సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో బుక్ ఫెయిర్ ప్రారంభం

Posted On: 05 DEC 2023 6:57PM by PIB Hyderabad

న్యూఢిల్లీ జన్పథ్లోని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా వారసత్వ భవనంలో బుక్ ఫెయిర్ మరియు నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా(ఎన్ఏఐపబ్లికేషన్ ప్రత్యేక పుస్తక ప్రదర్శన, విక్రయం ఈరోజు ప్రారంభించబడింది కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్కైవ్స్ డైరెక్టర్ జనరల్ శ్రీ అరుణ్ సింఘాల్ పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించాల్సిన అవసరాన్ని గురించి నొక్కి చెప్పారుఅనేక మంది ప్రముఖ ప్రచురణకర్తలు మరియు పుస్తక పంపిణీదారులు తమ తాజా ప్రచురణలను ప్రదర్శిస్తూ బుక్ ఫెయిర్లో పాల్గొంటున్నారుబుక్ ఫెయిర్తో పాటునేషనల్ ఆర్కైవ్స్ ఇండియా సంస్థ తన ప్రచురణల యొక్క ప్రత్యేకమైన ఎగ్జిబిషన్-కమ్-సేల్ను కూడా ఆవిష్కరించింది. ఇది 15 డిసెంబర్ 2023 వరకు కొనసాగుతుందిఆకర్షణీయమైన తగ్గింపు ధరలతో అందించబడుతున్న  ప్రచురణలతో పాటుఎగ్జిబిషన్-కమ్-సేల్ ఎన్ఏఐ యొక్క నాన్-ప్రైస్డ్ పబ్లికేషన్లను కూడా ప్రదర్శిస్తుందిఇవి వివేచనగల గల పాఠకులకు ఉచితంగా లభిస్తాయిఎన్ఏఐ ప్రచురణల పుస్తక ప్రదర్శన మరియు ప్రదర్శన-కమ్-సేల్ 5 డిసెంబర్ 2023 నుండి 15 తేదీ డిసెంబరు వరకు అన్ని రోజులలో ఉదయం 11.00 నుండి సాయంత్రం 5.30 వరకు తెరవబడి ఉంటుంది.

                                                                    

***


(Release ID: 1983023) Visitor Counter : 76


Read this release in: English , Urdu , Hindi