సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

మహిళల జీవితాల్లో క్రీడల పరివర్తన శక్తికి అద్దంపట్టే ‘ఫైట్ లైక్ ఎ గర్ల్’


ఈ చిత్రం రూపొందించడం కాంగోలోని మహిళల కోసం బాక్సింగ్ క్లబ్ నుండి ప్రేరణ పొందింది: దర్శకుడు మాథ్యూ లెట్‌వైలర్

Posted On: 24 NOV 2023 7:17PM by PIB Hyderabad

మాథ్యూ లెట్వైలర్ దర్శకత్వం వహించిన ‘ఫైట్ లైక్  గర్ల్’ చలన చిత్రం అక్రమ ఖనిజ తవ్వకాల గని నుండి తప్పించుకున్న తర్వాత బాక్సింగ్ రింగ్లో కొత్త జీవితాన్ని కనుగొన్న యువ కాంగో మహిళ యొక్క కథకు అద్దంపడుతుంది. గోవాలో జరుగుతున్న 54 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో 'సినిమా ఆఫ్ ది వరల్డ్విభాగంలో  చిత్రం ప్రదర్శించబడుతోంది.  పీఐబీ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మీడియా మరియు ప్రతినిధులతో దర్శకుడు ముచ్చటించినప్పుడు మాథ్యూ లెట్వైలర్  చిత్రం వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొంది రూపొందించినట్టుగా తెలిపారు.  “ఇది తూర్పు కాంగోలో ఒక సైనికుడు ప్రారంభించిన మహిళా బాక్సింగ్ క్లబ్ కథ ఆధారంగా రూపొందించబడిందిలైంగిక హింస మరియు ద్రోహానికి గురైన యువతులు అతనిని సంప్రదిస్తుంది. అతను బాక్సింగ్ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడంలో సహాయపడేందుకు ప్రయత్నిస్తున్నాడు రోజు  యువతి తన తండ్రిని చంపిన వ్యక్తిని కనిపెట్టాలనే ఉద్దేశంతో బాక్సింగ్ క్లబ్కు వస్తుంది.   కానీ తరువాత ఆమె ప్రతీకారం రూపాంతరం చెందుతుంది మరియు ఆమె బాక్సింగ్ను ఒక క్రీడగా స్వీకరించి రాణిస్తుంది.  మహిళ జీవితమే నన్ను సినిమా తీయడానికి ప్రేరేపించింది”  అని దర్శకుడు తెలిపారు. " చిత్రం యొక్క ప్రత్యేక అంశం ఏమిటంటే, 80% తారాగణం నటులు కాదుఅని మాథ్యూ ల్యూట్వైలర్ చిత్ర నిర్మాణ ప్రక్రియను గుర్తుచేసుకుంటూ వివరించారు. "చూపబడిన క్లబ్లోని చాలా మంది బాక్సర్లు కాంగో యొక్క అంతర్గత భాగాల నుండి వచ్చిన నిజమైన బాక్సర్లుఅని తెలిపారు. కథానాయిక అమా కమతా పాత్ర కోసం తాను చేసిన సన్నాహాల గురించి వివరంగా చెబుతూనిజ జీవితంలో ఎప్పుడూ పోరాటం చేయని వ్యక్తి కాబట్టిబాక్సర్ పాత్రలో అడుగు పెట్టడం పెద్ద సవాలుగా మారిందన్నారు. "సన్నాహాల్లో భాగంగా, నేను వారానికి ఆరు రోజులు ఉదయం రెండు గంటలు మరియు సాయంత్రం రెండు గంటలు శిక్షణ తీసుకుంన్నాను" అని ఆమె తెలిపారు. ఆమె మాట్లాడుతూ “సినిమాలో నా పాత్ర కేవలం బాక్సర్ మాత్రమే కాదు.  ఇది దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడటం, వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటం మరియు జీవితం కోసం పోరాడటం." అని అన్నారు.

 

సారాంశం:

ఒక అక్రమ ఖనిజ గనిలో బలవంతంగా పనిచేయవలసి వచ్చిన కాంగో యువతి, ఆమెను బంధించిన వారి నుండి తప్పించుకుంటుంది. సరిహద్దు నగరమైన గోమాలోని ప్రఖ్యాత ఆల్-మహిళా బాక్సింగ్ క్లబ్‌లో చేరి ఆ తర్వాత ఆమె తనకంటూ ఒక కొత్త జీవితాన్ని రూపొందించుకుంటుంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

పాత్రికేయులతో చిత్ర  బృందం సమావేశాన్ని ఇక్కడ వీక్షించవచ్చు:

 

***



(Release ID: 1979876) Visitor Counter : 148


Read this release in: English , Urdu , Hindi , Marathi