నౌకారవాణా మంత్రిత్వ శాఖ

పశ్చిమ బెంగాల్‌లోని జాతీయ 44వ జలమార్గం ఇచామతి నది వద్ద లోతు పెంచడానికి పూడిక తీత ( డ్రెడ్జింగ్ ) పనులను ప్రారంభించిన శ్రీ శంతను ఠాకూర్


నౌకాయానయోగ్య లోతు 1.5 మీటర్ల పెంపును సాధించడానికి టెన్తులియా నుండి కలాంచి వరకు 23.38 కి.మీల పొడవునా పూడిక తీత పనులు ప్రారంభించడం జరిగింది.

డ్రెడ్జింగ్ మరియు ఇతర అనుబంధ ఖర్చుల కోసం మార్చి'23 వరకు అయ్యే వ్యయం కోసం ₹ 3.77 కోట్ల బడ్జెట్ మంజూరు చేశారు. మరియు తదుపరి అవసరాల నిమిత్తం 2023-24 ఆర్ధిక సంవత్సరానికి కొత్త పథకం మంజూరు చేయడం జరుగుతుంది: శ్రీ ఠాకూర్

Posted On: 04 OCT 2023 6:08PM by PIB Hyderabad

       జలమార్గ రవాణాను పర్యావరణ హితమైన రవాణా మార్గంగా ప్రోత్సహించడానికి నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ నిరంతరం జలమార్గాలను అభివృద్ధి చేయడం మరియు ఆధునీకరించే పనులను చేపడుతోంది.  జాతీయ జలమార్గం --44 ఇచామతి నది వద్ద పూడికతీత పనులను బుధవారం ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్ ప్రారంభించారు.

        ఈ సందర్బంగా శ్రీ శంతను ఠాకూర్ తమ ప్రసంగంలో 'గతంలో ఒకప్పుడు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ  ‘అంతర్గత జలమార్గాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి శక్తినిస్తున్నాయి’ అన్నారు. ఇప్పుడు ఆయన నాయకత్వంలో నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ గతంలో ఎన్నడూ లేని విధంగా జాతీయ జలమార్గాల అభివృద్ధికి కృషి చేస్తోంది ' అని అన్నారు.  తదనుగుణంగా  1.5 మీటర్లు  నౌకాయానం లోతు మరియు అలల ప్రభావం పెంచడానికి టెన్తులియా నుండి కలాంచి వరకు 23.38 కి.మీ మేర పూడికతీత పని ప్రారంభించడం జరిగింది.  2022-23 ఆర్ధిక సంవత్సరంలో మార్చి'23 వరకు డ్రెడ్జింగ్ మరియు ఇతర అనుబంధ వ్యయాల కోసం ₹ 3.77 కోట్ల బడ్జెట్ మంజూరు చేయడం జరిగింది.   తదుపరి అవసరాలకు అనుగుణంగా 2023-24 ఆర్ధిక సంవత్సరానికి
కొత్త పథకం మంజూరు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రారంభిస్తున్న తవ్వకం పనుల ఫలితాలు చూసిన తరువాత అధిక సామర్థ్యం గల తవ్వోడను వినియోగించడం జరుగుతుంది.

       నౌకాయానాన్ని మరింత మెరుగుపరచడానికి గుర్రపుడెక్క, కలుపు మొక్కలు, ప్లాస్టిక్ & ప్లాస్టికేతర పదార్ధాలు,  సహజ మరియు కృత్రిమ (పారవేసిన) పదార్ధాలతో పాటు ఇతర వ్యర్ధాలను టెన్తులియా నుంచి కలాంచి వరకు 23.38 కిలోమీటర్ల మేర తొలగించి ఏ మేరకు
తవ్వవలసి ఉంటుందో అంచనా వేయడం జరిగింది.  మొదటి దశలో తరణిపూర్ వద్ద పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంచే డిపాజిట్ వర్క్ ప్రాతిపదికన వంతెన నిర్మాణం విషయం చురుకుగా పరిశీలనలో ఉంది. దాంతో పాటు ఓడరేవులు, నౌకాయానం మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాగర్‌మాల ప్రాజెక్ట్ కింద ₹ 136 .20 కోట్ల నిధులు సమకూరనున్నాయి.  ఇప్పటికే భారత లోతట్టు జలమార్గాల సంస్థ ప్రస్తుతం వాడకంలో ఉన్న తాత్కాలిక వెదురు వంతెనను మార్చడానికి కూడా చర్యలు తీసుకుంది. స్వరూప్‌నగర్‌లోని తాత్కాలిక వెదురు వంతెన స్థానంలో  కొత్తది ఏర్పాటు చేయడాన్ని అధ్యయనం / రూపురేఖలు, చిత్రలేఖనం & ఖర్చు అంచనా పనిని కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయానికి అప్పగించారు.

బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సంధాయకత  

ఘోజదంగా-భోమ్రా మరియు పెట్రాపోల్-బెనపోల్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ICP) నుండి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి గల సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి  ఇచామతి నది నౌకాయాన యోగ్యత  మరియు ప్రోటోకాల్ ఆన్ ఇన్‌ల్యాండ్ వాటర్‌లో దానిని చేర్చడం కోసం  భారత బంగ్లాదేశ్ సభ్యులతో కూడిన సంయుక్త సాంకేతిక  కమిటీ ఏర్పాటు చేయబడింది. ఇండో బంగ్లాదేశ్ మధ్య  రవాణా , వాణిజ్యం కోసం కొత్త  ప్రోటోకాల్ మార్గంగా హేమ్‌నగర్ - కలంచి - ఖేదపరా (170.38 కి.మీ) .

i. హేమ్‌నగర్ నుండి బన్స్‌ఝరి, మల్లిక్‌పూర్: 82 కి.మీ – ప్రతిపాదిత IBP మార్గం

ii. బన్స్‌ఝరి, మల్లిక్‌పూర్ నుండి కలంచి: 63.38 కి.మీ – NW-44

iii. కలాంచి నుండి ఖేదపరా: 25 కి.మీ – ప్రతిపాదిత IBP మార్గం

మొత్తం : 170.38 కి.మీ

 

***



(Release ID: 1965278) Visitor Counter : 82


Read this release in: Urdu , English , Hindi