సహకార మంత్రిత్వ శాఖ
విత్తన సహకార సంఘం
Posted On:
05 DEC 2023 3:30PM by PIB Hyderabad
బహుళ రాష్ట్రాల సహకార సంఘాల చట్టం (ఎం.ఎస్.సి.ఎస్) 2002 కింద సహకార మంత్రిత్వశాఖ భారతీయ బీజ్ సహకారి
సమితి లిమిటెడ్ను ఏర్పాటు చేసింది. బి.బి.ఎస్.ఎస్.ఎల్ సంస్థ, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సేకరణ, పంపిణీ వంటివాటిని,
సహకార సంఘాల నెట్ వర్క్ ద్వారా ఒకే బ్రాండ్ పేరుపై సరఫరా చేస్తుంది. దీని ద్వారా పంటదిగుబడి పెంచడమే కాకుండా,
విత్తనాలను కాపాడడం, దేశీయ సహజసిద్ధమైన విత్తనాలను ప్రోత్సహించడానకి ఇది ఉపకరిస్తుంది.
బిబిఎస్ఎస్ ఎల్లో రెండు రకాల సభ్యత్వాలు ఉంటాయి అందుకు సంబంధించిన వివరాలు కింద వివరించడం జరిగింది.
1) సాధారణ సభ్యులు : కింది వారు బిబిఎస్ఎస్ఎల్ లో సాధారణ సభ్యులు కావడానికి అర్హత కలిగి ఉంటారు.
ఎ)అన్ని బహుళ రాష్ట్ర సహకార సంఘాలు లేదా ఏదైనా సహకార సంఘం.
బి) జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ చట్టం ,1962 (26 ఆఫ్ 1962) కింద ఏర్పాటైన జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్,
సి) ప్రభుత్వం చేత నియంత్రించబడిన లేదా ప్రభుత్వ యాజమాన్యంలోని ఏ ఇతర కార్పొరేషన్
డి) సొసైటీ కార్యకలాపాలు, స్వభావానికి అనుగుణమైన వ్యక్తుల సమూహం, లేదా కేంద్ర రిజిస్ట్రార్ అనుమతించిన వ్యక్తుల సమూహం లేదా వ్యక్తుల అసోసియేషన్
వ్యక్తిగతంగా ఎవరూ బిబిఎస్ఎస్ ఎల్ లో సాధారణ సభ్యులు కావడానికి వీలు లేదు.
సాధారణ సభ్యులు కింది సభ్యత్వ వర్గీకరణ ప్రకారం తమ మూలధన వాటాను చందాగా చెల్లించాల్సి ఉంటుంది.
1) క్లాస్ –1, సహకార సంఘాలు, అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కో ఆపరేటివ్ లిమిటెడ్ (ఐఎఫ్.ఎఫ్.సి.ఒ), కృషక్ భారతి కో ఆపరేటివ్ లిమిటెడ్ ( క్రిభ్ కో), నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్
ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్.ఎ.ఎఫ్.ఇ.డి), నేషనల్ కో ఆపరేటివ్ డవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్.సి.డి.సి), నేషనల్ డైరీ డవలప్మెంట్ బోర్డ్ (ఎన్డిడిబి) లు ఒక్కొక్కటి రూ 10000 ముఖ విలువగల కనీసం 5,00,000 లక్షల షేర్లను
కొనుగోలు చేయాలి.
2) క్లాస్ –2 కింద, రాష్ట్రస్థాయి సహకార సంఘం, సబ్ క్లాజ్(1)లో పేర్కొన్నవి కానివి ఒక్కొక్కటి రూ 1000 ముఖవిలువ గలిగినవి కనీసం 10000 షేర్లను సబ్ స్క్రయిబ్ చేయాలి.
3) క్లాస్ –3 : సబ్ క్లాజ్ 1లో పేర్కొన్నవి కాక , జాతీయ సహకార సంఘం, బహుళ రాష్ట్ర సహకార సంఘం, జాతీయ సహకార సంఘంగా ప్రకటింపబడనివి ఒక్కొక్కటి రూ 10000 ముఖవిలువగల కనీసం 500 షేర్లు కొనుగోలు చేస్తాయి.
4) క్లాజ్ –4 కింద రాష్ట్రస్థాయి లేదా ప్రాథమిక సహకార సంఘం కాని ఏదైనా సహకార సంఘం ఒక్కొక్కటి రూ 1000 ముఖ విలువగల కనీసం పది షేర్లను కొనుగోలు చేయాలి.
5) క్లాజ్ –5 కింద ప్రాథమిక సహకార సొసైటీ స్థాయి సంస్థ ఒక్కొక్కటి రూ 1000 ముఖ విలువగల ఒక షేరును కొనుగోలు చేయాలి
6) క్లాజ్ –6 కింద, అలాంటి స్థాయి లేదా ఆయా వర్గం కిందగ ల వ్యక్తులు, అసోసియేషన్లను క్లాజ్ 7(1)(డి) కింద సభ్యులు కావడానికి అనుమతించవచ్చు. ఈ సభ్యులు ఒక్కొక్కటి రూ 1000 ముఖ విలువగల కనీసం రెండు షేర్లను కొనుగోలు చేయాలి.
షేర్ల విలువను ఒకేసారి ఏకమొత్తంగా చెల్లించాలి, అలాగే షేర్ మొత్తం వసూలు అయిన వెంటనే లేదా సబ్ స్క్రయిబ్ చేసిన మొత్తం అందిన వెంటనే షేర్ సర్టిఫికేట్ను జారీ చేస్తారు.
(ii) సాధారణ లేదా అసోసియేట్ సభ్యులు : సంఘం, తన వ్యాపార ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఏవ్యక్తిని అయినా సాధారణ సభ్యుడిగా లేదా అసోసియేట్ సభ్యుడిగా , మల్టీస్టేట్ కో ఆపరేటివ్ సొసైటీ
చట్టం నిబంధనలకు లోబడి చేర్చుకోవచ్చు. ఇందుకు వీరు తిరిగి ఇవ్వని మొత్తం రూ 1,00,000లను(లక్ష రూపాయలను) చెల్లించవలసి ఉంటుంది.
కంపెనీల చట్టం, ప్రొడ్యూసర్ కంపెనీల చట్టం కింద ఏర్పడిన ఏదైనాకంపెనీ (ప్రభుత్వం కంపెనీ మినహా) అసోసియేట్, సాధారణ సభ్యులుగా ఉండవచ్చు.
బిబిఎస్ఎల్ అందించిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఈ సంస్థ 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వివిధ కేటగిరీల కింద సుమారు 8,200 దరఖాస్తులను అందుకుంది..
బిబిఎస్ ఎల్ నియమావళి ప్రకారం, సొసైటీ కార్యకలాపాల ప్రభావం, పనితీరును మదింపు చేసేందుకు ఈ కింది యంత్రాంగం ఏర్పాటవుతుంది.
1) వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) సమయంలో, సొఐటీ రిజర్వులు, ఇతర నిధులను పరిశీలిస్తుంది. అలాగే వార్షిక నివేదికను, ఖాతాలను, సొసైటీ సబ్సిడరీ సంస్థల ఖాతాలను సమీక్షిస్తారు.
2) సొసైటీ ప్రతి వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆడిటర్ లేదా ఆడిటర్లను ఎంఎస్సిఎస్ చట్టం 2002 నిబంధనల కింద నియమిస్తారు. ఆడిషర్ ప్రతి వార్షిక సర్వసభ్య సమావేశంలో తన నివేదికను సమర్పించ వలసి ఉంటుంది.
1) కేంద్ర ప్రభుత్వం ఏదైనా సమయంలో , ఒక ఆదేశం ద్వారా సొసైటీ ఖాతాల ప్రత్యేక ఆడిట్కు ఆదేశించవచ్చు. ఆ నివేదిక అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎం.ఎస్.సిఎస్ చట్టం లేదా అమలులో ఉన్న ఇతర చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చు.
2) బిబిఎస్ఎస్ఎల్ ఆడిట్ నివేదికలు పార్లమెంటు ఉభయసభల ముందు ఉంచవలసి ఉంటుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1983030)
Visitor Counter : 105