రక్షణ మంత్రిత్వ శాఖ
భారత వైమానిక దళం కొత్త పతాకం
Posted On:
07 OCT 2023 5:03PM by PIB Hyderabad
2023 అక్టోబర్ 08వ తేదీ భారత వైమానిక దళం చరిత్రలో ఒక ముఖ్యమైన రోజుగా నిలిచిపోతుంది. ఆ చారిత్రాత్మక రోజున, వైమానిక దళాధిపతి ఐఏఎఫ్ కొత్త జెండాను ఆవిష్కరిస్తారు.
దేశ స్వాతంత్ర్యానికి ముందు, ఆర్‌ఐఏఎఫ్ పతాకంలో ఎగువ ఎడమ భాగంలో యూనియన్ జాక్, ఎగిరే వైపున ఒక వృత్తాకారం (ఎరుపు, తెలుపు, నీలం) ఉంటుంది. స్వాతంత్య్రానంతరం, యూనియన్ జాక్‌ను భారతీయ త్రివర్ణ పతాకంతో, వృత్తాకారాన్ని జాతీయ జెండాలోని మూడు రంగులతో భర్తీ చేసి భారత వైమానిక దళం కొత్త చిహ్నాన్ని సృష్టించారు.
భారత వైమానిక దళం విలువలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా కొత్త చిహ్నాన్ని రూపొందించారు. ఇప్పుడు, జెండా కుడి ఎగువ మూలలో, ఎగిరే వైపు భారత వైమానిక దళ చిహ్నాన్ని చేర్చారు.
భారత వైమానిక దళం చిహ్నంలో పైభాగాన జాతీయ చిహ్నం ఉంటుంది. అశోక సింహాల మద్ర, దాని కింద దేవనాగరిలో "సత్యమేవ జయతే" అని ఉంటుంది. అశోక సింహాల కింద ఒక హిమాలయ డేగ రెక్కలు విప్పి ఉంటుంది, ఇది ఐఏఎఫ్ పోరాట పటిమను సూచిస్తుంది. లేత నీలం రంగులో ఉండే వృత్తం హిమాలయ డేగ చుట్టూ ఉంటుంది, దానిలో “భారతీయ వాయు సేన” అనే పదాలు కనిపిస్తాయి. ఐఏఎఫ్ నినాదం "నభః స్పృశం దీప్తం" దేవనాగరి పదాలు డేగ బొమ్మ కింద బంగారు రంగులో ఉంటాయి. ఐఏఎఫ్ నినాదం భగవద్గీతలోని 24వ అధ్యాయంలోని 11వ విభాగం నుంచి తీసుకున్నారు. ఈ వాక్యం అర్థం "ప్రకాశిస్తూ ఆకాశాన్ని తాకడం".
***
(Release ID: 1965574)
Visitor Counter : 335