పర్యటక మంత్రిత్వ శాఖ

భారతదేశ పర్యాటక పర్యావరణ వ్యవస్థ యొక్క అపారమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది.

Posted On: 04 DEC 2023 2:46PM by PIB Hyderabad

పర్యాటక మంత్రిత్వ శాఖ డిసెంబర్ 01, 2023న న్యూఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది.

భారతదేశ పర్యాటక పర్యావరణ వ్యవస్థ యొక్క అపారమైన సామర్థ్యాన్ని అన్వేషించడం మరియు ప్రభావితం చేయడం ఈ సదస్సు లక్ష్యం. రౌండ్‌టేబుల్ ప్రయాణ మరియు పర్యాటక రంగంలో సుస్థిరమైన మరియు నిలకడైన అభివృద్ధికి కీలకమైన విధానాలు మరియు కారకాలపై కేంద్రీకృతమై ప్రభుత్వ అధికారులు మరియు పరిశ్రమల నాయకుల మధ్య  చర్చలను సులభతరం చేసింది.

 

నీతి ఆయోగ్, యునెస్కో, యూనెప్, డబ్ల్యూ టీ టీ సీ ఐ ఐ, ఐ యూ సీ ఎన్, ఐ హెచ్ ఎం సీ ఎల్, ఐ ఆర్ సీ టీ సీ,  పీ హెచ్ డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఎఫ్ హెచ్ ఆర్ ఎ ఐ మరియు ఇంట్రెపిడ్ గ్రూప్ వంటి అంతర్జాతీయ సంస్థలతో సహా గౌరవ సంస్థల నుండి పలువురు ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మంత్రిత్వ శాఖలు/విభాగాలు, ప్రయాణ మరియు పర్యాటక పరిశ్రమ మరియు విద్యా సంస్థల ప్రతినిధులతో కలిసి సంభాషణను సుసంపన్నం చేశారు.

 

సమావేశం యొక్క లక్ష్యాలు పర్యాటక పర్యావరణ వ్యవస్థ  పాలన, స్థానిక కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్, కార్మికుల పాత్ర, ఆర్థిక ప్రభావం, సాంకేతికత ప్రభావం, పర్యాటక గమ్యస్థానాలు, సాంస్కృతిక మరియు సహజ వనరుల సంరక్షణ, మౌలిక సదుపాయాలు మరియు పర్యావరణ సుస్థిరత వంటి ముఖ్యమైన రంగాలను కవర్ చేశాయి.

 

ప్రయాణ మరియు పర్యాటక విధానం మరియు పర్యావరణం, సానుకూలత కోసం షరతులు, పర్యాటక డిమాండ్ చోదక శక్తులు మరియు మౌలిక సదపాయాలు మరియు ప్రయాణ మరియు పర్యాటక సుస్థిర ప్రగతి పై దృష్టి సారించి విభిన్న నేపథ్య సెషన్‌లు రూపొందించబడ్డాయి.

 

వ్యూహాత్మక కేంద్రీకృతమైన ప్రాంతాలకు చర్చలు విస్తరించాయి, సాంస్కృతికంగా సంపన్నమైన రాష్ట్రాల గుర్తింపు, పర్యాటక రద్దీ దారిని మన వైపు మళ్లించడానికి డిజిటల్ వ్యూహాలను ఉపయోగించుకోవడం, ప్రతికూల దురభిప్రాయ అవగాహనలను ఎదుర్కోవడానికి కంటెంట్ సృష్టి మరియు విశ్వసనీయ డేటా మరియు ప్రమాణాలు తప్పనిసరి అవసరం. అదనంగా, బుకింగ్ నిర్ణయాలలో చారిత్రక ధోరణులు, పోకడలు, విద్యా విధాన సమ్మిళితం యొక్క ఆవశ్యకత మరియు పర్యాటక వృత్తికి సంబంధించి యువతలో మారుతున్న అవగాహనపై దృష్టి సారించింది.

 

ఈ కాన్ఫరెన్స్ యొక్క ఫలితం భారతదేశంలో పర్యాటకాన్ని ప్రగతి పథాన నడిపించడానికి మరియు దేశం యొక్క ప్రపంచ పర్యాటక స్థితిని బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖ యొక్క విజ్ఞాన పరిధి ని గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు.

 

భద్రత మరియు సురక్షిత, ఆరోగ్య సంరక్షణ పర్యాటక సంభావ్యత, డిజిటలైజేషన్ ప్రభావం, విదేశీయుల అవగాహనలో పరివర్తన, సమన్వయంతో కూడిన విధాన ప్రయత్నాలు, మీడియా ప్రాతినిధ్యం మరియు ప్రతిభను పెంపొందించడం, మరియు పరిశ్రమ ప్రగతి కోసం చొరవ వంటి ప్రధానమైన అంశాలను రౌండ్‌టేబుల్‌లో చర్చించారు.

 

రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విజ్ఞాన మార్పిడికి బలమైన వేదికగా పనిచేసింది మరియు భారతదేశ పర్యాటకాన్ని సుస్థిరమైన మరియు నూతన వృద్ధి వైపు నడిపించడానికి సహకార ప్రయత్నాలకు మార్గం సుగమం చేసింది. ఈ కార్యక్రమంలో చర్చించబడిన సామూహిక అంతర్దృష్టులు మరియు వ్యూహాలు ప్రపంచ పర్యాటక అగ్రగామిగా భారతదేశం యొక్క స్థానానికి గణనీయంగా దోహదపడతాయని అంచనా వేస్తున్నారు.

 

***



(Release ID: 1982392) Visitor Counter : 136