రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

డీఆర్‌డీవో ప్రత్యేక ప్రచారం 3.0: జాప్యం తగ్గింపు, సామర్థ్యానికి ప్రోత్సాహం

Posted On: 13 OCT 2023 5:09PM by PIB Hyderabad

ప్రత్యేక ప్రచారం 3.0లో భాగంగా ఎంపీ సిఫార్సులు, ప్రజా ఫిర్యాదులు, పీఎంవో సిఫార్సుల అమలు, పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించడానికి డీఆర్‌డీవో కట్టుబడి ఉంది. ఎస్‌సీడీపీఎం 3.0 ప్రధాన లక్ష్యాలను సాధించడానికి ఈ ప్రత్యేక ప్రచారం 2 అక్టోబర్ 2023న ప్రారంభమైంది, 31 అక్టోబర్ 2023 వరకు కొనసాగుతుంది.

చేపట్టిన కొన్ని ప్రధాన కార్యక్రమాలు:

  1. ప్రజా ఫిర్యాదుల స్వీకరణపై సత్వర స్పందన కోసం స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయడం
  2. దస్త్రాలను సమీక్షించడం, పరిష్కరించడం
  3. రికార్డుల చిత్రీకరణ, కేటగిరీ ఎ, బి, సి రికార్డుల డిజిటీకరణ
  4. వ్యర్థాలను వదిలించుకోవడం

ఈ ప్రచారాన్ని సెక్రటరీ డీడీ (ఆర్‌&డి) & డీఆర్‌డీవో చైర్మన్‌ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీఆర్‌డీవో కేంద్రాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్నారు.

సాధించిన కొన్ని ప్రధాన విజయాలు: 

  • కొంత ప్రదేశాన్ని వినియోగంలోకి తేవడం
  • తుక్కును అమ్మడం ద్వారా ఆదాయం
  • కార్యాలయ లోపల, వెలుపల పరిశుభ్రత

 

****



(Release ID: 1967653) Visitor Counter : 42


Read this release in: English , Urdu , Hindi