సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని నిర్వహించిన కేంద్ర వికలాంగుల సాధికారత విభాగం
Posted On:
13 OCT 2023 5:11PM by PIB Hyderabad
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వికలాంగుల సాధికారత విభాగం ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని నిర్వహించింది ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా 20కి పైగా ప్రాంతాల్లో వికలాంగుల సాధికారత విభాగం కార్యక్రమాలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా.విభాగానికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థల్లో కంటి తనిఖీ, సదస్సులు, అవగాహన కార్యక్రమాలు, వెబ్‌నార్‌ల వంటి వివిధ కార్యక్రమాలు జరిగాయి.
ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో పనిచేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజాబిలిటీస్, సమీకృత ప్రాంతీయ కేంద్రం లక్నోలో పిల్లలు, తల్లిదండ్రులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఇతర జాతీయ సంస్థలు, సమీకృత ప్రాంతీయ కేంద్రాలు ఇతర అనుబంధ సంస్థలు ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించాయి.
***
(Release ID: 1967647)