ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
కర్ణాటకలో ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ లో పాల్గొన్న – కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
Posted On:
30 NOV 2023 6:46PM by PIB Hyderabad
కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, ఎలక్ట్రానిక్స్,ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్, కర్ణాటకలోని చిక్కబల్లాపుర లో ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు, వాటి ప్రయోజనాలు నేరుగా ప్రజలకు చేరేలా చూసేందుకు ఈ యాత్ర దేశవ్యాప్త ఔట్-రీచ్ కార్యక్రమంగా పనిచేస్తుంది.
వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో పరస్పర చర్చ సందర్భంగా, కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, 2014 లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన పరివర్తన మిషన్ గురించి ప్రముఖంగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, “2014 నుంచి వికసిత్ భారత్’ దిశగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక లక్ష్యాలతో ఈ పరివర్తనాత్మక మిషన్ను ప్రారంభించారు. అవినీతి, బంధుప్రీతి, కుటిల పెట్టుబడిదారీ విధానాలను ఎదుర్కోవడం ద్వారా చివరి 5 స్థాయిల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థకు మొదటి 5 స్థాయిల్లో స్థానం కల్పించడంతో పాటు, దెబ్బతిన్న ప్రజాస్వామ్యాన్ని సరిదిద్దడం వంటివి వీటిలో ఉన్నాయి. ప్రజల జీవితాలను మార్చేందుకు, యువ భారతీయులకు అవకాశాలను విస్తరించేందుకు మన ప్రధానమంత్రి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ఈ విధానాన్ని నిర్దేశించారు. 2014 నుండి, భారతదేశం లక్షకు పైగా అంకుర సంస్థలను వృద్ధి చేసింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ వ్యవస్థను ఒక క్రమపద్ధతిలో ప్రక్షాళన చేయడంతో, మన సామూహిక ఆకాంక్ష నూతన భారతదేశ సాకారంగా పరిణామం చెందింది. 2047 నాటికి యువ భారతీయుల అపరిమితమైన శక్తి, సామర్థ్యాలతో నడిచే వికసిత్ భారత్ ను లక్ష్యంగా చేసుకుని మనం ఈరోజు మన దృష్టిని ఉన్నతంగా ఉంచాము.” అని తెలియజేశారు.
అనంతరం, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధిదారులకు కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ గ్యాస్ స్టవ్, ఎల్.పి.జి. సిలిండర్ ను అందజేశారు, కేంద్రం నిర్దేశించుకున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా పౌరుల జీవితాలను మెరుగుపరచడంలో ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది.
*****
(Release ID: 1981698)
Visitor Counter : 99