ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ 2023పై ఆరోగ్య మంత్రుల సమావేశంలో కీలకోపన్యాసం చేసిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


“భారతదేశం మూడు కీలకమైన ఆరోగ్య ప్రాధాన్యతలను గుర్తించింది. ఆరోగ్య అత్యవసర పరిస్థితి నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందన అంశాలకు భారతదేశం ప్రాధాన్యత ఇస్తోంది. ఔషధ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం దక్షిణ దేశాలు దేశాలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను డిజిటల్ ఆరోగ్య సంరక్షణ చర్యలు అవసరం" డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

21వ శతాబ్దపు అవసరాలు, ప్రపంచ సవాళ్లు ప్రత్యేకించి దక్షిణ దేశాల అవసరాలకు అనుగుణంగా పనిచేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది .. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

అవసరాలకు అనుగుణంగా విద్యా రంగంలో మార్పులు తేవడం, వన్ హెల్త్ విధానాన్ని అమలు చేయడం, మహమ్మారి సంసిద్ధతను మెరుగుపరచడం మరియు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం అవసరం.. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

"పెరుగుతున్న అంటు వ్యాధులను, ముఖ్యంగా వన్యప్రాణుల ప్రదేశాల నుండి వ్యాపించే వ్యాధులను పర్యవేక్షించి,పరిశోధించి ముందస్తుగా గుర్తించడం, ప్రతిస్పందన కోసం వివిధ వర్గాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే విధంగా భారతదేశంలో వన్ హెల్త్ ప్రోగ్రాం అమలు జరుగుతోంది"... డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
ఆర్థిక పురోగతి, సమాజాభివృద్ధి, పటిష్ట ఆరోగ్య సంరక్షణ

Posted On: 17 NOV 2023 6:38PM by PIB Hyderabad

 ఆరోగ్య అత్యవసర పరిస్థితి నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ భారతదేశంలో  ఆరోగ్య సంరక్షణ కార్యకమాలు అమలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి  డాక్టర్ మన్సుఖ్ మాండవీయ  తెలిపారు. ఔషధ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం దక్షిణ దేశాలు  దేశాలు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను  డిజిటల్ ఆరోగ్య సంరక్షణ చర్యలు అవసరం అని డాక్టర్ మాండవీయ అన్నారు. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన 2వ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సులో భాగంగా జరిగిన ఆరోగ్య శాఖ మంత్రుల సమావేశంలో వర్చువల్ విధానంలో పాల్గొని డాక్టర్ మాండవీయ కీలకోపన్యాసం ఇచ్చారు. "మొదటిసారి జరిగిన  వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సదస్సు తర్వాత భారతదేశం ఆరోగ్య రంగంలో మూడు ప్రాధాన్య అంశాలను గుర్తించిందని డాక్టర్ మాండవీయ తెలిపారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నివారణ, సంసిద్ధత, ప్రతిస్పందన, ఫార్మాస్యూటికల్ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు పరిష్కారాలను   భారతదేశం ప్రాధాన్యత అంశాలుగా గుర్తించి కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు.  అర్జెంటీనా, బెలిజ్, చాడ్, గ్రెనడా, గ్వాటెమాల, రిపబ్లిక్ ఆఫ్ గయానా, హైతీ, మౌరిటేనియా, మొరాకో, నికరాగ్వా, సోమాలియా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ గ్రెనడైన్స్, రిపబ్లిక్ ఆఫ్ యెమెన్ , కోస్టా రికా, కామన్వెల్త్ ఆఫ్ డొమినికా, బెనిన్ , భూటాన్ దేశాల ఆరోగ్య మంత్రులు,ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. 

“గ్లోబల్ సౌత్ దేశాలు ఎదుర్కొంటున్న ప్రత్యేక  సవాళ్లను డాక్టర్ మాండవీయ తన ప్రసంగంలో ప్రస్తావించారు. 21వ శతాబ్దపు సమకాలీన అవసరాలు  ప్రపంచ సవాళ్ల పరిష్కారాని భారతదేశం చేస్తున్న కృషిని వివరించారు. 

వన్ హెల్త్ విధానం  ప్రాముఖ్యతను వివరించిన డాక్టర్ మాండవీయ  "మానవ ఆరోగ్యం, జంతు ఆరోగ్యం , పర్యావరణ ఆరోగ్యాన్ని కలిపే బహుళ విభాగాలతో కూడిన సంక్లిష్ట ప్రజారోగ్య సమస్యల పరిష్కారానికి వన్ హెల్త్ విధానం   సమర్థవంతమైన విధానంగా ఉంటుందని  కేంద్ర ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. తీవ్రమైన శ్వాసకోశ ఆరోగ్య సమస్యల నుంచి కోవిడ్--19 లాంటి వ్యాధులు ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగిస్తున్నాయని ఆయన న్నారు.  అంటువ్యాధులు , మహమ్మారిలో ఎక్కువ భాగం జంతు  మూలాలు కలిగి ఉన్నాయని గుర్తించడం అత్యవసరం అని ఆయన అన్నారు. "అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల కమిటీలు నిర్వహించిన అధ్యయనాలు ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలు గుర్తించాయి.ప్రజలందరికీ ఆరోగ్య సంరక్షణ, విద్య అవకాశాలు  అందడం లేదు.   విద్యా వ్యవస్థను మార్చడం,  వన్ హెల్త్ విధానాన్ని అమలు చేయడం, మహమ్మారి సంసిద్ధతను మెరుగుపరచడం , ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలు అమలు జరగాలి ” అని ఆయన అన్నారు.

ఆరోగ్య సంరక్షణ కోసం భారతదేశం అమలు చేస్తున్న కార్యక్రమాలను డాక్టర్ మాండవీయ వివరించారు.  “జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ముఖ్యమైన వన్ హెల్త్-సంబంధిత కార్యక్రమాల  ముందంజలో ఉంది, ఆరోగ్యాన్ని ఒక ప్రాథమిక సూత్రంగాగుర్తించి కార్యక్రమాలను అమలు చేస్తోంది. భారతదేశం అమలు చేస్తున్న  వన్ హెల్త్ ప్రోగ్రాంపెరుగుతున్న  అంటు వ్యాధులను శ్రద్ధగా పర్యవేక్షిస్తుంది, పరిశోధిస్తుంది. ముఖ్యంగా వన్యప్రాణుల నుంచి వ్యాపించే వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, ప్రతిస్పందన కోసం విభిన్న వర్గాల  మధ్య సమన్వయాన్ని పెంపొందించడం పై దృష్టి సారించి వ్యవస్థ పనిచేస్తోంది.  వ్యాధులను పర్యవేక్షించడానికి, నిరోధించడానికి మానవులు, జంతువులు ,పర్యావరణం మధ్య ముడిపడి ఉన్న  అంశాలు పరిశీలించడానికి సమగ్ర విధానాన్ని  నేషనల్ వన్ హెల్త్ మిషన్ అమలు చేస్తుంది." అని మంత్రి వివరించారు.  "ఈ మిషన్ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల మధ్య  సమన్వయాన్ని సులభతరం చేస్తుంది, మానవులు, జంతువులలో ప్రాధాన్యత కలిగిన వ్యాధుల నిర్మూలించడానికి  సమగ్ర మహమ్మారి సంసిద్ధత, సమగ్ర వ్యాధి నియంత్రణ  లక్ష్యంగాపెట్టుకుని కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. " అని ఆయన చెప్పారు.

ఆర్థిక వ్యవస్థ,  ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, విద్యా వ్యవస్థ,మౌలిక సదుపాయాలలో పునరుద్ధరణను పెంపొందించడానికి సమిష్టి కృషి అవసరమని డాక్టర్ మాండవ్య అన్నారు.సుస్థిర అభివృద్ధిలో మహిళల ప్రధాన పాత్ర కల్పించాలని  ఆయన అన్నారు. గ్లోబల్ సౌత్‌లో ప్రజారోగ్య కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI)  ప్రాముఖ్యతను  ఆయన వివరించారు. "ఆరోగ్య సంరక్షణ సవాళ్లను ఎదుర్కోవడం, ప్రజలందరికీ  వైద్య వనరులకు సమానమైన ప్రాప్యతను పెంపొందించడంలో డిజిటల్ విధానాలు, నెట్‌వర్క్‌లు, సేవలు  కీలక పాత్రపోషిస్తాయి " అని ఆయన అన్నారు.

సహకారం అనేది ఒక ఎంపిక కాదు ఒక అవసరం అని కేంద్ర ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు.జీ-20 ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో వన్   హెల్త్ విధానాన్ని పొందుపరిచిన  భారతదేశం ఆరోగ్య సంరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యత తెలియజేసిందన్నారు.  పరిశోధన, అభివృద్ధి, అంటువ్యాధుల  నివారణ, నియంత్రణ, సంబంధిత జాతీయ కార్యాచరణ ప్రణాళికలఅమలుకు భారతదేశం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వివరించారు. అందరికీ ఆరోగ్యం అందించడానికి సభ్య దేశాలు కృషి చేయాలని కోరిన మంత్రి దీనికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని అన్నారు. 

***

 


(Release ID: 1977952) Visitor Counter : 65


Read this release in: English , Urdu , Hindi , Marathi