వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ వ్యాపారుల సంక్షేమ బోర్డు మొదటి సమావేశం జరిగింది

Posted On: 05 DEC 2023 7:38PM by PIB Hyderabad

పరిశ్రమ, అంతర్గత వాణిజ్యాభివృధి శాఖ (డి.పి.ఐ.ఐ.టి) ఏర్పాటు చేసిన  జాతీయ వ్యాపారుల సంక్షేమ బోర్డు (ఎన్.టి.డబ్ల్యూ.బి) మొదటి సమావేశం, శ్రీ సునీల్ జె సింఘి అధ్యక్షతన, 2023 డిసెంబర్, 5వ తేదీన, న్యూఢిల్లీలోని వాణిజ్యభవన్ లో జరిగింది. 

పరిశ్రమ, అంతర్గత వాణిజ్యాభివృధి శాఖ వ్యాపారులు, వారి ఉద్యోగుల సంక్షేమం కోసం జాతీయ వ్యాపారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసింది.

 

ఈ క్రింది లక్ష్యాల నెరవేర్చడానికి ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి ఎన్.టి.డబ్ల్యూ.బి. ని ఏర్పాటు చేయడం జరిగింది:

*     వ్యాపారులు, వారి ఉద్యోగుల సంక్షేమం లక్ష్యాన్ని సాధించేందుకు విధానపరమైన చర్యలను గుర్తించడం.  

*     వ్యాపారులకు వర్తించే చట్టాలు, నిబంధనల్లో సరళీకరణలను సూచించడానికి. 

*     వ్యాపారుల సమ్మతి భారాన్ని తగ్గించడానికి తగిన సిఫార్సులు చేయడానికి.    

*     వ్యాపారులకు నిధుల ప్రాప్యతను మెరుగుపరచడానికి.    

*     వ్యాపారులకు, వారి ఉద్యోగులకు బీమా, పింఛను,  పెన్షన్, అరోగ్య పరిరక్షణ తదితర సామాజిక భద్రతా ప్రయోజనాలకు సంబంధించి సిఫార్సులు చేయడం. 

*     వ్యాపారులు, వారి ఉద్యోగుల ఇతర సమస్యలను పరిష్కరించేందుకు సిఫార్సులు చేయడం. 

బోర్డు కింది సభ్యులను కలిగి ఉంటుంది:      

***     ఒక చైర్ పర్సన్ ( నాన్-అఫీషియల్)

***     రిటైల్ వాణిజ్యానికి చెందిన సాంకేతిక, లేదా ఇతర అంశాలకు సంబంధించిన విషయాలపై ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన ఐదుగురు సభ్యుల వరకు (నాన్-అఫీషియల్)     

***     కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 10 మంది సభ్యుల వరకు (నాన్-అఫీషియల్) 

***     ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే విధంగా ఒక్కొక్క అనధికార సభ్యుడు. 

***    మంత్రిత్వశాఖలు, విభాగాల నుంచి 9 మంది ఎక్స్-అఫీషియో ప్రతినిధులు.  

***     డీ.పీ.ఐ.ఐ.టీ. (అంతర్గత వాణిజ్య వ్యవహారాల) సంయుక్త కార్యదర్శి ఈ బోర్డు కి - సమన్వయ కర్త గా వ్యవహరిస్తారు.      

వాణిజ్య సంఘాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారేతర సభ్యులందరూ, ఈ బోర్డు సమావేశానికి హాజరయ్యారు.    ఈ సమావేశానికి తొమ్మిది కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్స్-అఫీషియో సభ్యులు కూడా హాజరయ్యారు.    

వ్యాపారులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో సభ్యులందరి పాత్ర గురించి, బోర్డు పాత్ర గురించి డీ.పీ.ఐ.ఐ.టీ. సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ ప్రముఖంగా పేర్కొన్నారు.   బోర్డు కూర్పు దాని పరిధిని, బలాన్ని ప్రతిబింబిస్తుందని, తద్వారా రిటైల్ రంగానికి సంబంధించిన విస్తృత స్థాయి సమస్యలను అర్థవంతంగా పరిష్కరించవచ్చునని ఆయన ప్రముఖంగా తెలియజేశారు. 

ఈ సందర్భంగా ఎన్.టి.డబ్ల్యూ.బి. చైర్మన్, శ్రీ సునీల్ జె సింఘీ ప్రసంగిస్తూ, అధికారేతర సభ్యులందరూ వ్యాపారుల సంక్షేమం కోసం తమ సలహాలను సమర్పించాలని సూచించారు.  సమర్థవంతమైన పరిష్కారం కోసం వాటిని సంబంధిత మంత్రిత్వ శాఖలు / విభాగాల ప్రతినిధులకు పంపడం జరుగుతుందని తెలియజేశారు. 

ఓపెన్-నెట్వర్క్-ఫర్-డిజిటల్-నెట్వర్క్ (ఓ.ఎన్.డి.సి) గురించి బోర్డు సభ్యులందరికీ సంక్షిప్త ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ భారత ప్రభుత్వ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా వ్యాపారుల సమాజంలో ప్రోత్సహించాలని వారిని కోరడం జరిగింది. 

 

 

***


(Release ID: 1983608) Visitor Counter : 119
Read this release in: English , Urdu , Hindi