భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
హబ్ మరియు స్పోక్ మోడల్‌లో “డిజిటల్ ట్విన్ సెంటర్ ఫర్ ఎమర్జింగ్ ఆటోమోటివ్ సిస్టమ్స్” పేరుతో కామన్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ సెంటర్ స్థాపన కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఏఆర్ఏఐ,ఐఐటీ గౌహతి
Posted On:
06 OCT 2023 5:40PM by PIB Hyderabad
హబ్ మరియు స్పోక్ మోడల్‌లో “డిజిటల్ ట్విన్ సెంటర్ ఫర్ ఎమర్జింగ్ ఆటోమోటివ్ సిస్టమ్స్” పేరుతో కామన్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ సెంటర్ స్థాపన కోసం ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ)ఐఐటీ గౌహతి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థగా ఏఆర్ఏఐ పనిచేస్తోంది.
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న క్యాపిటల్ గూడ్స్ స్కీమ్ II పథకం కింద పరిశ్రమ భాగస్వామి అయిన మైసిలియం మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
కామన్ ఇంజినీరింగ్ ఫెసిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేస్తుంది. పరిశ్రమలు ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలకు అవసరమైన వివిధ వ్యవస్థలు అభివృద్ధి చేసి పరిశ్రమలకు ప్రయోజనం కలిగించే విధంగా 'సమ్రత్ ఉద్యోగ్ భారత్' ను కామన్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ సెంటర్ అమలు చేస్తుంది. సాంకేతిక పరిష్కార మార్గాలు,సాంకేతిక అంశాలలో చిన్న తరహా సంస్థలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది ఒప్పందం వల్ల ఏర్పాటయ్యే “డిజిటల్ ట్విన్ సెంటర్ ఫర్ ఎమర్జింగ్ ఆటోమోటివ్ సిస్టమ్స్” ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఇక్కడ అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈ తమ అవసరాలకు అనుగుణంగా ప్రయోగాలు నిర్వహించి, నైపుణ్యాభివృద్ధి సాధించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడానికి అవకాశం కలుగుతుంది.
డిజిటల్ ట్విన్ సిస్టమ్స్ ముఖ్య అంశాలు:
* ఏఐ, ఎంఎల్ నమూనాలో డిజిటలైజేషన్ విధానంలో అవసరమైన సమాచారం
* సిస్టమ్ అభివృద్ధి శిక్షణ కోసం డేటా డిజిటలైజేషన్
* నియంత్రణ అభివృద్ధి, ధ్రువీకరణ కోసం సిస్టమ్‌ల డిజిటలైజేషన్
* మెటీరియల్ డెవలప్‌మెంట్ , మాన్యుఫ్యాక్చరింగ్ ప్రక్రియ డిజిటలైజేషన్
* భౌతిక నమూనా అవసరం లేకుండా మెటీరియల్ డెవలప్‌మెంట్
పూణే ప్రధాన కేంద్రంగా హబ్ అండ్ స్పోక్ పద్ధతిలో సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తారు.
స్పోక్ 1: బెంగళూరు లో, స్పోక్ 2: గౌహతి లో ఉంటాయి.
డిజిటల్ ట్విన్ సిస్టమ్స్ ప్రయోజనాలు :
1. డిజిటల్ ట్విన్ ఏర్పాటుతో వ్యవస్థల అభివృద్ధికి అవసరమయ్యే సమయం తగ్గుతుంది.
2. ప్రోటోటైప్ సిద్ధం కావడానికి ముందే సిస్టమ్‌ల ధ్రువీకరణ జరుగుతుంది.
3. వివిధ అప్లికేషన్ ప్రాంతాల కోసం అభివృద్ధి చక్రంలో ఫ్రంట్ లోడ్ డిజిటలైజేషన్.
4. సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం, స్వయంగా అభివృద్ధి చేయడం, నిర్వహించడం, ప్రయోగాలు చేయడం కోసం అనుభవ కేంద్రాలు.
కొన్ని మార్కెట్ నమూనాల వరకు ప్రయోగాత్మక తయారీకి కూడా సహకారం అందిస్తాయి.
5. ఐఐటీ అనుభవంతో స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈ లు, విద్యాసంస్థలకు ప్రయోజనం
6. డిజైన్, అనుకరణ కోసం పరికరాలు ఏర్పాటు
7. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రయోజనాలు భారతీయ అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈ లకు ప్రయోజనం కలిగించే విధంగా ప్రదర్శనలు, అవగాహన, అనుభవ కేంద్రాలు, శిక్షణ,సంప్రదింపులు
వివిధ ప్రాంతాల్లో ఏర్పాటైన సాధనాలను సులభంగా ఉపయోగించడానికి వీలుగా హబ్, స్పోక్స్ డిజిటల్ విధానంలో అనుసంధానం చేస్తారు.
స్పోక్ 2: ఐఐటీ గౌహతి
*స్వదేశీ సాంకేతిక అభివృద్ధి కోసం అధునాతన డిజిటల్ ట్విన్ సిస్టమ్‌ల రంగాలలో ఈశాన్య ప్రాంతంలో పరిశ్రమ అవసరాలను తీర్చడం కోసం ఐఐటీ గౌహతి లో స్పోక్ II ఏర్పాటు అవుతుంది. ఇంజనీరింగ్, ఆటోమోటివ్, డ్రోన్, సౌరశక్తి , ఏరోస్పేస్ వంటి రంగాలకు స్పోక్ 2 ఐఐటీ గౌహతి సహకారం అందిస్తుంది.
* స్పోక్ 2 ఐఐటీ గౌహతిలో సాఫ్ట్‌వేర్‌తో పాటు ఏఐ,ఎంఎల్ పరికరాలను ఏఆర్ఏఐ అందుబాటులోకి తెచ్చి డిజిటల్ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తుంది.
* నియంత్రణ వ్యవస్థల అభివృద్ధి , ధృవీకరణ సిస్టమ్‌ల కోసం డిజిటల్ ట్విన్ ను అందుబాటులోకి తీసుకు రావడానికి ఐఐటీ గౌహతి లో సాధారణ ప్రయోజన హెచ్ఐఎల్ వ్యవస్థ ఏర్పాటు అవుతుంది.
* నూతన పదార్ధాల అభివృద్ధి, లోహాలు, మిశ్రమాలు, సంకలిత తయారీ మొదలైన వివిధ రంగాలలో తయారీ ప్రక్రియ అనుకరణ కోసం కామన్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ సెంటర్ లో సౌకర్యాలు కల్పిస్తారు.
* సిస్టమ్ అభివృద్ధి, శిక్షణ ప్రయోజనాల కోసం డేటాను డిజిటలైజ్ చేయడానికి ఏఐ ,ఎంఎల్ సాధనాలు ఉపయోగిస్తారు. వివిధ అనువర్తనాల అభివృద్ధి చక్రంలో డిజిటలైజేషన్‌ను ఉపయోగించడంలో ఇది సహాయపడుతుంది.
* మెటీరియల్స్, ఎలక్ట్రానిక్స్, ఏఐ ,ఎంఎల్ , కంట్రోల్ సిస్టమ్‌లు మొదలైన వివిధ రంగాల అవసరాలు తీర్చే విధంగా సౌకర్యాలు అభివృద్ధి చేస్తారు. ఈ సౌకర్యాలను ఉపయోగించి అభివృద్ధి అయ్యే సాంకేతికతలు మెరుగైన నాణ్యతతో ఉత్పత్తిని వేగవంతం చేసి సమర్థ ఉద్యోగ్ భారత్ 4.0ని సాకారం చేస్తుంది.
*స్థలం, మౌలిక సదుపాయాలు, పరికరాలకు అవసరమైన సౌకర్యాలను ఐఐటీ గౌహతి కల్పిస్తుంది. విద్యా , పరిశోధన కార్యకలాపాలకు అవసరమైన సౌకర్యాలు అందిస్తుంది.
* ఐఐటీ ద్వారా విద్యా సంస్థలు, పరిశ్రమ పర్యావరణ వ్యవస్థ ( ఎంఎస్ఎంఈ హబ్, అంకుర సంస్థల స్పోక్) మధ్య సమన్వయం సాధించడానికి నూతన వ్యవస్థ ద్వారా కృషి జరుగుతుంది.
* ఎంఎస్ఎంఈ, అంకుర సంస్థలకు అవసరమైన సౌకర్యాలు కల్పించి కామన్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ సెంటర్ స్వీయ-నిరంతర నమూనాలో పని చేస్తుంది.
* విద్యార్థులు, అధ్యాపకులు , విద్యా రంగంతో సంబంధం ఉన్న విద్యా ,పరిశోధన కార్యకలాపాలలో సహాయం చేయడానికి వివిధ రకాల అప్లికేషన్‌లు, అనుభవపూర్వక కేంద్రాలు, ప్రయోగాలు చేయడానికి అవసరమైన సౌకర్యాలు కామన్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ సెంటర్ కల్పిస్తుంది. అవసరమైన శిక్షణ సామాగ్రిని కూడా కామన్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ సెంటర్ అందిస్తుంది.
***
(Release ID: 1965318)
Visitor Counter : 134