మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక , పాడి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర మత్స్య విభాగం అక్టోబర్ 2-7 తేదీల్లో చేపట్టిన ప్రత్యేక ప్రచారం 3.0 కార్యక్రమాలు

Posted On: 10 OCT 2023 4:05PM by PIB Hyderabad

అక్టోబర్ 2 నుంచి 31 వరకు కొనసాగే ప్రత్యేక ప్రచారం 3.0 కింద, కేంద్ర మత్స్య విభాగం వివిధ కార్యక్రమాలను పూర్తి ఉత్సాహంతో చేపడుతోంది. వ్యర్థ వస్తువులను తొలగించి తన కార్యాలయాన్ని పచ్చగా, పరిశుభ్రంగా మార్చింది. మత్స్య విభాగంతో పాటు దాని అనుబంధ స్వయంప్రతిపత్త సంస్థలు కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సీఏఏ), నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్, (ఎన్‌ఎఫ్‌డీబీ), అధీనంలో పని చేసే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ (ఎన్‌ఐఎఫ్‌పీహెచ్‌ఏటీటీ), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ (సీఐఎఫ్‌ఎన్‌ఈటీ), ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఐ), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజినీరింగ్ ఫర్ ఫిషరీస్ (సీఐసీఈఎఫ్‌) వంటి సంస్థలు వివిధ కార్యకలాపాలు నిర్వహించాయి.

ప్రత్యేక ప్రచారం 3.0 కింద శుభ్రపరిచేందుకు మొత్తం 37 స్థలాలను గుర్తించగా, వాటిలో ఇప్పటివరకు 15 స్థలాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక & పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా, సహాయ మంత్రులు డా.సంజీవ్ కుమార్ బల్యాన్, డా.ఎల్ మురుగన్, కార్యదర్శి అభిలాక్ష్ లిఖి, వివిధ కార్యాలయాల సంయుక్త కార్యదర్శులు తనిఖీలు/సందర్శనలు/సమీక్షలు నిర్వహించారు. 

అక్టోబర్ 8వ తేదీ వరకు, 1500కు పైగా పాత దస్త్రాలు/పత్రాలను సమీక్షించారు, వాటిలో దాదాపు 700 పాత దస్త్రాలు/పత్రాలను తొలగించారు. ఇప్పటివరకు దాదాపు 100 చదరపు అడుగుల స్థలాన్ని శుభ్రం చేసి, వ్యర్థాలు తొలగించారు.

ప్రచారంపై దృష్టిని, అవగాహనను పెంచేందుకు, వ్యాప్తిని మెరుగుపరిచేందుకు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజీ, లింక్డ్‌ఇన్ వంటి సామాజిక మాధ్యమాల్లోని మత్స్య విభాగం ఖాతాలా ద్వారా దాదాపు 100 పోస్ట్‌లు చేశారు. మత్స్య విభాగం సామాజిక మాధ్యమ బృందం, క్షేత్ర స్థాయి కార్యాలయాలు ఈ పోస్టులను పంచుకున్నాయి. @PMOIndia @HMOIndia @DARPG_GoI @swachhbharat @SwachhBharatGov @mygovindia @FisherySurveyOI వంటి హ్యాష్‌ట్యాగులను ఉపయోగించారు. వీక్షకుల సంఖ్యను మెరుగుపరచడానికి మత్స్య విభాగం సంస్థలు, రాష్ట్రాలు/యూటీల సామాజిక మాధ్యమ ఖాతాలను, #SpecialCampaign 3.0 #SwachhBharat #DeptofFisheries, #SwachhataHiSeva2023 వంటి హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఉపయోగించారు.

***


(Release ID: 1966631) Visitor Counter : 50


Read this release in: Hindi , English , Urdu