పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం


సకారాత్మక అనుకూల విధానాల వల్ల పొగమంచుతో జరిగే విమాన రద్దు, విమాన మళ్లింపుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం

Posted On: 13 OCT 2023 2:42PM by PIB Hyderabad

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమైంది. పొగమంచు సందర్బంగా అనుసరించిన ప్రణాళికపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర పౌర విమానయాన, ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా అధ్యక్షత వహించారు. దీనికి పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్)  డా. వి.కె. సింగ్, పార్లమెంటు సభ్యులు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇతర సంబంధిత సంస్థల అధికారులు హాజరయ్యారు.  అధికారుల ఉమ్మడి సకారాత్మకంగా  అనుకూలమైన విధానం అవలంబించారని శ్రీ సింధియా అన్నారు. గత రెండేళ్ళలో విమానాల రాకపోకల సంఖ్య 22 శాతం పెరిగినప్పటికీ పొగమంచు కాలంలో విమానాల రద్దు, విమాన మళ్లింపులలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. 2021-22లో, మొత్తం 1,36,374 విమానాల రాకపోకలు చేయగా, 124 విమానాలు రద్దు అయ్యాయి.   రద్దు రేటు 0.09 శాతంగా ఉంది. 2022-23లో మొత్తం 1,66,927 విమానాలు నడపగా రద్దయినవాటి సంఖ్య 86 అంటే 0.05 శాతం రద్దు రేటు ఉందని వెల్లడించారు. అదేవిధంగా, 2021-22లో, 8 ప్రధాన పొగమంచు పీడిత విమానాశ్రయాల నుండి 58 విమాన మళ్లింపులు జరిగాయి, ఇది 2022-23లో 14కి తగ్గింది.

పొగమంచు అనేది సాధారణంగా భూమట్టానికి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉండే వాతావరణ దృగ్విషయం, ఇది 1000 మీటర్ల కంటే తక్కువ దృశ్యమానతకు దోహదపడుతుందని, ఎక్కువగా అయితే శీతాకాలంలో భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా మొత్తం విమాన కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందని మంత్రి చెప్పారు. పొగమంచు పరిస్థితులలో, భూమికి దగ్గరగా ఉండే గాలి పొరలో నీటి బిందువులు, ధూళి కారణంగా దృశ్యమానత క్షీణిస్తుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10, ఫిబ్రవరి 10 మధ్య కాలాన్ని సాధారణంగా పొగమంచు కాలంగా పరిగణిస్తారు.

విమానయాన సంస్థలు, ఏరోడ్రోమ్ ఆపరేటర్లు పొగమంచు పరిస్థితుల అనుగుణంగా తమను తాము ముందుగానే సిద్ధం చేసుకునేలా చర్యలు తీసుకునేలా ప్రతి సంవత్సరం డీజీసీఏ కసరత్తు చేస్తుందని శ్రీ సింధియా చెప్పారు.  తద్వారా విమానాల రద్దు, మళ్లింపుల పరంగా అంతరాయాలు, సేవలను తగ్గించవచ్చు. ఈ దిశగా, డీజీసీఏ భూమిపై అవసరమైన మద్దతు వ్యవస్థల సంసిద్ధతను, సీఏటీ II/III పరిస్థితులలో కార్యకలాపాల కోసం విమాన లభ్యత, శిక్షణ పొందిన సిబ్బంది పరంగా ఆపరేటర్ల సంసిద్ధతను తనిఖీ చేయడానికి అన్ని వాటాదారులతో నిమగ్నమై ఉంది. ఇప్పటి వరకు, సీఏటీ II/IIIకి అర్హత సాధించిన 4804 మంది విమాన సిబ్బంది వివిధ విమానయాన సంస్థలతో పాటు 2979 మంది కెప్టెన్లు, 1825 మంది కో-పైలట్‌లతో అందుబాటులో ఉన్నారని ఆయన చెప్పారు. క్యాట్ III ల్యాండింగ్ సదుపాయాన్ని కలిగి ఉన్న 6 విమానాశ్రయాలు ఉన్నాయని, విమానాలు తక్కువ రన్‌వే విజువల్ రేంజ్‌తో ల్యాండ్ చేయగలవని ఆయన తెలియజేశారు. 8 విమానాశ్రయాల్లో  క్యాట్ I సామర్థ్యాన్ని ప్రారంభించనున్నామని, 4 విమానాశ్రయాల్లో  క్యాట్ I నుండి  క్యాట్ IIకి సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేస్తామని ఆయన చెప్పారు.

పొగమంచు కాలంలో నాన్ క్యాట్ II/క్యాట్ III కంప్లైంట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆపరేషన్ నుండి తొలగించేందుకు తమ విమానాల షెడ్యూల్‌లో మార్పులు తీసుకురావాలని ఆదేశించామని మంత్రి చెప్పారు. క్యాట్II/క్యాట్  III క్వాలిఫైడ్ సిబ్బందిని తగిన విధంగా షెడ్యూల్ చేసేలా ఎయిర్‌లైన్స్ నిర్దేశించబడ్డాయి.

సేవల్లో అంతరాయాలను తగ్గించడానికి, పొగమంచు పరిస్థితుల కోసం ముందుగానే సిద్ధం చేయడానికి మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమాలకు పార్లమెంటు సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు కొన్ని సూచనలు కూడా చేశారు.

***



(Release ID: 1967654) Visitor Counter : 98


Read this release in: English , Urdu , Hindi