శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

యువతలో మెడ్ టెక్ స్టార్టప్‌లు మరియు ఆవిష్కర్తలను ప్రోత్సహించడానికి డిబిటి మరియు ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపిఓ) మద్దతుతో గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్ ఫెలోషిప్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డిబిటి) మరియు డబ్ల్యూఐపిఓ ఫెలోషిప్‌లు ఐఐటీ ఢిల్లీ మరియు ఎయిమ్స్ న్యూఢిల్లీ; ఐఐటీబీ మరియు హిందూజా మరియు నానావతి హాస్పిటల్ ముంబైలోని డిబిటి బయో-డిజైన్ కేంద్రాలలో అమలు చేయబడతాయి; డాక్టర్ జితేంద్ర సింగ్

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతలో ఆరోగ్య సంబంధిత అవసరాలు మరియు సవాళ్లకు శాస్త్రీయ పరిష్కారాలను కనుగొనడానికి ఈ చొరవ మేధో సంపత్తి మరియు ప్రజారోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది: డాక్టర్ జితేంద్ర సింగ్

భారతదేశాన్ని గ్లోబల్ స్పేస్ టెక్నాలజీ హబ్‌గా మరియు దక్షిణ-దక్షిణ సహకారానికి రోల్ మోడల్‌గా మార్చడానికి డబ్ల్యూఐపి నుండి అవసరమైన సహాయాన్ని అందజేస్తుందని హామీ ఇచ్చిన డబ్ల్యూఐపిఓ డిజీ డారెన్ టాంగ్

Posted On: 12 OCT 2023 4:58PM by PIB Hyderabad

యువతలో మెడ్ టెక్ స్టార్టప్‌లు మరియు ఆవిష్కర్తలను ప్రోత్సహించడానికి డిబిటి మరియు ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపిఏ) మద్దతుతో గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్ ఫెలోషిప్‌ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు అధ్యక్షత వహించారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డిబిటి) మరియు డబ్ల్యూఐపిఓ ఫెలోషిప్‌లు ఐఐటీ ఢిల్లీ మరియు ఎయిమ్స్ న్యూఢిల్లీ; ఐఐటీబీ మరియు హిందూజా మరియు నానావతి హాస్పిటల్ ముంబైలోని డిబిటి బయో-డిజైన్ కేంద్రాలలో అమలు చేయబడతాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

 

image.png


డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన ఈ చొరవ ఆరోగ్య సంబంధిత అవసరాలు మరియు సవాళ్లకు శాస్త్రీయ పరిష్కారాలను కనుగొనడానికి,  మేధో సంపత్తి మరియు ప్రజారోగ్యాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ చర్య సంస్థాగత సహకారాన్ని మెరుగుపరుస్తుందని మరియు ప్రపంచ ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి ప్రభావవంతమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి యువ ఆవిష్కర్తలకు విలువైన వేదికను అందించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు.

డిబిటి బయో-డిజైన్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి డబ్ల్యూఐపిఓ మద్దతు ఉన్న నలుగురు సభ్యులకు మద్దతు ఇవ్వడానికి ఈ చొరవ కింద డబ్ల్యూఐపిఓ డిబిటితో అధికారిక సహకారాన్ని ప్రారంభించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. భాగస్వాములు తక్కువ మరియు మధ్య-ఆదాయ దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ నిపుణుల నుండి 157 దరఖాస్తులను స్వీకరించారు.

ఇటీవల డిబిటి దేశవ్యాప్తంగా 20 వైద్య మరియు సాంకేతిక సంస్థలను జంటగా చేయడం ద్వారా బయోడిజైన్ ప్రోగ్రామ్‌ను స్కేల్ అప్ చేసిందని మరియు ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపిఓ) వారి గ్లోబల్ హెల్త్ కింద మద్దతు కోసం ఈ కార్యక్రమాన్ని గుర్తించడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు.

 

image.png


డిబిటి మరియు డబ్ల్యూఐపిఏ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసిస్తూ "ఇది ఒక ప్రధాన భాగస్వామ్యం మరియు భారతదేశం ఆవిష్కరణ మరియు స్టార్టప్ ప్రమోషన్‌లో ప్రపంచ నాయకత్వాన్ని సాధించడానికి వీలుగా బలోపేతం కావాలి" అని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.

ప్రధాన మంత్రి కల అయిన 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా అందించడానికి బయో-ఎకానమీ 150-బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఉందని మరియు ఇటీవలి నివేదికల ప్రకారం ప్రతిరోజూ 3 బయోటెక్ స్టార్టప్‌లు ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ నొక్కిచెప్పారు. ఆచరణీయమైన సాంకేతిక పరిష్కారాలను అందించాలనే ఆకాంక్షతో భారతదేశం ప్రయత్నిస్తోందన్నారు. వృద్ధి రేటుతో భారతదేశ బయో-ఎకానమీ 2025లో 10 మిలియన్లకు పైగా ఉద్యోగాలకు తోడ్పాటును అందించగలదని ఆయన అన్నారు. “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమాలను బలోపేతం చేయడం మరియు బయోటెక్ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌లలో ప్రారంభించడం ద్వారా ఈ రంగంలోని స్టార్టప్‌ల ద్వారా ఇది సాధ్యమైంది" అని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం భారతదేశంలో 4,000 బయోటెక్ స్టార్టప్‌లు ఉన్నాయని, అవి 2025 నాటికి 10,000కి పెరుగుతాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. బయోటెక్నాలజీ విభాగం తన పిఎస్‌యు-బిఐఆర్‌ఏసితో పాటు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలతో సహా అందరు వాటాదారుల నుండి సమిష్టి కృషిని నిర్వహిస్తోందని ఆయన అన్నారు. అకాడెమియా, పరిశ్రమలు, స్టార్టప్‌లు, పెట్టుబడిదారులు, దాతృత్వ సంస్థలు భారతీయ బయోటెక్ స్టార్ట్-అప్‌లను ముందుకు తీసుకెళ్తున్నాయని తెలిపారు.

 

image.png


డబ్ల్యూఐపిఓ డైరెక్టర్ జనరల్ శ్రీ.డారెన్ టాంగ్ మాట్లాడుతూ..చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ద్వారా భారతదేశం తన శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు.

భారతదేశాన్ని గ్లోబల్ స్పేస్ టెక్నాలజీ హబ్‌గా మార్చడానికి మరియు దక్షిణ-దక్షిణ సహకారానికి రోల్ మోడల్‌గా మార్చడానికి డబ్ల్యూఐపిఓ నుండి అవసరమైన సహాయాన్ని అందిస్తామని మిస్టర్ టాంగ్ హామీ ఇచ్చారు. బయోటెక్ ఫెలోస్ మరియు స్టార్ట్-అప్‌లు మరియు ఇన్నోవేషన్ రంగంలో అర్ధవంతమైన సహకారాన్ని ఆయన హామీ ఇచ్చారు.

డిబిటి-డబ్ల్యూఐపిఓ ఫెలోషిప్ చొరవను ప్రస్తావిస్తూ “ఈ రోజు మన దృష్టి ప్రపంచ భాగస్వామ్యాలను ఉపయోగించి స్థానిక ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి ఐపీ, ఆవిష్కరణ మరియు వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై ఉంది. విభిన్న దేశాలకు చెందిన యువ నిపుణుల మధ్య సహకారం మరియు జ్ఞాన మార్పిడిని పెంపొందించడం దీని లక్ష్యం" అని శ్రీ టాంగ్ తెలిపారు.

 

image.png


భారత ప్రభుత్వం బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ ఎస్. గోఖలే మాట్లాడుతూ "గ్లోబల్ సౌత్‌ను ప్రోత్సహించడం ద్వారా సహా ప్రపంచ ఆరోగ్య సవాళ్లను పరస్పరం పరిష్కరించడానికి ప్రాంతాల అంతటా ఆవిష్కర్తల జాతీయ, ప్రాంతీయ మరియు ప్రపంచ సంస్థాగత సామర్థ్యాలను సహ-అభివృద్ధి చేయడానికి ఈ భాగస్వామ్యం మనకు సహాయం చేస్తుంది” అని తెలిపారు.

డిఎస్‌టి సెక్రటరీ ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ తన వ్యాఖ్యలలో ఆవిష్కరణలను ప్రోత్సహించే భారతదేశపు పురాతన సంస్థల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఒకటని స్టార్టప్‌ల ద్వారా అనేక ఇంక్యుబేటర్‌లను తీసుకుంటోందని చెప్పారు.

డిఎస్‌ఐఆర్ సెక్రటరీ డాక్టర్ ఎన్. కళైసెల్వి మాట్లాడుతూ భారతదేశ సాంకేతికత గ్లోబల్ ఆమోదయోగ్యతను పొందేందుకు డబ్ల్యూఐపిఓ  ఉత్ప్రేరకంగా పని చేయాలని అన్నారు.

 

<><><>



(Release ID: 1967264) Visitor Counter : 52


Read this release in: English , Urdu , Hindi