పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్థానిక రైతులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నుమాలి ఘర్లో 2జి రిఫైనరీ ఏర్పాటు : కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి శ్రీ హర్దీప్ ఎస్.పూరి.


సరసమైన, పరిశుభ్రమైన వంటగ్యాస్, వాహనాలకు ఉపయోగించే ఇంధనాన్ని ప్రజలకు అందించేందుకు సిజిడి నెట్ వర్క్ కింద మొత్తం ఈశాన్యరాష్ట్రాలను కవర్ చేసినట్టు వెల్లడించిన శ్రీ హరదీప్ పూరి.

ముడి చమురు, సహజవాయు ఉత్పత్తి విషయంలో ఈశాన్య రాష్ట్రాల పాత్రను ప్రశంసించిన కేంద్ర మంత్రి హరదీప్ ఎస్ పూరి.

Posted On: 04 DEC 2023 8:01PM by PIB Hyderabad

దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం ముడి చమురులో సుమారు 14 శాతం, సహజవాయువు ఉత్పత్తిలో పది శాతం అస్సాంలో ఉత్పత్తి అవుతున్నదని, పెట్రోలియం, సహజవాయుశాఖ మంత్రి  శ్రీ హర్ దీప్ సింగ్ పూరి , రాజ్యసభ ఎం.పి శ్రీ పవిత్ర మార్గెరిటీ లేవనెత్తిన మౌఖిక ప్రశ్నకు సమాధానంగా ఈరోజు పార్లమెంటులో తెలియజేశారు.అస్సాంలో ఉత్పత్తి అవుతున్న పెట్రోలియం ఉత్పత్తులు, సహజవాయువుకు సంబంధించి అలాగే, ఇతర దేశాలనుంచి దిగుమతులను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి ఈ విషయం తెలిపారు. 1889లో దిగ్బాయ్లో వాణిజ్యస్థాయిలో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత, ఆసియాలోనే తొలి రిఫైనరీ  దిగ్బాయ్లో ఏర్పడిందని మంత్రి గుర్తు చేశారు. గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలో అంటే 2019–21 నుంచి 2022–23 మధ్య రాష్ట్రప్రభుత్వానికి మొత్తం రూ 9291 కోట్ల రూపాయల రాయల్టీని క్రూడ్ ఆయిల్ పైన, 851 కోట్ల రూపాయలను గ్యాస్ ఉత్పత్తిపైన చెల్లించినట్టు మంత్రి తెలిపారు.

ఈశాన్య ప్రాంతంలో  సుమారు 44,000 కోట్లరూపాయల విలువగల ప్రధాన ప్రాజెక్టుల గురించి కూడా  మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందులో నుమాలిఘర్ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టు, ఈశాన్య గ్యాస్ గ్రిడ్, పరదీప్ –నుమాలిఘర్ క్రూడ్ ఆయిల్ పైప్లైన్, ఎన్.ఆర్.ఎల్ బయో రిఫైనరీ తదితరాలు ఉన్నాయి.
నుమాలిఘర్ లోని 2జి రిఫైనరీ 185 కె.ఎల్.పి.డి  సామర్ధ్యం కలిగిఉందని,ఇది వెదురు నుంచి ఇథనాల్ను ఉత్పత్తి చేస్తుందని, ఇది స్థానిక రైతులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తుందని ఆయన తెలిపారు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ కింద మొత్తం ఈశాన్యరాష్ట్రాలు కవర్అయినట్టు మంత్రి తెలిపారు. దీనిద్వారా సరసమైన ధరకు పరిశుభ్రమైన వంటగ్యాస్, వాహనాలకు ఇంధనం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రత్యేక ఆర్ధిక మండలుల ప్రాంతం (ఇఇజెడ్)లో ‘ నొ గో’ ప్రాంతాలను ప్రభుత్వం తగ్గించిందని, ఇది దాదాపు 99 శాతం తగ్గడంతో సుమారు 1 మిలియన్ చదరపు కిలోమీటర్ల ప్రాంతం చమురు అన్వేషన్, ఉత్పత్తి కార్యకలాపాలకు అందుబాటులోకి వచ్చిందని కూడా కేంద్ర మంత్రి హర్ దీప్ ఎస్.పూరి పార్లమెంట్కు తెలిపారు. పాతబడిన, మూసివేతకు గురైన బావులను పునరుద్ధరించడం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టినట్టు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం సుమారు 61,000 కోట్ల రూపాయల మూలధన పెట్టుబడిని వ్యయం చేస్తున్నట్టు ,ఇది రానున్న రోజులలో చమురు ఉత్పత్తిని గణనీయంగా పెంచనున్నట్టు తెలిపారు.

ఇ అండ్ పి రంగంలో  విదేశీ పెట్టుబడిని ఆకర్షించేందుకు తీసుకున్న పరివర్తనాత్మక చర్యలను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందుకు నేషనల్ ఆయిల్ కంపెనీలైన ఒ.ఎన్.జి.సి, ఒఐఎల్లు అంతర్జాతీయ చమురు సంస్థలైన ఎగ్జాన్మొబిల్ చెవరాన్, టోటల్ ఎనర్జీస్, షెల్ తదితర కంపెనీలతో కొలాబరేషన్కు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపారు.
ఇథనాల్ బ్లెండింగ్ విషయంలో 2014 లో లక్ష్యం 1.54 శాతం ఉండగా 2023 నాటికి ఇది 12 శాతానికి పెరిగడంలో విజయం సాధించిన విషయాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం దేశం ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ వాహనాల దిశగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. ఇ 20 (20 శాతం ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్  ఇప్పటికే 6000కు పైగా రిటైల్ ఔట్లెట్లలో అందుబాటులో ఉందని, 2025 నాటికి ఇది దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన సిబిజి, గ్రీన్ హైడ్రోజన్, ఇవిలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా మంత్రి ప్రస్తావించారు.ఒ.ఎన్.జి.సి ఇటీవల , 483 కోట్ల రూపాయలత కార్పొరేట్ సామాజిక బాధ్యతా(సిఎస్ఆర్) నిధులతో  అస్సాంలోని శివసాగర్లో 350 పడకల సుఇ–క–ఫ మల్టీ  స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన విషయాన్ని కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది ఎగువ అస్సాం, పొరుగు రాష్ట్రాలకు చెందిన జిల్లాల ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చనున్నట్టు ఆయన తెలిపారు.

 

***


(Release ID: 1982636) Visitor Counter : 80