రైల్వే మంత్రిత్వ శాఖ
భారతీయ రైల్వేకి చెందిన ప్రభుత్వ రంగ సంష్తలు రైట్స్, ఇర్కాన్ లకు నవరత్న హోదా
Posted On:
13 OCT 2023 5:04PM by PIB Hyderabad
రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఇర్కాన్) రైట్స్ లిమిటెడ్ (రైట్స్)కు నవరత్న హోదా లభించింది. నవరత్న హోదా పొందిన ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య 16 కి చేరింది. రైట్స్, ఇర్కాన్ లకు నవరత్న హోదా కల్పిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
50 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన రైట్స్ లిమిటెడ్ భారతదేశంలో రవాణా రంగంలో సంప్రదింపులు అందిస్తున్న సంస్థగా, ఇంజనీరింగ్ సంస్థగా గుర్తింపు పొందింది, రవాణా, రైల్వే, రోలింగ్ స్టాక్ ఎగుమతి, రహదారులు , విమానాశ్రయాలు, మెట్రోలు, అర్బన్ ఇంజనీరింగ్ సుస్థిరత, ఓడరేవులు, జలమార్గాలు, ఇంధన నిర్వహణ వంటి విభిన్న రంగాల్లో రైట్స్ సేవలను అందిస్తుంది.
నవరత్న హోదా గుర్తింపు రావడంతో కార్యకర్లపాలను మరింత విస్తృతం చేయడానికి రైట్స్ సంస్థకు అవకాశం లభిస్తుంది. ప్రపంచ మార్కెట్‌లో మరింత ప్రభావవంతంగా పోటీ పడేందుకు, అభివృద్ధి సాధించడానికి ఇతర రంగాలపై దృష్టి సారించడానికి వీలు కల్పిస్తుంది.
47 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ఇర్కాన్ ప్రధానంగా రైల్వే, రహదారులు, అదనపు హై టెన్షన్ సబ్‌స్టేషన్ ఇంజనీరింగ్, నిర్మాణంలో కార్యక్రలాపాలు చేపడుతోంది. బ్యాలస్ట్ లెస్ ట్రాక్, విద్యుదీకరణ, టన్నెలింగ్, సిగ్నల్, టెలికమ్యూనికేషన్ తో పాటు లోకోల లీజు,రహదారులు,, వాణిజ్య, పారిశ్రామిక, నివాస భవనాలు, కాంప్లెక్స్‌లు, విమానాశ్రయ రన్‌వే , హ్యాంగర్లు, మెట్రో , మాస్ రాపిడ్ రవాణా వ్యవస్థ వంటి రైల్వే నిర్మాణ రంగాలలో అనేక ప్రాజెక్ట్‌లనుసంస్థ చేపట్టి పూర్తి చేసింది. దేశ, విదేశాల్లో ఇర్కాన్ కార్యకలాపాలు సాగుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.10,750 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించిన ఇర్కాన్ పన్ను తర్వాత రూ.765 కోట్ల లాభం ఆర్జించింది.
“నవరత్న” హోదా లభించడంతో రెండు సంస్థలకు మార్కెట్ విశ్వసనీయత మరింత పెరుగుతుంది. పీపీపీ విధానంలో పెద్ద ప్రాజెక్ట్‌లను చేపట్టడానికి అవకాశం కలుగుతుంది.
***
(Release ID: 1967663)
Visitor Counter : 112