వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కీలక వ్యవసాయ పథకాలు

Posted On: 05 DEC 2023 6:05PM by PIB Hyderabad

వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలోని అంశం. అయితే, దేశంలో రైతుల సంక్షేమం కోసం సమగ్రమైన పథకాలు, కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రుణాలు, బీమా, ఆదాయాలకు మద్దతు, మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యానవన పంటలు, విత్తనాలు, యాంత్రీకరణ, మార్కెటింగ్, సేంద్రీయ & ప్రకృతి వ్యవసాయం, రైతు సంఘాలు, నీటిపారుదల, పొడిగింపులు, కనీస మద్దతు ధరలకు రైతుల నుంచి పంటల సేకరణ, డిజిటల్ వ్యవసాయం వంటి అంశాల్లో ఈ పథకాలు అమలవుతున్నాయి. వాటి వివరాలు అనుబంధం-Iలో ఉన్నాయి. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తేనే పీఎంఎఫ్‌బీవై వంటి అర్హత ఆధారిత పథకాలు అమలవుతాయి, వాటి ప్రయోజనాలు రైతులకు అందుతాయి.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాంకేతిక జోక్యాల వల్ల చిన్నకారు రైతులకు గణనీయంగా లబ్ధి చేకూరిన కొన్ని విజయవంతమైన గాథలు అనుబంధం IIలో ఉన్నాయి.

కేంద్ర వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.

****


(Release ID: 1983026) Visitor Counter : 153


Read this release in: English , Urdu , Hindi