రక్షణ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో జరిగిన ఐసిజి దిగువ స్థాయి అధికారుల సదస్సు 2023
Posted On:
27 OCT 2023 1:19PM by PIB Hyderabad
ఆరవ భారతీయ తీర రక్షక దళం (ఐసిజి) దిగువ స్థాయి అధికారుల సదస్సును 26&27 అక్టోబర్ 2023న న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ సదస్సు ఇతివృత్తం సమ్మిళిత/ సంఘటిత విధానం దిశగా. ఐటి, ఆరోగ్యం, హెచ్ఆర్, నాయకత్వం, మీడియాకు అవగాహన కల్పించడం వంటి అనేక అంశాలపై ఉపన్యాసాలతో పాటు వివిధ మేధోమథన సెషన్లు జరిగాయి.దేశవ్యాప్తంగా గల వివిధ తీరరక్షక దళ యూనిట్లకు చెందిన దిగువస్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రక్షక దళ సిబ్బంది సంక్షేమ చర్యలను పెంచడం కోసం పలు ఎంఒయులపై సంతకాలు చేశారు. ఆత్మనిర్భర్ భారత్ సూత్రాల ఆధారంగా ఐసిజిలో భవిష్యత్ నియామకాలపై దృష్టి సారించడమే కాక మెరుగైన, సమ్మిళిత కెరీర్ వృద్ధికి హెచ్ఆర్ విధానాల మెరుగుదల, సామర్ధ్యం, యోగ్యతను పెంచేందుకు అధునాతన సాంకేతికతను ఏకీకృతం చేయడం ద్వారా కార్యాచరణ తత్వశాస్త్ర మార్పు సదస్సులో చర్చించారు.
సబార్డినేట్ ఆఫీసర్స్ (దిగువ స్థాయి అధికారుల) సదస్సును ప్రారంభిస్తూ, సేవల సమగ్రవృద్ధికి వినూత్న ఆలోచనలను, ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా దిగువస్థాయి అధికారుల సదస్సును సమకాలీకరించినట్టు డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ పేర్కొన్నారు.
ఐసిజి దిగువస్థాయి అధికారుల సాధికారతను, విస్త్రతిని మరింత వ్యాపింపచేసేందుకు మాత్రమే కాకుండా, సేవలో నిర్ణయం తీసుకునే అధికారుల ముందు వారి వినూత్న ఆలోచనలను, ఆలోచనా ప్రక్రియలను వ్యక్తీకరించడానికి వారికి వేదికను అందిస్తోంది.
***
(Release ID: 1972274)
Visitor Counter : 53