సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner
0 3

ఐఫి 54వ ఉత్సవాలలో ప్రముఖ భారత చలనచిత్ర దర్శకుడు రిషబ్ శెట్టి కి ప్రత్యేక గౌరవం. కాంతార లో వారి కృషికి ప్రత్యేక జ్యూరీ అవార్డు.

ప్రముఖ చలనచిత్ర దర్శకుడు , నటుడు, రచయిత రిషబ్ శెట్టిని , 54వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రతిష్ఠాత్మక స్పెషల్ జ్యూరీ అవార్డుతో సత్కరించారు.కాంతారా చిత్రంద్వారా  ఆయన చేసిన కృషికి ఈ స్పెషల్ జ్యూరీ అవార్డుతో ఆయనను గౌరవించారు. చలన చిత్రోత్సవం  ముగింపు సందర్భంగా కాంతారా , చాప్టర్ ‌‌1 ప్రీక్వెల్. ఫస్ట్ లుక్ ట్రైలర్ను ప్రదర్శించారు.
దీనికి ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభించాయి.తనను స్పెషల్ జ్యూరీ అవార్డుతో గౌరవించినందుకు రిషబ్ శెట్టి  కృతజ్ఞతలు తెలిపారు. “నాకుస్పెషల్ జ్యూరీ   అవార్డును ఈ ప్రతిష్ఠాత్మకవేదికపై ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది ”అని ఆయన అన్నారు.
తాను  తీసే చిత్రాల వెనుక ఉన్న  తాత్వికత గురించి  ప్రస్తావిస్తూ ఆయన, “నా చిత్రాలు వాటంతట అవే మాట్లాడేలా ఉండడాన్ని నేను విశ్వసిస్తాను. ఎంత తక్కువ మాట్లాడితే  అంత ఎక్కువ విజయం ”అని ఆయన అన్నారు.
కాంతారా లో రిషబ్ శెట్టి ప్రతిభ ,ఆయన వినమ్రత, అంకిత భావం అన్నీ ప్రజల కళ్లముందు మెదులుతూనే ఉన్నాయి.
భారతీయ చలన చిత్ర అంతర్జాతీయవిస్తరణ గురించి ప్రస్తావిస్తూ రిషబ్శెట్టి, భారతీయ సినిమా, వాస్తవ అంతర్జాతీయ స్థాయికి చేరిందన్నారు. ఇండియా నుంచి అద్భుతమైన కంటెంట్ రావడం ఫలితమే ఇది అని ఆయన అన్నారు.
కన్నడ సినిమాకు గల అంతర్జాతీయ ప్రేక్షకాదరణ గురించి ప్రస్తావిస్తూ, రిషబ్ శెట్టి, కన్నడ సినిమా , భాష సంబంధింత అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతున్నదన్నారు.  కాంతారాకు లభించిన విశేష ఆదరణ ఇందుకు నిదర్శనమన్నారు.
ప్రజలతో తనకు గల అనుబంధాన్ని ప్రస్తావిస్తూ శెట్టి, “నా చిత్రాలు వ్యక్తుల మధ్య గల అనుబంధాలో, భావోద్వేగాలకు కొనసాగింపు మాత్రమే’’నని ఆయన అన్నారు.

దేశీయ సంస్కృతి సంప్రదాయాలను చలనచిత్రాలలో ప్రతిబింబింపచేయడంలో శెట్టి దర్శకత్వ ప్రతిభను జ్యూరీ ప్రత్యేకంగా గుర్తించింది. అంతర్జాతీయంగా ,వివిధ సంస్కృతులు, సంప్రదాయలు సమాజాల అవరోధాలను అధిగమించేలా చేయడంలో ఆయన ప్రతిభ ప్రత్యేకం. కాంతారా మానవులకు, ప్రకృతికి మధ్య సైద్ధాంతిక పరమైన ఘర్షణను మనకు చూపుతుంది. అలాగే సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య ఘర్షణ నేపథ్యంలో మనకు ఒక శక్తిమంతమైన సందేశాన్ని ఇస్తుంది.
రిషభ్ శెట్టికి రజత నెమలి మెడల్ తోపాటు 15 లక్షల రూపాయలు, సర్టిఫికెట్ను బహుకరించారు.

***

iffi reel

(Release ID: 1981009) Visitor Counter : 177