మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహిళా శక్తి సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు మహిళా బైక్ యాత్ర యశస్విని నిర్వహిస్తున్న సిఆర్పిఎఫ్


బెంగళూరు చేరుకున్న రైడర్స్ బృందాన్ని సత్కరించిన కర్ణాటక మహిళా శిశు అభివృద్ధి శాఖ

Posted On: 13 OCT 2023 5:35PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా జరుగుతున్న మహిళా  శక్తి కార్యక్రమంలో భాగంగా సిఆర్పిఎఫ్ కి చెందిన  75 మంది మహిళలు  మహిళా బైక్ యాత్ర చేపట్టారు. మహిళా బైక్ యాత్ర  కన్యాకుమారి, శ్రీనగర్, షిల్లాంగ్ ల నుంచి 2023 అక్టోబర్ 5న ప్రారంభమైంది.  121 జిల్లాల మీదుగా  మహిళా బైక్ యాత్ర  సాగుతుంది.15 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో  మహిళా బైక్ యాత్ర  సాగుతుంది.  నారీ శక్తి, బేటీ బచావో బేటీ పడావో, ఐక్యత, సమగ్రత, మహిళా సాధికారత సందేశాన్ని వ్యాప్తి చేయడానికి  దాదాపు 10000 కి.మీ.దూరం  మహిళా బైక్ యాత్ర  జరుగుతుంది. గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద యాత్ర  ముగుస్తుంది.

విద్యార్థినులు,, మహిళా స్వయం సహాయక బృందాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఎన్సీసీ  క్యాడెట్‌లు,  మహిళా పారిశ్రామికవేత్తలను కలుస్తున్న మహిళా బైక్ యాత్రలో పాల్గొంటున్న  బృందం సభ్యులు ఐక్యత, సంపూర్ణ అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు జరుపుతూ అవగాహన కల్పిస్తున్నారు. జాతీయ పతాకం, సిఆర్పిఎఫ్ పతాకాన్ని చేతబట్టి యశస్విని పేరుతొ బైక్ యాత్ర చేస్తున్న సిబ్బంది    దేశ్ కే హమ్ హే రక్షక్ సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నారు. .

కన్యాకుమారి నుండి ఏక్తా నగర్ వరకు బైక్ యాత్ర ప్రారంభించిన యశస్విని బృందం 1250 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 2023 అక్టోబర్ 12న బెంగళూరు సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్  చేరుకుంది.  తిరువనంతపురం, మదురై, పాండిచ్చేరి, అవడి, . హోసూరు,  వెల్లూరు, కృష్ణగిరి మీదుగా బృందం సభ్యులు బెంగళూరు చేరుకున్నారు. కర్ణాటక రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మహిళా మోటార్ సైకిల్ యాత్ర బృందాన్ని సత్కరించింది. 

 

***


(Release ID: 1967657)
Read this release in: English , Urdu , Kannada