రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ఫాస్ఫేటిక్ మరియు పొటాసిక్ (పి&కె ) ఎరువులపై రబీ సీజను 2023-24 కు (అనగా 01.10.2023మొదలుకొని 31.03.2024 వరకు) గాను పోషక పదార్థాల ఆధారిత సబ్సిడీ  (ఎన్ బిఎస్) ధరల కు ఆమోదాన్ని తెలిపిన మంత్రిమండలి

Posted On: 25 OCT 2023 3:19PM by PIB Hyderabad

రబీ సీజను 2023-24 కు (అనగా 01.10.2023 మొదలుకొని 31.03.2024 వరకు) ఫాస్ఫేటిక్ , ఇంకా ఫొటాసిక్ (పి&కె) ఎరువుల పై పోషక పదార్థాల ఆధారిత సబ్సిడీ (ఎన్ బిఎస్) ధరల ను ఖరారు చేయడం కోసం ఎరువుల విభాగం చేసిన ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలియజేసింది.

 

సంవత్సరం

కిలోకు రూపాయల లో

రబీ 2023-24

(01.10.2023 మొదలుకొని 31.03.2024 వరకు)

 

ఎన్

ఎన్

కె

ఎస్

47.02

20.82

2.38

1.89

 

రాబోయే రబీ సీజను 2023-24 లో పోషక పదార్థాల ఆధారిత సబ్సిడీ (ఎన్ బిఎస్) పై 22,303 కోట్ల రూపాయలు వ్యయం కావచ్చని అంచనా వేయడమైంది.

ఫాస్ఫేటిక్ మరియు ఫొటాసిక్ ఎరువుల పై ఈ సబ్బిడీ ని సీజన్ 2023-24 కు (01.10.2023 మొదలుకొని 31.03.2024 వరకు) గాను ఆమోదిత ధరల ఆధారం గా అందించడం జరుగుతుంది. దీని ద్వారా రైతులకు తక్కువ ధరల కు ఈ ఎరువుల ను అందుబాటు లో ఉండేటట్లు చూడడం సాధ్యపడనుంది.

ప్రయోజనాలు:

i. రాయితీ తో కూడిన ధరల లోను, తక్కువ ధరలలోను మరియు హేతుబద్ధమైన ధరల లోను ఈ ఎరువులు రైతుల కు లభించేటట్లుగా పూచీపడడం జరుగుతుంది.

ii. ఎరువులు మరియు ఇన్ పుట్స్ తాలూకు అంతర్జాతీయ ధరల లో ఇటీవల కాలం లో చోటు చేసుకొన్న ధోరణుల ను దృష్టి లో పెట్టుకొని ఫాస్ఫేటిక్ మరియు పొటాసిక్ (పి&కె) ఎరువుల పై సబ్సిడీ క్రమబద్ధీకరణ ను వర్తింపచేయడమైంది.

పూర్వరంగం:

ప్రభుత్వం ఎరువుల తయారీదారు సంస్థ లు/దిగుమతిదారు సంస్థ ల ద్వారా 25 గ్రేడుల కు చెందిన పి&కె ఎరువుల ను తగ్గింపు ధరల లో రైతుల కు అందుబాటు లో ఉండేటట్లు గా చర్యలను తీసుకొంటున్నది. పి&కె ఎరువుల సంబంధి సబ్సిడీ అనేది 2010 ఏప్రిల్ 1వ తేదీ నాటి నుండి అమలు లోకి వచ్చిన ఎన్ బిఎస్ పథకం ద్వారా వర్తిస్తున్నది. రైతుల కు మిత్రపూర్వకమైనటువంటి వైఖరి ని ప్రభుత్వం అనుసరిస్తూ వారికి పి&కె ఎరువుల ను తక్కువ ధరల కు అందుబాటు లో ఉంచేందుకు కంకణం కట్టుకొన్నది. ఎరువులు మరియు ఇన్ పుట్స్ అంటే.. యూరియా, డిఎపి, ఎంఒపి మరియు సల్ఫర్ ల అంతర్జాతీయ ధరల లో ఇటీవల చోటు చేసుకొన్న ధోరణుల ను దృష్టి లో పెట్టుకొని ఫాస్ఫేటిక్ ఇంకా పొటాసిక్ (పి&కె) ఎరువుల పైన 2023-24 (01.10.2023 మొదలుకొని 31.03.2024 వరకు) రబీ సీజను కు ఎన్ బిఎస్ రేటుల ను ఆమోదించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఎరువుల కంపెనీల కు ఆమోదిత మరియు నోటిఫై చేసిన రేటుల ను అనుసరించి సబ్సిడీ ని అందించడం జరుగుతుంది. తద్ద్వారా, ఆయా ఎరువుల ను రైతుల కు వారు భరించగలిగే ధరల కు అందుబాటు లో ఉంచడం సాధ్యపడనుంది.

***



(Release ID: 1970979) Visitor Counter : 37