పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బయో-సిఎన్జీ ఉత్పత్తి

Posted On: 04 DEC 2023 4:24PM by PIB Hyderabad

వ్యవసాయ, మున్సిపల్ వ్యర్థాలతో సహా వివిధ ప్రాంతాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను ఉపయోగించి  కంప్రెస్డ్ బయో గ్యాస్ ను  ఉత్పత్తి చేసి, రవాణా రంగంలో దాని వినియోగాన్ని ప్రోత్సహించడానికి,పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది.దీనికోసం ప్రభుత్వం ఈ క్రింది కార్యక్రమాలను అమలు చేస్తోంది :- 

i . పట్టణ, పారిశ్రామిక , వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్/బయో-సిఎన్జీ   ఉత్పత్తి కోసం ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక సహాయం.

ii. ఇంధన ఉత్పత్తి, బయో-సిఎన్‌జి ఉత్పత్తి కోసం ప్రాజెక్ట్‌లను ప్రారంభించడానికి  అవసరమైన యంత్రాలు, విడిభాగాల దిగుమతిపై  కస్టమ్ డ్యూటీ రాయితీ.

iii . స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 కింద మున్సిపల్ సాలిడ్ వేస్ట్  ఆధారిత సిబిజీ ప్లాంట్ల కోసం అదనపు కేంద్ర సహాయం

iv. సిబిజీ కు తగిన సేకరణ ధర అందించి,  సిబిజీ ధర నిర్ణయించడం 

v .సహజ వాయువుతో సిబిజీని సహ-మిళితం చేసి వినియోగాన్ని ఎక్కువ చేయడానికి విధాన మార్గదర్శకాలు రూపొందించడం 

vi. బయోమాస్ పరికరాల సేకరణ కోసం సిబిజీ  ఉత్పత్తిదారులకు ఆర్థిక సహాయం అందించే పథకానికి ఆమోదం.

 vii .  2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి సిజీడీ రంగంలో   సిఎన్జీ  (రవాణా),పీఎన్జీ   (డొమెస్టిక్) విభాగాలలో దశల వారీగా తప్పనిసరిగా  సిబిజీని మిళితం చేయడం. 

viii. ప్రాధాన్య రంగ రుణాల పరిధిలో సిబిజీ  ప్రాజెక్ట్‌లను చేర్చడం.

ix. సిబిజీ ప్రాజెక్టులను ప్రాజెక్టుల వారీగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి   'వైట్ కేటగిరీ' లో  చేర్చడం.

x . మార్కెట్ అభివృద్ధి సహాయం కింద  సిబిజీ   ప్రాజెక్ట్‌ల నుండి ఉత్పత్తి అవుతున్న టన్ను   పులియబెట్టిన సేంద్రియ ఎరువుకు 1500/ రూపాయలు చెల్లించడం 

xi. పంట అవశేషాల నిర్వహణ పథకం, వ్యవసాయ యాంత్రీకరణ ఉప-మిషన్ కింద బయోమాస్ అగ్రిగేషన్ యంత్రాల సేకరణకు సహకారం

 xii . సంపీడన సహజ వాయువు (సిఎన్జీ )కు ప్రత్యామ్నాయంగా  మోటారు వాహనాల కోసం బయో-కంప్రెస్డ్ సహజ వాయువు ( బయో-సిఎన్జీ  ) వినియోగానికి అనుమతి.

xiii. మిశ్రమ సిఎన్జీ  లో ఉన్న కంప్రెస్డ్ బయో గ్యాస్‌పై చెల్లించిన జిఎస్టీ  మొత్తంపై ఎక్సైజ్ సుంకం మినహాయింపు.

xiv .నూతన  పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ఎక్కువ చేయడానికి స్వదేశీ సాంకేతిక అభివృద్ధి,  తయారీని అభివృద్ధి చేయడానికి పునరుత్పాదక ఇంధన పరిశోధన, సాంకేతిక అభివృద్ధి కార్యక్రమం.

xv. నిట్  జలంధర్‌తో సహకారంతో పునరుత్పాదక శక్తిపై ఎం టెక్ ప్రోగ్రామ్ ద్వారా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ (NIBE), కపుర్తలా ద్వారా సామర్ధ్య నిర్మాణ కార్యక్రమం అమలు 

xvi .   సాంకేతిక సహాయం, పరిశోధన అభివృద్ధి,, కొత్త బయోగ్యాస్ మోడల్స్/డిజైన్‌ల పరీక్ష మరియు ధృవీకరణ, బయోగ్యాస్ ప్లాంట్ల క్షేత్ర తనిఖీలు మరియు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి అందించడానికి ఎనిమిది బయోగ్యాస్ అభివృద్ధి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు

 xvii. ‘బయోగ్యాస్ (బయోమీథేన్) ప్లాంట్  డిజైన్, నిర్మాణం, ఇన్‌స్టాలేషన్, నిర్వహణ కోసం ప్రామాణిక IS 9478: 2023- ప్రాక్టీస్ కోడ్ అభివృద్ధి 

xviii   సిబిజీ వినియోగంలో ఎదురవుతున్న సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి  సిబిజీ ప్రాజెక్ట్‌లను సిజిడి వ్యవస్థతో  అనుసంధానించడానికి పైప్‌లైన్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించడానికి  2023  బడ్జెట్ లో నిధులు కేటాయించారు. 

పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ  మంత్రి శ్రీ రామేశ్వర్ తెలీ ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు  లిఖితపూర్వకంగా ఇచ్చిన  సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(Release ID: 1982632) Visitor Counter : 119
Read this release in: English , Urdu