ఆర్థిక మంత్రిత్వ శాఖ
2023 జులై ఒకటో తేదీ నుండి కరవు భత్యం మరియు డియర్ నెస్ రిలీఫ్ ల తాలూకు అదనపు కిస్తీ విడుదల కుఆమోదం తెలిపిన మంత్రిమండలి
కేంద్ర ప్రభుత్వానికి చెందిన 48.67 లక్షల మంది ఉద్యోగుల కు మరియు 67.95 లక్షల మంది పింఛనుదారుల కు ప్రయోజనం చేకూరనుంది
Posted On:
18 OCT 2023 3:25PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కు కరవు భత్యం (డిఎ) అదనపు కిస్తీ ని మరియు పింఛనుదారుల కు డియర్ నెస్ రిలీఫ్ (డిఆర్) అదనపు కిస్తీ ని 2023 జులై ఒకటో తేదీ నుండి వర్తించే విధం గా ఇవ్వడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియజేసింది. దీనిలో మూల వేతనం/పింఛను లోని 42 శాతం గా ఉన్న ప్రస్తుత రేటు లో 4 శాతం పెంపుదల ను అమలుపరచడమైంది. ధర ల లో వృద్ధి కి పరిహారం గా ఈ నిర్ణయాన్ని తీసుకోవడమైంది. ఈ పెరుగుదల ఏడో కేంద్రీయ వేతన సంఘం సిఫారసు ల ఆధారం గా అంగీకరించిన సూత్రాని కి అనుగుణం గా ఉంది.
కరవు భత్యం మరియు డియర్ నెస్ రిలీఫ్.. ఈ రెండు పద్దు లు కలుపుకొని ఖజానా పై ఒక్కో సంవత్సరం లో 12,857 కోట్ల రూపాయల వంతున ప్రభావం పడుతుంది. దీని ద్వారా సుమారు 48.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కు మరియు 67.95 లక్షల మంది పింఛనుదారుల కు ప్రయోజనం దక్కనుంది.
***
(Release ID: 1968941)