శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారతదేశం యొక్క ప్రపంచ ఆధిపత్యం దాని శాస్త్రీయ నైపుణ్యం ద్వారా నిర్ణయించబడుతుంది: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
చంద్రయాన్-3 మరియు కోవిడ్ వ్యాక్సిన్ వంటి తాజా విజయాలు భారతదేశ శాస్త్రీయ సామర్థ్యాలను అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా ఉంచాయి: డాక్టర్ జితేంద్ర సింగ్
'ఈజ్ ఆఫ్ లివింగ్' కోసం సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ ద్వారా ప్రయోజనం పొందగల వారికి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఔట్ రీచ్ ఫెస్టివల్ అని తెలిపిన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి
Posted On:
16 NOV 2023 3:54PM by PIB Hyderabad
భారతదేశం యొక్క ప్రపంచ ఆధిపత్యం దాని శాస్త్రీయ నైపుణ్యం ద్వారా నిర్ణయించబడుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు అన్నారు.
చంద్రయాన్-3 మరియు కోవిడ్ వ్యాక్సిన్ వంటి ఇటీవలి జంట విజయాలు భారతదేశ శాస్త్రీయ సమాజాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా ఉంచాయని ఆయన అన్నారు.
2024 జనవరిలో ఫరీదాబాద్‌లో జరగనున్న 9వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్‌ఎఫ్) - 2023 గురించి కేంద్ర సైన్స్ & టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ డాక్టర్ జితేంద్ర సింగ్ మీడియాకు వివరించారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో గత 9 సంవత్సరాలలో సామాన్యులకు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ తీసుకురావడానికి శాస్త్రీయ పురోగతులు ఉపయోగించబడ్డాయన్నారు.
సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ ద్వారా ప్రయోజనం పొందగల వారికి ఐఐఎస్‌ఎఫ్ ఒక ఔట్రీచ్ ఫెస్టివల్. దాదాపు అన్ని మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు రంగాల అభివృద్ధి కోసం ఎస్‌టిఐ అప్లికేషన్‌లను కలిగి ఉన్నందున మన జీవితంలోని ప్రతి అంశంలో సైన్స్ & టెక్నాలజీ పాత్ర విస్తరించిందని కేంద్రమంత్రి చెప్పారు.
రోడ్లు, రైల్వేలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లు, టెలిమెడిసిన్, డీప్ సీ ఎక్స్‌ప్లోరేషన్, గ్రౌండ్ వాటర్ మ్యాపింగ్, క్రాప్ ఇమేజింగ్ వంటి వాటిల్లో ఎస్‌అండ్‌టి అప్లికేషన్‌లు అందరికీ కనిపిస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ సైన్స్ ఫెస్టివల్‌ను మూడు స్థాయిలలో జరుపుకుంటామని మొదటగా ప్రపంచ ప్రభావాలను కలిగి ఉన్న విజయగాథల సంఖ్యను స్టార్టప్‌లు, పరిశ్రమ సంస్థలు, ఇన్నోవేటర్లు, పరిశోధకులు, విద్యార్థులు మరియు శాస్త్రీయ సమాజం వంటి కీలక వాటాదారులతో పంచుకుంటామని చెప్పారు. రెండవది నేషనల్ క్వాంటం మిషన్ ఇటీవల ప్రకటించినట్లుగా మనం ఇప్పుడు అదే పేజీలో అతిపెద్ద ప్రపంచ శాస్త్రీయ పురోగతిలో ఉన్నామని ఆరు ఇతర దేశాల ఎలైట్ లీగ్‌తో ఆర్&డిని కలిగి ఉందని వివరించారు.
ఎస్&టి మంత్రి పేర్కొన్న మూడవ కారణం ఏమిటంటే శాస్త్రీయ పరిశోధనలు అభివృద్ధి ప్రయోజనాల కోసం ఉద్దేశించబడ్డాయి అని ఇందులో భారతదేశం ప్రపంచానికి ఉదాహరణగా నిలిచిందని చెప్పారు. గత పదేళ్లలో దాదాపు అన్ని ఫ్లాగ్‌షిప్ పథకాలు సైన్స్, టెక్నాలజీ మరియు పాదముద్రను కలిగి ఉన్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొ.అజయ్ కుమార్ సూద్ మాట్లాడుతూ.. ఐఐఎస్‌ఎఫ్ మన యువతలో వ్యవస్థాపక స్ఫూర్తిని నింపుతుందని, ఎగ్జిబిషన్‌లు, స్టార్టప్ కాన్‌క్లేవ్‌ల ద్వారా మన చుట్టూ ఉన్న సైన్స్‌లోని అద్భుతాలను ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తుందని అన్నారు.
ఐఐఎస్‌ఎఫ్‌లో 10,000 మందికి పైగా పాఠశాల విద్యార్థులు పాల్గొంటారని 500 మంది యువ పరిశోధకులు కొత్త కార్యక్రమాలు మరియు అత్యాధునిక సాంకేతికతలపై చర్చిస్తారని డిఎస్‌టి కార్యదర్శి డాక్టర్ అభయ్ కరాండికర్ తెలిపారు. 100 కంటే ఎక్కువ స్టార్టప్‌లు తమ విజయాలను ప్రదర్శిస్తాయని మరియు ఈ గ్రాండ్ ఈవెంట్‌లో 12,000 మంది ప్రతినిధులు పాల్గొంటారని భావిస్తున్నట్టు చెప్పారు.
9వ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్‌ఎఫ్) 2023 ఎడిషన్ జనవరి 17 నుండి 20, 2024 వరకు హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరుగుతుంది.
భారతదేశపు మెగా సైన్స్ ఫెయిర్ ఫరీదాబాద్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన క్యాంపస్ ఆఫ్ ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (టిహెచ్‌ఎస్‌టిఐ) మరియు రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్‌సిబి)లో జరుగుతుంది.
ప్రస్తుత ఎడిషన్ యొక్క థీమ్ 'అమృత్ కాల్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ ఔట్రీచ్'. ఐఐఎస్‌ఎఫ్ 2023 అనేది విద్యార్థులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు, వ్యవస్థాపకులు మరియు సైన్స్ కమ్యూనికేటర్లు వంటి విభిన్న స్థాయి ఆసక్తులు కలిగిన వ్యక్తులను మరియు వ్యక్తులను పెద్ద సంఖ్యలో ప్రేరేపించడానికి ఒక వేదికను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఐఐఎస్‌ఎఫ్ 2023లో పాల్గొనేవారికి మరియు సాధారణ ప్రజలకు విభిన్న ప్రయోజనాలను అందించే శాస్త్రీయ విజయాలను ప్రదర్శించడానికి మొత్తం 17 థీమ్‌లు ఉంటాయి.
ఐఐఎస్ఎఫ్-2023 సమయంలో ఐఐఎస్ఎఫ్ ఛాలెంజ్ ఒక ప్రత్యేకమైన ఈవెంట్‌గా ఉంటుంది. దీనిలో కొత్త రికార్డు సృష్టించబడుతుంది మరియు ప్రపంచ స్థాయిలో సవాలుగా ఉంచబడుతుంది. ఈ సంవత్సరం 9వ తరగతి నుండి ఇద్దరు విద్యార్థుల బృందం దాదాపు 500 ఉపగ్రహాలను (విఎంఓశాట్) అభివృద్ధి చేస్తుంది. అటువంటి వాతావరణ ఉపగ్రహాలన్నీ 200 మీటర్ల ఎత్తు వరకు ఒత్తిడి, ఉష్ణోగ్రత, తేమ మొదలైనవాటిని కొలుస్తాయి. సమీకరించబడిన ఉపగ్రహాలన్నింటినీ పారామోటర్ ద్వారా అంత ఎత్తుకు తీసుకువెళతారు.
దాదాపు 100 మంది మహిళా శాస్త్రవేత్తలు మరియు విజయవంతమైన పారిశ్రామికవేత్తలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు మరియు వారి విజయాలు మరియు విజయవంతమైన కథనాలను ప్రతినిధుల మధ్య ప్రదర్శిస్తారు. అంతేకాకుండా దాదాపు 40 నుండి 50 మంది అంతర్జాతీయ నిపుణులు ఈ ఉత్సవాన్ని సందర్శించే అవకాశం ఉంది మరియు ఎస్&టి యొక్క వివిధ స్ట్రీమ్‌లలో సాధ్యమైన సహకారం కోసం వివిధ వాటాదారులతో చర్చలు మరియు సంభాషించనున్నారు.
<><><>
(Release ID: 1977543)
Visitor Counter : 91