రక్షణ మంత్రిత్వ శాఖ
ఆసియాన్ (ఎఎస్ఇఎఎన్)కు చెందిన మహిళా శాంతిపరిరక్షక దళాలకు టేబుల్ టాప్ విన్యాసాలు (టిటిఎక్స్) నిర్వహించిన భారత సైన్యం
Posted On:
08 DEC 2023 4:48PM by PIB Hyderabad
శాంతి పరిరక్షణ చర్యలలో మహిళా సైనిక సిబ్బంది సామర్ధ్యాలను పెంచేందుకు, జెండర్ సంఘటితను ప్రోత్సహించే మైలురాయి చొరవలో భాగంగా, భారత సైనిక దళం ఆగేయ ఆసియా దేశాల సమాఖ్య (ఎఎస్ఇఎఎన్)కు చెందిన మహిళా అధికారులకు 4 నుంచి 8 డిసెంబర్ 2023 వరకు న్యూఢిల్లీలోని మనిక్‌షా సెంటర్‌లో టేబుల్-టాప్ విన్యాసాలను నిర్వహించింది.
శాంతి పరిరక్షణ మిషన్లలో అంతర్జాతీయ సహకారాన్ని, సామర్ధ్య నిర్మాణాన్ని బలోపేతం చేయడం, ఈ క్షేత్రంలో మహిళను సాధికారం చేసేందుకు, సెంటర్ ఫర్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ (సియుఎన్‌పికె - ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాల కేంద్రం) చేస్తున్న కృషిలో ఈ విన్యాసాలు భాగం. శాంతి పరిరక్షణ చర్యలలో శిక్షణనిచ్చే భారతీయ సైన్యపు అగ్ర సంస్థ సియుఎన్‌పికె.
ఇంతకు ముందు, 18 నుంచి 29 సెప్టెంబర్ 2023న సియుఎన్‌పికె ఆసియన్ మహిళా సైనిక అధికారులకు కోర్సును నిర్వహించింది. భారత్, ఆసియాన్ సభ్య దేశాల మధ్య కొనసాగుతున్న ఉమ్మడి సైనిక శిక్షణ విన్యాసాలకు కొనసాగింపే టిటిఎక్స్. ప్రపంచ శాంతి, స్థిరత్వం, జెండర్ సమానత్వం పట్ల భారత్ భాగస్వామ్య నిబద్ధతను ఈ విన్యాసం నొక్కి చెబుతుంది.
వాస్తవ ప్రపంచ సవాళ్ళను ప్రతిఫలించే సంక్లిష్టమైన శాంతిరక్షణ పరిస్థితుల్లో వ్యూహాత్మక ప్రతిస్పందనలకు ప్రేరణకు వేదికగా ఈ విన్యాసం పని చేస్తుంది. సంక్లిష్టమైన శాంతిపరిరక్ష పర్యావరణకు, మహిళా శాంతి, భద్రతను ఖరారు చేసే పద్ధతులకు వారిని బహిర్గతం చేయడం కూడా ఇందులో ఉంది.
ఈ కార్యక్రమంలో భారతదేశ సంపన్న & శక్తిమంతమైన సంస్కృతిని ప్రదర్శించేందుకు ఢిల్లీ వారసత్వ సంపద పర్యటన కూడా ఉంది. ఈ కార్యక్రమంలో ఐరాస శాంతి పరిరక్షణ డ్రిల్స్‌తో పాటు, మేడ్ ఇన్ ఇండియా పరికరాలు వివిధ యుఎన్ మిషన్లలో మోహరించడంపై ప్రదర్శన, ఉపన్యాసాలు, ప్రదర్శన కూడా ఉన్నాయి.
(Release ID: 1984197)
Visitor Counter : 99