బొగ్గు మంత్రిత్వ శాఖ
ఆర్ధిక సంవత్సరం 2023-24లో 2743 హెక్టార్ల భూమిని హరిత కవర్ కిందకు తీసుకువచ్చిన బొగ్గు రంగం
ఇప్పటికే 19 కొత్త ఈకో- పార్కులు, 15 ఇకో- పార్కులను అభివృద్ధి చేసిన బొగ్గు పిఎస్‌యులు
హరిత కవర్ చిరవల కింద రూ. 128 కోట్ల అంచనా వ్యయం
Posted On:
13 OCT 2023 4:33PM by PIB Hyderabad
ఆర్ధిక సంవత్సరం 2023 -24లో దాదాపు 51 లక్షల మొక్కలను నాటి, 2734 హెక్టేర్ల భూమిని హరిత కవర్ కిందకు తీసుకువచ్చి ప్రస్తుత ఆర్థిక సంవత్సర లక్ష్యమైన 2400 హెక్టార్లను దాటి పోయి పర్యావరణ పరిరక్షణ దిశగా బొగ్గు మంత్రిత్వ శాఖ చాటుకుంటోంది. అదనంగా, 372 హెక్టార్లను మట్టి స్థిరీకరణ, తేమను మెరుగుపరచడం,తిరిగి సేకరించిన భూమిలో కోతను నివారించడాన్ని ఉపయోగించారు. ఆర్ధిక సంవత్సరం 2022-23లో, బొగ్గు మంత్రిత్వ శాఖ కింద గల బొగ్గు/ లిగ్నైట్ పిఎస్‌యులు దాదాపు 2370 హెక్టార్ల భూమిలో 50 లక్షల మొక్కలను నాటాయి.
గత ఐదేళ్ళలో బొగ్గు మంత్రిత్వ శాఖ మార్గదర్శనం, పర్యవేక్షణ కింద ఎప్పటికప్పుడు 233 లక్షల మొక్కలకు పైగా నాటడం ద్వారా 10,894 హెక్టార్ల భూమిని హరిత్ కవర్ కిందకు బొగ్గ, లిగ్నైట్ పిఎస్‌యులు తెచ్చాయి. బొగ్గు రంగంలో వార్షికంగా భారీగా మొక్కల నాటే కార్యక్రమాలు చేపడతారు. అందులో రహదారుల పక్కన, భారం అయిన డంపుల మీద, కాలనీలు, నది ఒడ్డు వంటి ప్రదేశాలలో నాటుతుంటారు. మియావాకీ ప్లాంటేషన్, విత్తనాలు నాటడం, పచ్చగడ్డిని పెంచే భష్ట్రమిని అభివృద్ధి చేయడం, సవాళ్ళతో కూడుకున్న ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు డ్రోన్లను ఉపయోగించడం వంటి వినూత్న పద్ధతులను ఎంచుకున్నారు.
పర్యావరణ పాదముద్రను పరివర్తన చేయడం ద్వారా దేశ నిలకడైన లక్ష్యాలు, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయడంలో భారతీయ బొగ్గు రంగం చెప్పుకోదగిన అడుగులు వేస్తోంది. పచ్చదనం, తవ్విన ప్రాంతాలపై ఎడతెగని దృష్టితో, బొగ్గు/ లిగ్నైట్ పిఎస్‌యులు భారతదేశపు అటవీ,వృక్ష విస్తీర్ణాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించాయి.
ఈ ప్రయత్నాలు వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళికలో కీలకమైన అంశంగా ఉన్న నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా (జిఐఎం)కు అనుగుణంగా మాత్రమే కాకుండా 2030 నాటికి చెట్లను, వృక్షాలను పెంచడం ద్వారా 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌కు బదులుగా కార్బన్ సింక్‌ను సృష్టించాలన్న జాతీయంగా నిర్ధారించిన కంట్రిబ్యూష్‌న్ కు కట్టుబడి ఉంది.
అడువులను పెంచే కృషి మాత్రమే కాకుండా బొగ్గు రంగం పర్యావరణ పార్కులను, గనుల పర్యావరణ క్షేత్రాలను కూడా బొగ్గు పర్యాటక క్షేత్రాలను చురుకుగా ప్రోత్సహిస్తుంది. బొగ్గు/ లిగ్నైట్ పిఎస్‌యులు పదిహేను ఈకో- పార్కులను/ గనుల పర్యావరణ క్షేత్రాలను ఏర్పాటు చేసి, స్థానిక పర్యాటక సర్క్యూట్‌తో ఏడింటిని సమీకృతంగా ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో బొగ్గు/ లిగ్నైట్ పిఎస్‌యులు బొగ్గు గనుల ప్రాంతాలలో నిలకడైన పర్యాటకాన్ని, పర్యావరణ పరిరక్షణ కోసం 19 ఈకో- పార్కులను/ పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలన్న ప్రతిష్ఠాత్మక ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. ఈ చొరవల కోసం రూ. 128 కోట్ల మొత్తాన్ని వ్యయంగా అంచనా వేశారు. చెట్ల పెంపకం, పచ్చ గడ్డిని పెంచే భూములను కలిగి ఉండే ఈకో- పార్కులు పచ్చటి ల్యాండ్ స్కేప్‌లకు కీలక కాంపొనెంట్‌లుగా ఉంటూ, కార్బన్ సింక్స్‌గా పని చేస్తాయి.
భారతదేశ పర్యావరణ సుస్థిరత లక్ష్యాలకు సహకరించడంలో బొగ్గు/లిగ్నైట్ పిఎస్‌యుల అంకితభావం, అవిశ్రాంత ప్రయత్నాలను ఈ విజయాలు నొక్కి చెబుతున్నాయి.
***
(Release ID: 1967800)
Visitor Counter : 51