రక్షణ మంత్రిత్వ శాఖ
పనామా సరుకు నౌకపై వ్యాధిగ్రస్థుడైన చైనా సిబ్బందిని ముంబై తీరం వద్ద నుంచి తరలించిన ఇండియన్ కోస్ట్ గార్డ్
Posted On:
14 OCT 2023 7:40PM by PIB Hyderabad
పనామా సరుకు రవాణా నౌక ఎంటి హువా వీ8 నుంచి చైనా సిబ్బందిని 14 అక్టోబర్ 2023న వైద్యం కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ విజయవంతంగా తరలించింది. అక్టోబర్ 13, 2023న రాత్రివేళ ముంబైలోని ఐసిజి మారిటైం రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌కు, భారత పశ్చిమ తీరంలో గల మారిటైం సర్చ్ అండ్ రెస్క్యూ కోర్డినేటర్ కు తమ నౌకలో ఉన్న 49 ఏళ్ళ చైనా ఉద్యోగిని వైద్యం నిమిత్తం తరలించవలసిందిగా కోరారు. తమ వద్ద చిన్న పడవను లాగేందుకు అవసరమైన తాడు లేనందున, అతడిని కాపాడవలసిందిగా నౌకలో అధికారులు కోరారు.
ఆ ఉద్యోగికి పక్షవాతం వచ్చి, బాధపడుతున్నట్టు తెలిసంది. ఆ నౌక న్యూ మంగళూరు నుంచి పాకిస్తాన్‌లోని బిన్ ఖాసిం దిశగా వెడుతున్నది. ఈ సమాచారం ఇచ్చే సమయానికి ముంబై నుంచి 122 నాటికల్ మైళ్ళ దూరంలో ఉండి, వైద్య నిమిత్తం ముంబై దిశగా ప్రయాణించాలని నిర్ణయించుకుంటోంది.
రోగి పరిస్థితి తీవ్రంగా ఉండటాన్ని పరిగణనలోకి తీసుకుని, ఐసిజి నౌక సి-439ను అతడిని అక్కడి నుంచి తరలించేందుకు అన్ని వైద్య పరికరాలతో పంపారు. సరైన వెలుతురు లేనప్పటికీ, ఐసిజి విజయవంతంగా ఆ రోగిని ముంబై యాంకొరేజ్ (లంగరువేసే చోటు) వద్ద 8.30 గంటలకు దింపి, ముంబై హార్బర్‌కు పంపింది.
రోగికి తీరంలో వైద్యం చేయించేందుకు తదనంతరం ముంబై పోర్ట్ బెర్త్‌లో స్థానిక ఏజెంటుకు అప్పగించడం జరిగింది. భారతీయ జలాలలో సముద్ర భద్రత పట్ల ఐసిజికి ఉన్న నిబద్ధతను ఈ ఆపరేషన్ మరొకసారి రుజువు చేసింది.
***
(Release ID: 1967820)