మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

విద్యలో లింగ సమానత్వాన్ని సాధించడానికి ప్రభుత్వం అమలు చర్యలు

Posted On: 04 DEC 2023 5:35PM by PIB Hyderabad

 పాఠశాల విద్య కోసం 2018-19 నుంచి సమగ్ర కేంద్ర ప్రాయోజిత పధకాన్ని  పాఠశాల విద్య,అక్షరాస్యత విభాగం  అమలు చేస్తోంది.  జాతీయ విద్యా విధానం 2020 కి అనుగుణంగా  ఈ పథకం పునఃరూపకల్పన , సమలేఖనం చేయబడింది. ప్రీ-స్కూల్ నుంచి 12వ తరగతి వరకు పిల్లలందరికీ సమానమైన, సమ్మిళిత తరగతి గది వాతావరణంలో  నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చూడాలన్న లక్ష్యంతో పథకం అమలు జరుగుతోంది. విద్యార్థుల విభిన్న నేపథ్యం, బహుభాషా అవసరాలు, విభిన్న విద్యా సామర్థ్యాలు దృష్టిలో ఉంచుకుని అమలు జరుగుతున్న కార్యక్రమం వల్ల  అభ్యాస ప్రక్రియలో విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా చేస్తాయి. పథకం  ప్రధాన అంశాలు.. : (i) జాతీయ విద్యా విధానం 2020లో చేసిన  సిఫార్సులను అమలు చేయడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు  సహకారం అందించడం  (ii) పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్య హక్కు కల్పించడానికి  రూపొందించిన పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్య హక్కు (RTE) చట్టం 2009 అమలులో రాష్ట్రాలకు సహకారం అందించడం  (iii) బాల్య సంరక్షణ, విద్యపై దృష్టి సారించడం,  (iv) ప్రాథమిక అక్షరాస్యత,సంఖ్యా శాస్త్రంపై అవగాహన కల్పించడం  (v) విద్యార్థులకు 21వ శతాబ్దపు నైపుణ్యాలు  అందించడానికి సంపూర్ణ, సమీకృత,  కార్యాచరణ ఆధారిత పాఠ్యాంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం, (vi) నాణ్యమైన విద్యను అందించి  విద్యార్థుల అభ్యాస ఫలితాలు మెరుగుపరచడం (vii) పాఠశాల విద్యలో సామాజిక, లింగ వ్యత్యాసాలు  తగ్గించడం; (viii)   అన్ని స్థాయిలలో పాఠశాల విద్యలో  సమానత్వం, చేరికను సాధించడం  (ix) ఉపాధ్యాయులకు శిక్షణ అందించడం కోసం  స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERTలు)/స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్స్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (DIET)లను పటిష్టం చేసి స్థాయి పెంచడం  (x) సురక్షితమైన, సురక్షితమైన మరియు అనుకూలమైన అభ్యాస వాతావరణాన్నిఅభివృద్ధి చేసి పాఠశాల నిబంధనలలో ప్రమాణాల నిర్వహణ సాధించడం  (xi) వృత్తి విద్యను ప్రోత్సహించడం.

 సమగ్ర శిక్షా పథకం అమలులో  స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంతర్భాగంగా ఉంటాయి.  ఉపాధ్యాయ శిక్షణ కోసం నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న  స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, /స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్,డైట్‌లను బలోపేతం చేసి  అప్-గ్రేడేషన్ చేయడం పథకం ప్రధాన లక్ష్యాలలో ఒకటి. పథకం కింద స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్,,డైట్‌లను బలోపేతం చేయడానికి,   శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు  ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.  ఉపాధ్యాయుల శిక్షణ,  /ఇసిసిఇ నుంచి సీనియర్ సెకండరీ స్థాయి వరకు ఉపాధ్యాయులందరికీ కలిపి వార్షిక ఉపాధ్యాయ శిక్షణ క్యాలెండర్‌ల నిర్వహణ.అమలు  కోసం రాష్ట్రంలో నోడల్ ఏజెన్సీగా  స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వ్యవహరిస్తోంది. 

గతంలో అమలు జరిగిన సర్వశిక్షా అభియాన్ , రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, టీచర్ ఎడ్యుకేషన్ (TE)  పథకాలు ఇన్-సర్వీస్ టీచర్ , టీచర్ అధ్యాపకుల శిక్షణకు ప్రాధాన్యత ఇచ్చాయి.  ఈ శిక్షణా కార్యక్రమాలను  సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు   స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్,,డైట్‌ లు నిర్వహించాయి. . మాస్టర్ ట్రైనర్లు టీచర్ అధ్యాపకుల శిక్షణతో సహా ఇన్-సర్వీస్ టీచర్ ట్రైనింగ్ కోసం రాష్ట్ర నిర్దిష్ట ప్రతిపాదనల ప్రకారం ఈ పథకాల కింద ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు ఆర్థిక సదుపాయం కూడా అందించబడింది. సర్వశిక్షా అభియాన్ , రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, టీచర్ ఎడ్యుకేషన్  పథకాలు 2018-19 నుంచి అమలు లోకి వచ్చిన సమీకృత కేంద్ర ప్రాయోజిత పథకం సమగ్ర శిక్షా పధకంలో భాగంగా అమలు జరుగుతున్నాయి. 

ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి  పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు,ఉపాధ్యాయుల కోసం  నిష్ఠ పేరుతో ఒక సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో  కేంద్ర ప్రాయోజిత పథకంగా పాఠశాల విద్య  అక్షరాస్యత విభాగం అమలు చేస్తోంది. పాఠశాల విద్య  నాణ్యత మెరుగుపరచి  సామర్థ్య నిర్మాణ కార్యక్రమంగా నిష్ఠ అమలు జరుగుతోంది,

పాఠశాల విద్య  అన్ని స్థాయిలలో లింగ మరియు సామాజిక అంతరాలను తగ్గించడం సమగ్ర శిక్ష  ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు, ట్రాన్స్‌జెండర్‌లకు చెందిన బాలికలు, పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. . సమగ్ర శిక్ష కింద బాలికల కోసం వివిధ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. బాలికలకు సులభంగా అందుబాటులో ఉండేలా పరిసరాల్లో పాఠశాలలు తెరవడం, 8వ తరగతి వరకు బాలికలకు ఉచిత యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందించడం , మహిళా ఉపాధ్యాయులతో సహా అదనపు ఉపాధ్యాయులను నియమించడం మారుమూల ప్రాంతాలు/కొండ ప్రాంతాలలో  ఉపాధ్యాయులకు నివాస గృహాలు కేటాయించడం  CWSN బాలికలకు I నుండి XII తరగతి వరకు స్టైఫండ్, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, బాలికల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఉపాధ్యాయుల అవగాహన కార్యక్రమాలు, పాఠ్య పుస్తకాలతో సహా లింగ-సున్నితమైన బోధన-అభ్యాస సామగ్రి, స్వీయ రక్షణ శిక్షణ, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ఏర్పాటు లాంటి కార్యక్రమాలు సమగ్ర శిక్ష కార్యక్రమం కింద అమలు జరుగుతున్నాయి.

భోధన,బోధనా విధానాల్లో మార్పుతెచ్చి లింగ సమానత్వం సాధించడానికి  తరగతి గది వాతావరణాన్ని పెంపొందించే అభ్యాస కార్యకలాపాలను ఉపయోగించడానికి, స్వీకరించడానికి ఉపాధ్యాయులకు నిష్ఠ పథకం  సహాయపడుతుంది.  ఉపాధ్యాయులు కౌన్సెలింగ్, పోక్సో చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టం, పాఠశాల భద్రతా మార్గదర్శకాలు, హెల్ప్‌లైన్, అత్యవసర నంబర్లు, ఫిర్యాదుల కోసం డ్రాప్-బాక్స్ మొదలైన వాటిపై కూడా నిష్ఠ కార్యక్రమం ప్రాధాన్యత ఇస్తుంది. 

ప్రభుత్వ పాఠశాలల్లో  VI నుండి XII తరగతుల వరకు చదువుతున్న బాలికలకు 'రాణి లక్ష్మీ బాయి ఆత్మ రక్షా శిక్షణ' కింద ఆత్మరక్షణ శిక్షణ ఇస్తున్నారు.  బాలికలకు  భద్రతకల్పించడానికి, బాలికలకు దాడి ప్రమాదాన్ని అధిగమించడానికి,   ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి చర్యలు అమలు జరుగుతున్నాయి. . కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కెజిబివి) స్వీయ రక్షణ శిక్షణ కూడా ఇస్తున్నారు.  సమగ్ర శిక్ష కింద ఈ భాగానికి ఆర్థిక సహాయం అందించబడుతుంది.

ఈ సమాచారాన్ని విద్యాశాఖ సహాయ  మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో అందించారు. 

 

***



(Release ID: 1982630) Visitor Counter : 97


Read this release in: English , Urdu