వ్యవసాయ మంత్రిత్వ శాఖ
సాగు, వనాలపెంపకం
Posted On:
05 DEC 2023 5:53PM by PIB Hyderabad
సాగు, వనాల పెంపకం రెండింటినీ సమ్మిళితం చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు సాధించాలని ప్రభుత్వం సంకల్పించింది.
ఇందుకు అనుగుణంగా వనాల పెంపకం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని భూముల సద్వినియోగం, నిరుపయోగ భూములలో వనాల పెంపకం,
గ్రామీణ ప్రాంతాలలో ఉత్పాదకత పెంపు, లాభదాయక రీతిలో వనాల పెంపకం, వైవిధ్యతతో కూడిన పర్యావరణానికి పూచీపడడం,
సహజవనరుల సద్వినియోగం , సామాజిక వ్యవస్థల నిర్మాణం వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఆగ్రో పాలసీ –2014 ను రూపొందించింది.
ఈ పాలసీ సమీకృత విధానంలో వనాల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. దీనితో అటు పశుగణాభివృద్ధి ఉత్పాదక పెంపునకు,
పంటల ఉత్పత్తి పెంపుదలకు దోహదం చేస్తుంది. దీనికి తోడు ఉపాధి కల్పన, రాబడి పెంపు,గ్రామీణ ప్రజలకు జీవనోపాధి అవకాశాలు కల్పించడం,
ప్రత్యేకించి చిన్న కమతాల సాగురైతులకు తోడ్పడడం దీని లక్ష్యం. ఇది పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు,
తీవ్రమైన వాతావరణ మార్పుల సమయంలో పంట నష్టాన్ని గణనీయంగా తగ్గించేందుకు , వినూత్న సాగు పద్ధతులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తుంది.
జాతీయ ఆగ్రోఫారెస్ట్రీ పాలసీలో సిఫార్సు చేసిన ప్రకారం, ఆగ్రోఫారెస్ట్రీ సబ్ మిషన్ ను 2016–17 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది.
సాగు భూములలో చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు , హర్ మేధ్ పర్ పేడ్, ద్వారా పంటలతో పాటు రైతులు అదనపు రాబడి పొందేలా చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడంపై దృష్టిపెట్టడం జరుగుతోంది.
ఆగ్రోఫారెస్ట్రీ సబ్ మిషన్ ను 2016–17 నుంచి 2021–22 మధ్య అమలు చేయడం జరిగింది. ప్రస్తుతం పునర్ వ్యవస్థీకరించిన ఆగ్రో ఫారెస్ట్రీ విధానాన్ని అమలు చేస్తున్నారు.
దీనిని రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్.కె.వి.వై) ద్వారా అమలు చేస్తున్నారు. దీనిద్వారా నాణ్యమైన మొక్కలు నాటడంపై దృష్టిపెడుతున్నారు.
వాతావరణ మార్పుల సవాలను ఎదుర్కొవడంలో సాగువనాల పెంపకం కీలక పాత్ర పోషించడమే కాక, ప్రకృతి వనరుల పరిరక్షణకు
అదనపు జీవనోపాధి వనరుల కల్పనకు, అదనపు రాబడి అవకాశాలను గ్రామీణ ప్రజలకు కల్పించడానికి దోహదపడుతుంది.
ఇందుకు సంబంధఙంచిన ఖర్చు వివరాలు, రైతులకు అందిస్తున్న సాయం సంబంధిత వివరాలను అనుబంధంలో చూడవచ్చు.
ఈ సమాచారాన్ని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ లోక్సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1983622)
Visitor Counter : 102