నీతి ఆయోగ్
రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ఇన్నోవేషన్ పనితీరును మెరుగుపరచడానికి రాష్ట్ర సహాయ మిషన్ కింద వర్క్‌షాప్ నిర్వహించిన నీతి ఆయోగ్
Posted On:
08 DEC 2023 4:27PM by PIB Hyderabad
6 డిసెంబర్ 2023న ఆకాశవాణి భవన్‌లోని రంగ్ భవన్ ఆడిటోరియంలో "ఇంప్రూవింగ్ ది ఇన్నోవేషన్ ఆప్టిట్యూడ్ అండ్ ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్" అనే అంశంపై నీతి ఆయోగ్ నేషనల్ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. స్టేట్ సపోర్ట్ మిషన్ వర్క్‌షాప్ సిరీస్‌లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ వైస్-ఛైర్మెన్ శ్రీ సుమన్ బేరీ; నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సరస్వత్ మరియు భారత ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ సెక్రటరీ డా.ఎం. రవిచంద్రన్ పాల్గొన్నారు.
రాష్ట్రాలకు వాటి వనరుల పరిమితుల్లో సంక్లిష్టమైన అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడంలో సహాయం చేయడానికి నీతి ఆయోగ్ అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించింది. నీతి ఆయోగ్ తన కార్యక్రమాల్లో భాగంగా 'స్టేట్ సపోర్ట్ మిషన్' ద్వారా తన సహకార సమాఖ్య ఆదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరియు వివిధ విభాగాలలో రాష్ట్రాల మధ్య ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో నిమగ్నమై ఉంది.
ఇన్నోవేషన్ ఎల్లప్పుడూ భారతదేశానికి మూలస్తంభంగా ఉంది. గత దశాబ్ద కాలంలో ఇది తన అభివృద్ధి ప్రయాణంలో ముందంజలోకి వచ్చింది. సైన్స్ మరియు ఇన్నోవేషన్ రంగాలలో భారీ పురోగతి దేశం విస్తృతమైన సామాజిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడింది. అందువల్ల ఈ దశాబ్దంలో భారతదేశ వృద్ధికి మరియు 2047 కోసం భారతదేశ విజన్‌లో కూడా ఆవిష్కరణ కీలకమైన డ్రైవర్‌గా ఉంటుంది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు విధానాలను రూపొందించడంలో మరియు ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని వర్క్‌షాప్ తన ఇన్నోవేషన్ ఆప్టిట్యూడ్ మరియు పనితీరును మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.
వర్క్‌షాప్‌లోని ముఖ్యాంశాలు:
వర్క్‌షాప్ సెషన్‌లు వ్యూహాలు, సవాళ్లు, నేర్చుకున్న పాఠాలు మరియు ముందుకు వెళ్లే మార్గాన్ని స్పష్టంగా వివరించడానికి రూపొందించబడ్డాయి. వర్క్‌షాప్ ఫలితాలు ఆవిష్కరణ రంగంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఆప్టిట్యూడ్‌ను పెంపొందించడానికి దోహదపడతాయి. వర్క్‌షాప్ ఐదు-ప్యానెల్ సెషన్‌లుగా విభజించబడింది, వీటిలో ప్రతి ఒక్కటి ముఖ్యమైన అంశాలపై చర్చలను కలిగి ఉంటుంది:
ప్యానెల్ చర్చ 1
"ఇండియన్ స్టేట్స్‌ను ఎంపవర్ చేయడం: విక్షిత్ భారత్ @2047 కోసం ఇన్నోవేషన్ పొటెన్షియల్‌ను ఆవిష్కరించడం."
ప్యానెలిస్ట్‌లలో ఒక ముఖ్యమైన సందేశం ఏమిటంటే భారతదేశం తన రాష్ట్రాల నుండి చురుకైన మరియు సమన్వయ ప్రమేయంతో ఒప్పించే విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంది.
ప్యానెల్ చర్చ 2
"ఇన్నోవేటివ్ స్టేట్స్: షోకేసింగ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ జర్నీస్"
ఆవిష్కరణ ఆర్థిక వృద్ధిని ఎలా ఉత్ప్రేరకపరుస్తుంది, జీవన నాణ్యతను ఎలా మెరుగుపరుస్తుంది, ఉద్యోగాల సృష్టిని ఎలా ఉత్తేజపరుస్తుంది మరియు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది అనే అంశంపై చర్చ జరిగింది.
ప్యానెల్ చర్చ 3
"సహకార ఆవిష్కరణ: సామూహిక వృద్ధికి రాష్ట్రాలు భాగస్వామ్యం"
ఇది ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌లోని వాటాదారుల మధ్య సహకారం యొక్క అవసరాన్ని బయటపెట్టింది మరియు భాగస్వామ్య సవాళ్లను పరిష్కరించడానికి అంతర్-రాష్ట్ర సహకార ఆవిష్కరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
ప్యానెల్ చర్చ 4
"నేర్చుకున్న పాఠాలు మరియు ఇన్నోవేషన్ సక్సెస్ స్టోరీస్ రెప్లికేటింగ్"
ఇది ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను రూపొందించడంలో నేర్చుకున్న కీలక పాఠాలను మరియు ఆ విజయాలను పునరావృతం చేయడంలో సవాళ్లు మరియు పరిష్కారాలను హైలైట్ చేసింది.
ప్యానెల్ చర్చ 5
"రాష్ట్రాల ఉత్తమ అభ్యాసాల భాగస్వామ్యం"
ఇది రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేస్తున్న ఉత్తమ అభ్యాసాలను ప్రదర్శించింది. దానితో పాటుగా ఆ పరిష్కారాలను రాష్ట్ర సందర్భంలో పని చేసేందుకు అవలంబించిన అమలు పద్ధతులను ప్రదర్శించింది.
వర్క్‌షాప్ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్-ఛైర్మెన్ శ్రీ సుమన్ బెరీ "డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్" వంటి కార్యక్రమాల ద్వారా అటల్ ఇన్నోవేషన్ మిషన్ మిలియన్ల మంది విద్యార్థులపై ప్రభావం చూపడంతో ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిచ్చిందని వివరించారు. ఐడీఐఎక్స్ మరియు అగ్నితో సహా వివిధ పథకాలు, భారతదేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్న రంగాలలో ఆవిష్కరణలను నడిపిస్తాయన్నారు. ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ రాష్ట్రాల ఇన్నోవేషన్ సామర్థ్యాన్ని కొలుస్తుందని కర్ణాటక, మహారాష్ట్ర మరియు తెలంగాణ స్థిరంగా మంచి పనితీరును కనబరుస్తున్నాయని ఆయన అన్నారు. భారతదేశ ఆవిష్కరణ పనితీరు 2023లో 40వ ర్యాంక్‌కు చేరుకుంది "న్యూ ఇండియా"ను రూపొందించడంలో ఇన్నోవేషన్ యొక్క కీలక పాత్రను నొక్కి చెప్పింది.
నీతి ఆయోగ్ సభ్యుడు (ఎస్&టీ) డాక్టర్ వి.కె. సరస్వత్ మాట్లాడుతూ..నీతి ఆయోగ్ నాన్-ఐఐటీ/ఎన్‌ఐటీ విశ్వవిద్యాలయాలు పరిశోధన మరియు అభివృద్ధిలో ఎదుర్కొంటున్న సవాళ్లపై సంప్రదింపుల అధ్యయనాలను నిర్వహిస్తుందని టైర్ 2 మరియు 3 నగరాలపై ప్రధాన దృష్టిని కేంద్రీకరిస్తుందని చెప్పారు. వైస్-ఛాన్సలర్లు మరియు డైరెక్టర్లతో సమావేశాలు మౌలిక సదుపాయాల సమస్యలను అర్థం చేసుకోవడం మరియు విద్యా సంస్థల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు.టీసిఆర్‌ఎం మ్యాట్రిక్స్ ఫ్రేమ్‌వర్క్ మరియు సమవే ఆర్&డీ డ్యాష్‌బోర్డ్ ప్రాజెక్ట్-స్కేల్ ఇన్నోవేషన్ వంటి కార్యక్రమాలు అంచనా వేయడానికి మరియు పర్యవేక్షించడానికి సాధనాలను అందజేస్తాయని ఆయన ఇంకా వివరించారు.నీతి ఆయోగ్ ఆవిష్కరణ యొక్క సాంస్కృతిక కోణాన్ని నొక్కి చెబుతుందని సవాళ్లను పరిష్కరించడానికి మరియు ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించడానికి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు మద్దతునిస్తుందని చెప్పారు.
భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ (ఎస్&టీ) సభ్యుడు డా. వి.కె. సరస్వత్‌తో పాటు భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ డాక్టర్ అభయ్ కరాండికర్, భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ డా.అజిత్ కుమార్ మొహంతి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ బహ్ల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, డెరైక్టర్-జనరల్, రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ డా. సచిన్ చతుర్వేది సహా గౌరవనీయులైన ప్రముఖులచే గౌరవనీయమైన సెషన్‌తో ప్యానెల్ చర్చలు ముగిశాయి.
***
(Release ID: 1984270)
Visitor Counter : 152