వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పిరిటీ (ఐపీఈఎఫ్ ) సరఫరా గొలుసు ఒప్పందంపై సంతకాలు చేసిన 14 ఐపీఈఎఫ్ దేశాలు
విస్తృత చర్చల అనంతరం పిల్లర్-III (క్లీన్ ఎకానమీ) పిల్లర్-IV (ఫెయిర్ ఎకానమీ) , ఆర్థిక శ్రేయస్సు కోసం ఇండో-పసిఫిక్ వ్యవస్థ ఏర్పాటుకు కుదిరిన అంగీకారం
అన్ని కార్యాచరణ-ఆధారిత సహకార అంశాలు వేగంగా అమలు చేయడానికి ప్రయత్నాలను వేగవంతం చేయాలి.. శ్రీ పీయూష్ గోయల్
प्रविष्टि तिथि:
17 NOV 2023 10:26AM by PIB Hyderabad
మూడవ ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పిరిటీ (ఐపీఈఎఫ్) మంత్రుల స్థాయి సమావేశం 2023 నవంబర్ 14న కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. అమెరికా ఆతిధ్యం ఇచ్చిన సమావేశంలో కేంద్ర . కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు.
అమెరికా, ఇండో-పసిఫిక్ప్రాంతానికి చెందిన ఇతర భాగస్వామ్య దేశాలు సంయుక్తంగా మే 23, 2022న టోక్యోలో ఐపీఈఎఫ్ని ప్రారంభించాయి.. ఆస్ట్రేలియా, బ్రూనై, ఫిజి, ఇండియా, ఇండోనేషియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, అమెరికాతో సహా 14 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి, శాంతి మరియు శ్రేయస్సును ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో భాగస్వామ్య దేశాల మధ్య ఆర్థిక నిశ్చితార్థాన్ని బలోపేతం చేయడానికి ఐపీఈఎఫ్ కృషి చేస్తోంది.
నాలుగు అంశాల ప్రాతిపదికగా ఐపీఈఎఫ్ ఏర్పాటు అయ్యింది. (పిల్లర్ I) సరఫరా గొలుసు (పిల్లర్ II) క్లీన్ ఎకానమీ, (పిల్లర్ III) ఫెయిర్ ఎకానమీ (పిల్లర్ IV) పై దృష్టి సారించి ఐపీఈఎఫ్ పనిచేస్తుంది. . పిల్లర్-Iలో పరిశీలక హోదాను కలిగి ఉన్న భారతదేశం పిల్లర్స్ II నుంచి IV వరకు సభ్యత్వం పొందింది.
మంత్రుల స్థాయి సమావేశంలో ఐపీఈఎఫ్ పిల్లర్-III (క్లీన్ ఎకానమీ), పిల్లర్ IV (ఫెయిర్ ఎకానమీ), ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ (ఇది మంత్రివర్గ స్థాయి కౌన్సిల్ మరియు కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుంది) కింద చర్చలు జరిగాయి. చర్చలు ఫలప్రదంగా ముగిసాయి. 2023 మే నెలలో జరిగిన సమావేశంలో ఐపీఈఎఫ్ సరఫరా గొలుసు ఒప్పందంపై చర్చలు జరిపింది. మంత్రుల స్థాయి సమావేశంలో ఐపీఈఎఫ్ సరఫరా గొలుసు ఒప్పందంపై మంత్రులు సంతకం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో సమావేశం ముగిసిన తర్వాత స్తంభాల వారీగా ప్రెస్ స్టేట్‌మెంట్ జారీ అయ్యింది. ఒకో అంశంలో పొందుపరిచిన ప్రధాన అంశాలు, అమలు చేయడానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక విడుదల అయ్యింది.
క్లీన్ ఎకానమీ (పిల్లర్-III) కింద కుదిరిన ఒప్పందంలో భాగంగా పరిశోధన, అభివృద్ధి, వాణిజ్యీకరణ, లభ్యత, ప్రాప్యత, స్వచ్ఛమైన ఇంధనం మరియు వాతావరణ అనుకూల సాంకేతికతల విస్తరణపై సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడం,ఈ ప్రాంతంలో వాతావరణ సంబంధిత ప్రాజెక్టులకు పెట్టుబడిని సులభతరం చేయాలని సభ్య దేశాలు అంగీకరించాయి. ఈ అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న శ్రీ గోయల్ వినూత్న,సరసమైన వాతావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన, అభివృద్ధి అంశాల్లో సభ్య దేశాల మధ్య సహకారం ఎక్కువ కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. హైడ్రోజన్ సరఫరా ,పరిశీలనలో ఉన్న ఇతర ప్రతిపాదనలు జీవ ఇంధనాలు, ఇ-వ్యర్థాల రీసైక్లింగ్ వంటి కార్యక్రమాల అమలుకు సహకారం అందించాలని ఆయన సభ్య దేశాలకు సూచించారు.
ఫెయిర్ ఎకానమీ (పిల్లర్-IV) కింద కుదిరిన ఒప్పందంలో కింద సభ్య దేశాలు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యం, పెట్టుబడిని పెంచడానికి సమర్థవంతమైన అవినీతి నిరోధక, పన్ను చర్యల అమలు చేయడానికి అంగీకరించాయి. ఈ అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న శ్రీ గోయల్ భాగస్వాముల మధ్య సమాచార భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం, ఆస్తుల రికవరీని సులభతరం చేయడం, , సీమాంతర పరిశోధనలు, ప్రాసిక్యూషన్‌లను బలోపేతం చేయడం లాంటి ప్రధాన అంశాలను ప్రస్తావించారు. అవినీతి, మనీలాండరింగ్, తీవ్రవాద కార్యక్రమాలకు నిధులు అందకుండా చూడడానికి సంయుక్త కృషి జరగాలన్నారు.
ఐపీఈఎఫ్
* Link to Pillar II-IV San Francisco IPEF Statement
* పిల్లర్ II-IV శాన్ ఫ్రాన్సిస్కో IPEF స్టేట్‌మెంట్‌కి లింక్
***
(रिलीज़ आईडी: 1977948)
आगंतुक पटल : 180