున్న వ్యాధులను గుర్తించడానికి, నయం చేయడానికి కొత్త సంస్థలను రూపొందించడానికి పి.ఎం-ఏ.బి.హెచ్.ఐ.ఎం. ప్రారంభించడం జరిగింది.   పి.ఎం-ఏ.బి.హెచ్.ఐ.ఎం. అనేది కొన్ని కేంద్ర రంగ కాంపోనెంట్ లతో కూడిన కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం.  ఈ పథకానికి 2025-26 సంవత్సరం వరకు 64,180 కోట్ల రూపాయల మేర వ్యయం కానుంది. 

ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ ద్వారా ఉప ఆరోగ్య కేంద్రాలు (ఎస్.హెచ్.సి.లు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీ.హెచ్.సి. లు) బలోపేతం చేయడం ద్వారా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ను అందిస్తున్నారు.  పునరుత్పత్తి, పిల్లల ఆరోగ్య సేవలు, అంటూ వ్యాధులు, సంక్రమణేతర వ్యాధులతో పాటు, ఇతర ఆరోగ్య సమస్యలకు విస్తరించిన సేవల్లో భాగంగా, నివారణ, ప్రోత్సాహక, పునరావాస, సంరక్షణను, ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లు   (ఏ.ఏ.ఎం. లు) అందిస్తాయి.  

ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏ.బి-పి.ఎం.జె.ఏ.వై) పథకం కింద పేద, బలహీన కుటుంబాలకు సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య సేవలు అందుతాయి.   జాతీయ ఆరోగ్య విధానం కింద, మాతృత్వ మరణాల నిష్పత్తి (ఎం.ఎం.ఆర్) / శిశు మరణాల రేటు (ఐ.ఎం.ఆర్) తో పాటు మొత్తం సంతానోత్పత్తి రేటుకు సంబంధించి ప్రస్తుత విజయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

1.       మాతృత్వ మరణాల నిష్పత్తి - 97.  

2.       శిశు మరణాల రేటు - 28. 

       3.    మొత్తం సంతానోత్పత్తి రేటు - 2.

దేశంలో సమగ్ర డిజిటల్ ఆరోగ్య మౌలిక సదుపాయాలకు తోడ్పడేందుకు అవసరమైన విధానాన్ని అభివృద్ధి చేయడమే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏ.బీ.డీ.ఎం) లక్ష్యంగా పెట్టుకుంది.  ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థ లోని వివిధ వాటాదారుల మధ్య ప్రస్తుతం ఉన్న అంతరాన్ని ఇది డిజిటల్ విధానంలో తగ్గిస్తుంది. 

ఎన్.హెచ్.ఎం. ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా - ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంటే, పూర్వం ఆయుష్మాన్ భారత్-ఆరోగ్య, శ్రేయస్సు కేంద్రాలు - ఏ.బీ.-హెచ్.డబ్ల్యూ.సీ. లను నిర్వహణపరంగా యోగ్యత కలిగినవిగా మార్చడం, ఒప్పంద ప్రాతిపదికన ఆరోగ్య మానవ వనరులను నిమగ్నం చేయడానికి మద్దతు, జాతీయ అంబులెన్స్ సేవలు,  సంచార వైద్య యూనిట్లు, ఆశా కార్యకర్తలు, మౌలిక సదుపాయాల బలోపేతం, 24 గంటలు వైద్య సేవలతో పాటు, మొదటి రిఫెరల్ సౌకర్యాలు, మేరా ఆసుపత్రి, కాయకల్ప్ అవార్డు పథకం, ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం, జాతీయ నాణ్యత భరోసా ప్రమాణాల అమలు, సంబంధిత కార్యకలాపాలు, లక్ష్య సర్టిఫికేషన్, బయోమెడికల్ సామగ్రి నిర్వహణ మరియు యాజమాన్య కార్యక్రమం, ఉచిత వ్యాధి నిర్ధారణ, ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం వంటి చర్యల ద్వారా ప్రస్తుతం ఉన్న ఉప కేంద్రాలతో పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్వహణాపరమైన యోగ్యత కలిగినవిగా మార్చడం జరుగుతుంది. 

అదేవిధంగా,   మిషన్ పరివార్ వికాస్; కౌమార స్నేహపూర్వక ఆరోగ్య క్లినిక్ లు (ఏ.ఎఫ్.హెచ్.సి. లు); వారానికి ఒకసారి ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇచ్చే కార్యక్రమం (డబ్ల్యూ.ఐ.ఎఫ్.ఎస్); ఋతు పరిశుభ్రత పథకం; సౌకర్యం ఆధారిత నవజాత శిశు సంరక్షణ (ఎఫ్.బి.ఎన్.సి); ఇంటి వద్దే నవజాత శిశు సంరక్షణ కార్యక్రమం; న్యూమోనియాను విజయవంతంగా తటస్తం చేయడానికి సామాజిక అవగాహనతో కూడిన చర్యలు (ఎస్.ఏ.ఏ.ఎన్.ఎస్); చిన్న పిల్లలకు ఇంటి వద్దే సంరక్షణ (హెచ్.బి.వై.సి); రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం (ఆర్.బి.ఎస్.కె); రాష్ట్రీయ కిశోర్ స్వస్త్య కార్యక్రమం (ఆర్.కె.ఎస్.కే); చిన్న పిల్లల అభివృద్ధి (ఈ.సి.డి); సమగ్ర గర్భస్రావం సంరక్షణ (సి.ఏ.సి); రక్తహీనత ముక్త్ భారత్ (ఏ.ఎం.బి) వ్యూహం; ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్  అభియాన్ (పి.ఎం.టి.బి.ఎం.బి.ఏ); పోషకాహార పునరావాస కేంద్రం (ఎన్.ఆర్.సి) కార్యక్రమం; సార్వత్రిక టీకాలు వేసే కార్యక్రమం వంటి ఇతర కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతుంది. 

ఆరోగ్య పరిరక్షణ సేవల పంపిణీ మరియు ఈక్విటీ ఖర్చు తగ్గించడం ద్వారా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేసి, స్థోమత పెంచడం ద్వారా మంచి నాణ్యత గల ఆరోగ్య సేవలు అందించాలని, 2017 లో రూపొందించిన జాతీయ ఆరోగ్య విధానం భావిస్తోంది.   అన్ని వయస్సుల వారికి, అందరికీ సాధ్యమైనంత అత్యున్నత స్థాయి ఆరోగ్యం, శ్రేయస్సును సాధించడం, అన్ని అభివృద్ధి విధానాల్లో నివారణ, ప్రోత్సాహక ఆరోగ్య ధోరణి ద్వారా మరియు పర్యవసానంగా ఎవరూ ఆర్థిక కష్టాలను ఎదుర్కోకుండా మంచి నాణ్యమైన ఆరోగ్య సేవలకు సార్వత్రిక ప్రాప్యత పొందడమే ఈ విధానం లక్ష్యం.  ఈక్విటీ, స్థోమత, సార్వత్రికత, రోగి కేంద్రీకృతంగా, నాణ్యమైన సంరక్షణ, జవాబుదారీతనం వంటి ముఖ్య సూత్రాల పై ఈ విధానం కేంద్రీకృతమై ఉంది.   ప్రజలకు నాణ్యమైన, సరసమైన ఆరోగ్య సేవలు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి కి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ రోజు లోక్ సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానం లో ఈ విషయాలు తెలియజేశారు. 

 

*****



(Release ID: 1984330) Visitor Counter : 70


Read this release in: English , Tamil