వ్యవసాయ మంత్రిత్వ శాఖ
బయోఫోర్టిఫైడ్ విత్తనాల పర్యావరణ ప్రభావం
Posted On:
08 DEC 2023 5:17PM by PIB Hyderabad
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఎఆర్ -ఇకార్) ఆధ్వర్యంలో 2014 నుంచి మొత్తం 124 వ్యవసాయ పంటలు సహా 142 బయోఫోర్టిఫైడ్ (బలమైన సంబంధమైన) రకాలు (బియ్యం -10, గోధుమ -43, మొక్కజొన్న -20, జొన్నవిత్తులు-11, చిన్న చిరుధాన్యాలు / జొన్నలు -13, అవిసెలు-1, కాయధాన్యం-2, సెనగలు 2, ముంగ్ బీన్ 1, ఫీల్డ్ పీ 1, ఉరాద్‌బీన్ 1, ఆవాలు -8, సోయాబీన్-7, నువ్వులు-1, వేరుశనగ -3, 18 ఉద్యానవన పంటలు (చిలగడదుంప-5, తోటకూర -3, కంద, పెండలం -2, బంగాళదుంప -2, కాలిఫ్లవర్, బెండ, ద్రాక్ష, అరటి, జామ, దానిమ్మ)లను అభివృద్ధి చేయడం జరిగింది.
ఈ బయోఫోర్టిఫైడ్ రకాలు పర్యావరణ పరిస్థితులపై, ముఖ్యంగా మట్టి, జలాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపవు. ఎందుకంటే, వీటిని సాధారణ రకాలలాగా పెంచడం, వాటి నీటి, పోషకాల అవసరం సంప్రదాయ రకాలలా ఉంటాయి.
అన్ని బయోఫోర్టిఫైడ్ రకాలూ పంటల పరంగా సంబంధిత పంటల సంప్రదాయ రకాలకు సమానంగా లేదా మంచి దిగుబడిని కలిగి ఉంటాయి. ఈ రకాలను సాగు చేయడంలో అధిక వ్యయం లేదా దిగుబడి జరిమానా ఉండకపోవడంతో ఈ బయోఫోర్టిఫైడ్ రకాల ఉత్పత్తి అనేది ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న రకాలకన్నా ఖరీదైనది కాదు.
2019-20 నుంచి బయోఫోర్టిఫైడ్ రకాల బ్రీడర్ విత్తనాన్ని 37425.7 క్వింటాళ్ళను ఉత్పత్తి చేసి, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విత్తన ఉత్పత్తి ఏజెన్సీలకు పునాది, ధృవీకరించిన విత్తనాలను దిగువకు ఎక్కువగా అందించేందుకు సరఫరా చేయడం జరిగింది. సమాజంలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు బయోఫోర్టిఫైడ్ విత్తన ఉత్పత్తులను అందుబాటులో ఉంచడంతో పాటు సాగు కోసం రైతులకు ధృవీకరించిన విత్తనం మరింత సరఫరా చేయడం జరుగుతుంది. గత ఆరేళ్ళల్లో, 10 మిలియన్ హెక్టార్ల భూమిని గోధుమ, వరి, జొన్నవిత్తలు, ఆవాలు, కాయధాన్యాల బయోఫోర్టిఫైడ్ రకాలతో కవర్ చేయడం జరిగింది.
జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) కింద మెరుగైన పద్ధతులపై క్లస్టర్ ప్రదర్శనలు, పంటల విధానంపై ప్రదర్శనలు, విత్తనోత్పత్తి, అధిక దిగుబడినిచ్చే రకాలు (హెచ్‌వైవిలు)/ సంకర జాతి రకాల పంపిణీ, పంట ఆధారిత శిక్షణలు వంటి జోక్యాల కోసం రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా రైతులకు సహాయాన్ని అందించడం జరుగుతుంది.
విషయాంశ నిపుణులు/ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సాంకేతిక బ్యాక్ స్టాపింగ్ (వెనుకనుంచి మద్దతు), సాంకేతికతను రైతులకు బదిలీ చేయడం కోసం ఐసిఎఆర్, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞానకేంద్రాలకు కూడా మిషన్ సహకారం అందించింది. ఎన్ఎఫ్ఎస్ఎం కింద రాష్ట్రాలు/ ఐసిఎఆర్ తాజా పంట ఉత్పత్తి సాంకేతికత ప్రదర్శనలు/ క్లస్టర్ ముందు వరుస ప్రదర్శనలు/ బయో ఫోర్టిఫైడ్ రకాల ముందువరుస ప్రదర్శనలను నిర్వహించవచ్చు.
ఈ సమాచారాన్ని కేంద్ర వ్యవసాయ & రైతాంగ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో శ్రీ కైలాస్ చౌధరి శుక్రవారం వెల్లడించారు.
***
(Release ID: 1984267)
Visitor Counter : 111