సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner

సినిమాల్లో మ‌హిళ‌లకు స‌మ‌యం వ‌స్తోందిః లాట్వియ‌న్ చిత్రం ఫ్రెజైల్ బ్ల‌డ్ ద‌ర్శ‌కురాలు ఊనా చెల్మా

 సినిమాల‌లో మ‌హిళ‌ల‌కు స‌మ‌యం వ‌స్తోంది, అని లాట్వియ‌న్ చిత్రం ఫ్రెజైల్ బ్ల‌డ్ చిత్ర ద‌ర్శ‌కురాలు ఊనా అన్నారు. గోవాలో జ‌రుగుతున్న 54వ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాలో ప్ర‌పంచ సినిమా అన్న వ‌ర్గం కింద 22 న‌వంబ‌ర్ 2023న త‌న చిత్రం అంత‌ర్జాతీయ ప్రిమియ‌ర్ లోప్ర‌ద‌ర్శిత‌మైన అనంత‌రం ఊనా విచ్చేసిన ప్ర‌తినిధులు, మీడియాతో ముచ్చ‌టించారు. 
చిత్రం పుట్టుక గురించి మాట్లాడుతూ, గృహ హింస‌, ప‌ని చేసే చోట, క్ల‌బ్బుల్లోనూ మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న హింస‌కు సంబంధించిన లెక్క‌లేనంత మంది క‌థ‌నాల‌ను విన‌డాన్ని కొన‌సాగించాన‌ని, అదే ఈ సినిమా గురించి ఆలోచించేలా చేసిన అన్నారు. ఈ చిత్రం కేవ‌లం భౌతిక హింసను ప్ర‌ద‌ర్శించ‌డానికి ఆవ‌ల‌కు వెళ్ళి, మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న మాన‌సిక‌, లైంగిక హింస‌పై వెలుగును ప్ర‌స‌రిస్తుంద‌ని వివ‌రించారు. మీడియాతో ముచ్చ‌టిస్తూ, చ‌ట్టం, చ‌ట్టాన్ని అమ‌లు చేసేందుకు ఏజెన్సీలూ ఉన్న‌ప్ప‌టికీ, గృహ హింస కొన‌సాగుతోంద‌ని ఆమె అన్నారు.
త‌న దేశంలో సినిమాల‌ను నిర్మించేందుకు మ‌హిళ‌లు ప్ర‌వాహంలా రావ‌డాన్ని గురించి ప‌ట్టి చూపుతూ, కాలం మారుతోంది, గ‌తంతో పోలిస్తే నేడు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చేరేందుకు గ‌ణ‌నీయ‌మైన సంఖ్య‌లో మ‌హిళ‌లు ముందుకు వ‌స్తున్నారు, భాగ‌స్వాముల‌వుతున్నార‌న్నారు. 

చిత్ర సారాంశంః
కాల్ప‌నిక‌త‌కు, వాస్త‌విక‌త మ‌స‌క‌బారే స‌మాజంలో, క‌థానాయ‌కి డ‌యానా సామాజిక క‌ట్టుబాట్ల‌కు, నియ‌మాల‌కు క‌ట్టుబ‌డి ఉండేందుకు పోరాటం చేస్తుంటుంది. ఇగోర్‌తో స‌హ ఆధారిత వివాహంలో చిక్కుకుపోయిన ఆమె, త‌న కుమార్తె ఆస్ట్రాను బాధ‌పెట్టే అవ‌కాశం ఉంది. అప్పుడు ఆమె కుమార్తా?  లేక భ‌ర్తా? అన్న కీల‌క ఎంపిక ఆమె ఎదుట నిలిచింది. భ్ర‌మ‌లు వాస్త‌విక‌త‌తో క‌లిసిపోతున్న నేప‌థ్యంలో,  ఇప్ప‌టికే ఆల‌శ్య‌మైందా అన్న విష‌యాన్ని డ‌యానా నిర్ణ‌యించుకోవాలి. 
తారాగ‌ణం & సిబ్బందిః

ద‌ర్శ‌కురాలుః ఊనా చెల్మా 
నిర్మాత‌లుః డేస్ సియాత్కోవ్‌స్కా, ఊనా చెల్మా
స్క్రీన్ ప్లేః ఊనా చెల్మా
తారాగ‌ణంః ల్జే కుజులే, ఎగాన్స్ డొబ్రోవ్‌స్కిస్‌, అందా రీన్‌

పూర్తి సంభాష‌ణ‌ను ఇక్క‌డ చూడండిః

***
 

iffi reel

(Release ID: 1979868) Visitor Counter : 106


Read this release in: Marathi , Urdu , English , Hindi