వ్యవసాయ మంత్రిత్వ శాఖ
మహిళా మరియు యువ వ్యవసాయ వ్యాపారవేత్తలకు న్యాయమైన మరియు నిలకడైన వ్యవసాయ ఆహార వ్యవస్థలను ప్రోత్సహించడానికి మద్దతు అవసరం
ప్రపంచవ్యాప్తంగా, వ్యవసాయ ఆహార వ్యవస్థలలో లింగ అసమానత చాలా ముఖ్యమైన సవాలుగా మిగిలిపోయింది. పురుషుల కంటే మహిళలు మొత్తంమీద తక్కువ ఆహార భద్రత కలిగి ఉంటారు: డాక్టర్ నికోలిన్ డి హాన్
Posted On:
11 OCT 2023 3:06PM by PIB Hyderabad
మహిళా మరియు యువ వ్యవసాయ వ్యాపారవేత్తలు ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సహాయం అందుబాటులో లేకపోవడం, పరిమిత భూ యాజమాన్యం, అనధికారిక మరియు వేతనం లేని పని మరియు వారి అవసరాలను వినిపించే కొన్ని అవకాశాలతో వంటివి వారి న్యాయమైన మరియు సుస్థిరమైన నిలకడైన వ్యవసాయ ఆహార వ్యవస్థల వైపు పురోగతిని నిరోధిస్తుంది. 9-12 అక్టోబర్ 2023 వరకు ఇక్కడ ఐకార్-ఎన్ ఏ ఎస్ సీ పూసాలో జరుగుతున్న అంతర్జాతీయ లింగ సదస్సులో వ్యాపార నాయకులు, ఆదర్శ రైతులు మరియు శాస్త్రవేత్తల బృందం తెరపైకి తెచ్చిన పాఠాలు ఇవి. “పరిశోధన నుండి ప్రభావం వరకు: న్యాయమైన మరియు నిలకడైన సుస్థిరత వైపు వ్యవసాయ ఆహార వ్యవస్థలు”, అనే అంశంపై సీ జీ ఐ ఎ ఆర్ లింగ ప్రభావ వేదిక మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ లు సంయుక్తంగా ఈ అంతర్జాతీయ లింగ సదస్సు ను నిర్వహించారు, దీనిని సోమవారం భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.
నాలుగు రోజుల సదస్సు లో రెండవ రోజు మొత్తం 18 సమాంతర సెషన్‌లు జరిగాయి, వీటిలో చిరుధాన్యాలు కోత అనంతర ప్రాసెసింగ్‌లో మహిళా రైతుల కష్టాలను తగ్గించడానికి నివారణలు; మహిళా వీధి వ్యాపారులు మరియు వ్యాపారుల మధ్య లింగ అంతరాల అంచనాలు; మరియు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలలోని రైతులలో విత్తన ఎంపిక యొక్క లింగ డ్రైవర్లు వంటి వాటిపై 80 కంటే ఎక్కువ శాస్త్రీయ పోస్టర్‌ల ప్రదర్శనలు ఉన్నాయి.
ఈ కాన్ఫరెన్స్ యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తూ, సీ జీ ఐ ఎ ఆర్ లింగ ప్రభావ వేదిక డైరెక్టర్ డాక్టర్ నికోలిన్ డి హాన్ మాట్లాడుతూ, "ప్రపంచవ్యాప్తంగా, వ్యవసాయ ఆహార వ్యవస్థలలో లింగ అసమానత చాలా ముఖ్యమైన సవాలుగా మిగిలిపోయింది. మొత్తంమీద చూస్తే పురుషులు కంటే మహిళలు చాలా తక్కువ ఆహార భద్రత కలిగి ఉంటారు. అలాగే వారు వరదలు మరియు కరువుల వంటి బాహ్య ఘటనల వల్ల తీవ్రంగా దెబ్బతింటారు. లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతపై ప్రపంచ లక్ష్యాలను సాధించడంలో మాకు సహాయపడే ఉత్తమ పరిష్కారాల వైపు విధాన రూపకర్తలు మరియు పెట్టుబడిదారులకు మార్గనిర్దేశం చేసేందుకు మేము పరిశోధన, సాక్ష్యత మరియు ఆచరణాత్మక అవగాహనను మిళితం చేస్తున్నాము.
సదస్సు రెండో రోజు జరిగిన ప్యానెల్ చర్చ లో తేనె ఉత్పత్తి సంస్థ అయిన బీ ఫ్రెష్ ప్రొడక్ట్స్ వ్యవస్థాపకురాలు మరియు డైరెక్టర్ శ్రీమతి అనూషా జూకూరి,ఒక సింగిల్-యూజ్ పాల కల్తీ పరీక్ష కార్డులను ఉత్పత్తి చేసే దుస్తులను ఉత్పత్తి చేసే ఎం లెన్స్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ ధృవ్ తోమర్, స్టార్ట్-అప్‌లు మరియు వినియోగదారులను అనుసంధానించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ లక్నో ఫార్మర్స్ మార్కెట్ సీ ఈ ఓ, శ్రీ జ్యోత్స్నా కౌర్ హబీబుల్లా, అగ్రిటెక్ ఇంక్యుబేటర్ పూసా కృషి సీ ఈ ఓ, మరియు ఐకార్ లో సీనియర్ స్కేల్ సైంటిస్ట్ డాక్టర్ అకృతి శర్మ మాట్లాడారు. ‘పరిశోధన ను క్షేత్రాలలో అమలు - క్షేత్ర స్థాయి నుంచి అనుభవాలు’ పేరిట జరిగిన ఈ సెషన్‌కు తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి.గీతాలక్ష్మి అధ్యక్షత వహించారు.
శ్రీ జ్యోత్స్నా కౌర్ హబీబుల్లా మాట్లాడుతూ, మీరు పొలాల్లోకి వెళ్లినప్పుడు, పొలాల్లో పని చేయడం మీరు చూస్తారు, కానీ ఆ మహిళలకు భూమి ఉండదు, వారి కష్టానికి తగిన ఆదాయాన్ని పొందలేరు. ఎక్కువ సమయం వారి పనులు గుర్తించబడవు మరియు వారికి వేతనం చెల్లించబడదు. నాలుగు సంవత్సరాలలో తన వ్యాపారాన్ని ఐదు నుండి 1,500 తేనెటీగలకు పెంచుకున్న , ఫైనాన్స్ అందుబాటులో లేకపోవడం గురించి శ్రీమతి అనూషా జూకూరి విచారం వ్యక్తం చేసారు. తాను ప్రారంభించినప్పుడు బ్యాంకులు తనకు రుణాలు మంజూరు చేయడానికి విముఖత చూపాయని, మరియు తాను ఇప్పటికే వ్యాపార విజయాన్ని సాధించడంతో ఇప్పుడు మాత్రమే సిద్ధంగా ఉన్నాయని నివేదించింది. విజయవంతమైన వ్యాపార వ్యవస్థాపకతకు పట్టుదల మరియు సహనం అవసరమని శ్రీ ధ్రువ్ తోమర్ వ్యక్తం చేశారు, అయితే సామర్థ్య శిక్షణ మరియు సాంకేతిక సహాయం రైతుల ఆలోచనలను మార్చడానికి మరియు వ్యవసాయ వ్యాపారవేత్తలు గా మారడానికి తోడ్పడుతుందని శర్మ తెలిపారు. ప్యానలిస్ట్‌ల అనుభవాలను మాకం (మహిళా కిసాన్ అధికారి మంచ్)లో విధాన విశ్లేషకుడు డాక్టర్ సోమ కె పార్థసారథి కీలక ప్రదర్శన ద్వారా సంక్షిప్తం చేశారు. మహిళలు మరియు భూమిలేని కౌలు రైతులు వ్యవసాయం, సేకరణ మరియు పర్యావరణ సంరక్షణ వంటి పలు కార్యకలాపాలలో పాల్గొంటారు. వాటి తో పాటు సంఘీభావం, ఇచ్చి పుచ్చుకోవడం, పరస్పర చేదోడు మరియు సహ-యాజమాన్యం, వలయ ఆర్థిక వ్యవస్థల వైపు వెళ్లడం, మహిళలు తమ గళాన్ని వినిపించే అవకాశం కల్పించడం ద్వారా, మహిళలను విధాన నిర్ణయాలలో పరిగణనలోకి తీసుకోవడం మరియు విత్తనాలు ఇచ్చి పుచ్చుకోవడం వంటి ' పలు కార్యకలాపాల ' ద్వారా వ్యవసాయ-ఆహార వ్యవస్థలో సుస్థిరతను నిలకడను ఎలా పునర్నిర్వచించగలరో మరియు నడిపించగలరో ఋజువు చేయవచ్చని డాక్టర్ పార్థసారథి చెప్పారు. వాతావరణ చర్చలతో పాటు భూమి మరియు అటవీ సంరక్షణపై విధానాల రూపకల్పనలో మహిళల పాత్రలు మరియు వారి వాణిని వినాలని ఆమె అన్నారు. పేదరికం మరియు అసమానతలు లింగానికి మాత్రమే పరిమితం కాదని అసమాన అధికార సంబంధాలు వాటికి ఆధారమవుతాయని డీన్ చెప్పారు. ఏ సి ఐ ఏ ఆర్ ఇటీవల ప్రచురించిన లింగ సమత మరియు సామాజిక చేరిక వ్యూహం మరియు కార్యాచరణ ప్రణాళిక లో లింగ సమానత్వం మాత్రమే కాకుండా సామాజిక చేరికను కూడా చేర్చడానికి ఇది ఒక కారణం అని ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ లో ఔట్‌రీచ్ & కెపాసిటీ బిల్డింగ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎలియనోర్ డీన్ సెషన్‌ను ముగించారు. .
***
(Release ID: 1966874)