ప్రధాన మంత్రి కార్యాలయం

యుకె ప్రధాని శ్రీ రుషి సునక్ తో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్నిబలపరచుకోవాలన్న నిబద్ధత ను పునరుద్ఘాటించిన నేత లు

పశ్చిమ ఆసియా లో స్థితి పై నేత లు వారి అభిప్రాయాల నుఒకరి తో మరొకరు తెలియజెప్పుకొన్నారు

Posted On: 03 NOV 2023 11:47PM by PIB Hyderabad

యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని శ్రీ రుషి సునక్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ మాధ్యం ద్వారా మాట్లాడారు.


ప్రధాని శ్రీ రుషి సునక్ పదవి కాలం లో ఒక సంవత్సరం సఫలతపూర్వకం గా పూర్తి అయిన సందర్భం లో అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తపరచారు.

వ్యాపారం, పెట్టుబడి, క్రొత్త గా ఉనికి లోకి వస్తున్నటువంటి సాంకేతిక విజ్ఞానం, రక్షణ, భద్రత, ఆరోగ్యం తదితర రంగాలు సహా ద్వైపాక్షిక విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్ట పరచడాన్ని కొనసాగించడం పట్ల నేత లు వారి యొక్క నిబద్ధత ను పునరుద్ఘాటించారు. పరస్పరం లాభసాటిగా ఉండేటటువంటి స్వేచ్ఛా వ్యాపార ఒప్పందాన్ని త్వరగా ఒక కొలిక్కి తెచ్చే దిశ లో నమోదు అవుతున్న పురోగతి ని వారు స్వాగతించారు.

 

పశ్చిమ ఆసియా ప్రాంతం లో ఘటన క్రమాలు మరియు ఇజ్ రాయిల్ ఇంకా హమాస్ మధ్య సంఘర్షణ ను గురించి నేతలు వారి వారి ఆలోచనల ను ఒకరి తో మరొకరు వెల్లడి చేసుకొన్నారు. ఉగ్రవాదం, భద్రత స్థితి అంతకంతకు దిగజారుతూ ఉండడం మరియు పౌర జీవనాని కి ఏర్పడుతున్న అపాయం వంటి అంశాల పై ఇద్దరు నేత లు తీవ్ర ఆందోళన ను వెలిబుచ్చారు. ప్రాంతీయ శాంతి- భ్రదత లు, స్థిరత్వం మరియు నిరంతర మానవీవయ సహాయాన్ని అందిస్తూ ఉండవలసిన అవసరం అంశాల లో వారు సమ్మతి ని వ్యక్తం చేశారు.

 

సంప్రదింపుల ను క్రమం తప్పక కొనసాగించాలి అనే విషయం లో ఇద్దరు నేత లు అంగీకారాన్ని వ్యక్తం చేశారు; అంతేకాక దీపావళి పండుగ కై ఒకరి కి మరొకరు శుభాకాంక్షల ను కూడ తెలియజేసుకొన్నారు.

 

***



(Release ID: 1974987) Visitor Counter : 105