మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
దివ్యాంగ పిల్లలకు పాఠశాల విద్య కోసం పథకాలు
प्रविष्टि तिथि:
04 DEC 2023 5:38PM by PIB Hyderabad
పాఠశాల విద్య కోసం, కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాల విద్య & అక్షరాస్యత విభాగం అమలు చేస్తున్న సమగ్ర పథకం 'సమగ్ర శిక్ష'. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సహా ప్రి-ప్రైమరీ నుంచి సీనియర్ సెకండరీ స్థాయి వరకు అందరు పిల్లలకు ఈ కేంద్ర ప్రాయోజిత పథకం వర్తిస్తుంది. ఈ పథకంలో, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సమగ్ర విద్య (సీడబ్ల్యూఎస్‌ఎన్) కోసం ఒక ప్రత్యేక భాగం ఉంది. దీని ద్వారా, వివిధ అవసరాలు గల పిల్లలు చదువుకోవడానికి సహాయం, ఉపకరణాలు, సహాయక పరికరాలు & బోధన అభ్యాస సామగ్రి (టీఎల్‌ఎంలు), రవాణా, భద్రత, భత్యాలు అందించడం వంటివి అందుబాటులో ఉన్నాయి. విభాగ మద్దతులో భాగంగా వార్షిక బ్లాక్ గుర్తింపు, అంచనా శిబిరాలు, దివ్యాంగ బాలికలకు స్టైపెండ్‌లు వంటివి అందిస్తున్నారు. ఇవన్నీ, దివ్యాంగ పిల్లలు పాఠశాలలకు రావడానికి, విద్యను పూర్తి చేయడానికి ఉపయోగపడతాయి.
దివ్యాంగులు పట్టుకుని నడిచేలా హ్యాండ్‌రైలింగ్, వారి కోసం ప్రత్యేక మరుగుదొడ్ల ఏర్పాటు ద్వారా పాఠశాలల్లో ఇబ్బందులు లేని విద్య సదుపాయం కూడా ఈ పథకం కింద అందుబాటులోకి వచ్చింది. యూడైస్+ 2021-22 ప్రకారం, 5,89,986 పాఠశాలల్లో హ్యాండ్‌రైల్‌తో కూడిన నడక మార్గాలు ఉన్నాయి. 2,14,430 పాఠశాలల్లో బాలల ప్రత్యేక మరుగుదొడ్లు, 1,80,786 పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నాయి. వార్షిక కార్యాచరణ ప్రణాళిక, బడ్జెట్ కింద రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వార్షిక ప్రతిపాదనల ప్రకారం సమగ్ర శిక్ష కింద నిధులను కేంద్రం అందిస్తోంది.
దివ్యాంగ పిల్లలకు సంపూర్ణ విద్యను అందించడం కూడా సమగ్ర శిక్ష లక్ష్యం. ఇందులో, సామర్థ్యాలు/వైకల్యాలతో సంబంధం లేకుండా పిల్లలంతా ఒకే తరగతిలో కూర్చుని, కలిసి నేర్చుకుంటారు. తద్వారా, విద్యార్థులందరికీ ఒక విద్యా వాతావరణం లభిస్తుంది.
కేంద్ర విద్య శాఖ సహాయ మంత్రి శ్రీ అన్నపూర్ణాదేవి ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.
***
(रिलीज़ आईडी: 1982627)
आगंतुक पटल : 154