ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 66వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న డీఆర్‌ఐ


నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణాను అరికట్టడంలో డీఆర్‌ఐ అధికారుల వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రశంసించిన కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి.నిర్మలా సీతారామన్ ప్రశంసించారు

వ్యవస్థీకృత సమూహాల బంధాన్ని విచ్ఛిన్నం చేయడంలో డీఆర్‌ఐ పాత్రను అభినందించిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి

కార్యక్రమంలో 'స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2022-23'ని విడుదల చేసిన సీబీఐసీ ఛైర్మన్; ఎన్‌ఫోర్స్‌మెంట్ విషయాలలో (జీసీసీఈఎం) సహకారంపై గ్లోబల్ కాన్ఫరెన్స్‌ను విజయవంతంగా నిర్వహించడంపై డీఆర్‌ఐకి అభినందనలు

2022-23 ఆర్ధిక సంవత్సరంలో రూ.11,500 కోట్ల విలువైన 522 స్మగ్లింగ్ కేసులు :డీజీ డీఆర్‌ఐ

2023లో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు నలుగురు డీఆర్‌ఐ అధికారులకు “వీరత ప్రశస్తి పత్ర” పురస్కారం

Posted On: 04 DEC 2023 7:56PM by PIB Hyderabad

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ & కస్టమ్స్ (సిబిఐసి)కు చెందిన  అపెక్స్ యాంటీ స్మగ్లింగ్ ఏజెన్సీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీ క్లబ్‌లో 66వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. డిఆర్‌ఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా  కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి.నిర్మలా సీతారామన్‌ ప్రత్యేక సందేశాన్ని అందించారు. బంగారం, మాదక ద్రవ్యాలు, సిగరెట్లు మరియు అంతరించిపోతున్న అడవి వృక్షజాలం మరియు జంతుజాలం వంటి నిషిద్ధ వస్తువుల స్మగ్లింగ్‌ను అరికట్టడంలో డిఆర్‌ఐ మరియు దాని అధికారుల పాత్రను వృత్తిపరమైన నైపుణ్యాన్ని నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. డిఆర్‌ఐ సంస్థతోపాటు అధికారులను, వారి ధైర్యం, సంకల్పం మరియు అవిరామ ప్రయత్నాలను గుర్తించి, భవిష్యత్ ప్రయత్నాలలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

 

 

కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి తన సందేశంలో.. వ్యవస్థీకృత సమూహాల బంధాన్ని విచ్ఛిన్నం చేయడంలో మరియు చట్టానికి లోబడి వారిని పట్టుకోవడంలో డిఆర్‌ఐ కృషిని అభినందించారు. పన్ను ఎగవేత మరియు స్మగ్లింగ్‌ను ఎదుర్కోవడంలో వారి అంకితభావం మరియు నిబద్ధతకు డిఆర్‌ఐ అధికారులను శ్రీ చౌదరి అభినందించారు. దేశ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడంలో డిఆర్‌ఐ తన ముఖ్యమైన పాత్రను కొనసాగిస్తుందని తాను ఆశిస్తున్నానని అన్నారు.

 

 


కార్యక్రమ ప్రారంభ వేడుకలో  సిబిఐసి చైర్మన్ శ్రీ సంజయ్ కుమార్ అగర్వాల్, సిబిఐసి సభ్యురాలు (కంప్లయన్స్ మేనేజ్‌మెంట్) శ్రీమతి రాజీవ్ తల్వార్,  ఐటీ, పన్ను చెల్లింపుదారుల సేవలు & సాంకేతికత సభ్యుడు వి.రామ మాథ్యూ, సిబిఐసి మరియు డిఆర్‌ఐ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ మోహన్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.

 

 

 

 స్మగ్లింగ్, కమర్షియల్ ఫ్రాడ్స్ మరియు ఇంటర్నేషనల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆపరేషన్స్ & కోఆపరేషన్‌లో ట్రెండ్‌లను విశ్లేషించే ‘స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2022-23’ని ఈ సందర్భంగా సిబిఐసి చైర్మన్ విడుదల చేశారు.

 

 ఈ సందర్భంగా సిబిఐసి ఛైర్మన్ శ్రీ అగర్వాల్ తన ప్రసంగంలో.. నైపుణ్యం కలిగిన అధికారులతో లీన్ సైజ్‌ను పూర్తి చేయడం మరియు ఇతర చట్టాన్ని అమలు చేసే సంస్థలతో కలిసి పని చేయడంపై డిఆర్‌ఐ మరియు ఆ సంస్థ అధికారులను  అభినందించారు. భారతదేశంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ మరియు అర్హత కలిగిన సిబ్బంది యొక్క పెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉండటం ద్వారా ఫోరెన్సిక్స్ పరంగా సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంపై శ్రీ అగర్వాల్ ఉద్ఘాటించారు.

స్మగ్లర్లు అవలంబిస్తున్న స్మగ్లింగ్ యొక్క కొత్త పోకడలను వివరిస్తూ స్మగ్లింగ్ ముప్పును ఎదుర్కోవడానికి డిఆర్‌ఐ తన సాంకేతికతను మరియు డేటా అనలిటిక్స్ నైపుణ్యాలను మెరుగుపరిచిందని సిబిఐసి చైర్మన్ ప్రశంసించారు.


 "నెట్‌వర్క్‌తో పోరాడటానికి నెట్‌వర్క్‌ను తీసుకుంటుంది" అనే అంశంపై డిఆర్‌ఐ ఆధ్వర్యంలో ఇటీవల విజయవంతంగా నిర్వహించబడిన గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విషయాలలో (జిసిసిఈఎం)ను శ్రీ అగర్వాల్ ప్రశంసించారు. వ్యవస్థీకృత క్రిమినల్ సిండికేట్‌లను ఎదుర్కోవడంలో అంతర్ ఏజెన్సీ సహకారం అనేక రెట్లు బలాన్ని పెంచుతుందని ఉద్ఘాటించారు. 

 

 

సిబిఐసి సభ్యుడు (కంప్లయన్స్ మేనేజ్‌మెంట్) శ్రీ రాజీవ్ తల్వార్ తన ప్రసంగంలో.. ఈ రోజు దేశంలో అత్యుత్తమ చట్టాన్ని అమలు చేసే సంస్థలలో ఒకటిగా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ, విశిష్ట రికార్డుతో 66 సంవత్సరాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు డిఆర్‌ఐని అభినందించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఐకు శుభాకాంక్షలు తెలిపారు.

 

 ప్రముఖులను స్వాగతిస్తూ డిఆర్‌ఐ ప్రిన్సిపల్ డీజీ శ్రీ మోహన్ కుమార్ సింగ్ గత ఆర్థిక సంవత్సరంలో డిఆర్‌ఐ పనితీరుపై నివేదికను సమర్పించారు.


నివేదిక గురించి శ్రీ సింగ్‌ ప్రేక్షకులకు తెలియజేస్తూ  2022-23 సంవత్సరంలో 522 స్మగ్లింగ్ కేసులు బుక్ చేయబడ్డాయని ఇందులో మొత్తం రూ. 11,500 కోట్లలో 1,300 కిలోల హెరాయిన్, 150 కిలోల కొకైన్, 250 కిలోల మెథాంఫెటమైన్, 25 ఎంటి గంజాయి మరియు 1,450 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ. 4,500 కోట్ల కస్టమ్ డ్యూటీ ఎగవేత గుర్తించబడింది, వాటిలో రూ. 1,800 కోట్లను అటువంటి ఎగవేతదారులు స్వచ్ఛందంగా చెల్లించారు. విచారణలను త్వరితగతిన ముగించి, ప్రాసిక్యూషన్‌లను సకాలంలో ప్రారంభించే దిశగా డిఆర్‌ఐ డ్రైవ్‌ను ప్రారంభించింది మరియు 944 కేసుల్లో దర్యాప్తును ముగించింది. 22-23లో 375 కేసుల్లో ప్రాసిక్యూషన్‌ను ప్రారంభించింది.

 ఈ సందర్భంగా వ్యవస్థీకృత స్మగ్లింగ్‌ను అరికట్టడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు ఈ క్రింది అధికారులకు 2023 సంవత్సరానికి "వీరత ప్రశస్తి పత్ర" ప్రదానం చేయబడింది:

 

  1. శ్రీ వాజిం ముస్తఫా, గౌహతి జోనల్ యూనిట్ డిప్యూటీ డైరెక్టర్
  2. చెన్నై జోనల్ యూనిట్ సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ శ్రీ బాల మురుగేషన్ ఆర్
  3. శ్రీ కామచ్చి ఆనంద్ కె, చెన్నై జోనల్ యూనిట్ సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మరియు
  4. శ్రీ అమన్ కుమార్, ఢిల్లీ జోనల్ యూనిట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్

 

 

 

 

 ఈ సందర్భంగా డిఆర్‌ఐ మాజీ డీజీ, సీబీఐసీ మాజీ చైర్మన్ శ్రీ సుకుమార్ శంకర్‌ను ఘనంగా సత్కరించారు.

 

 

ఈ సందర్భంగా డీఆర్‌ఐ అధికారి రాసిన కథనం, కవితలను హైలైట్ చేస్తూ హిందీ ప్రచురణ అయిన “రాజస్వ ప్రహరి” 12వ ఎడిషన్‌ను కూడా ఈ సందర్భంగా చైర్మన్, సీబీఐసీ విడుదల చేశారు.

అహ్మదాబాద్ జోనల్ యూనిట్ డిఆర్‌ఐ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ సమీర్ బజాజ్ "ధన్యవాదాల వోట్"తో ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసింది.

ఈ కార్యక్రమంలో ఇండియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల సీనియర్ ప్రతినిధులు మరియు మాజీ డిఆర్‌ఐ అధికారులతో సహా సిబిఐసి సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈవెంట్‌కు భౌతికంగా 200 మందికి పైగా పాల్గొన్నారు. అలాగే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా చేసారు.

***


(Release ID: 1982629) Visitor Counter : 83


Read this release in: English , Hindi