సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

ప్రపంచ సెరిబ్రల్ పాల్సీ దినోత్సవ నిర్వహణ

Posted On: 06 OCT 2023 6:23PM by PIB Hyderabad

ప్రపంచ మస్తిష్క పక్షవాతం దినోత్సవం అనేది సెరిబ్రల్ పాల్సీ (సిబి). ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, కుటుంబాలు మరియు సంఘాలపై దాని ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రతి సంవత్సరం అక్టోబరు 6న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సిపి గురించి అవగాహన పెంచడానికి,దాంతో జీవిస్తున్న వారికి మద్దతు ఇవ్వడానికి మరియు దీనిపై అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మస్తిష్క పక్షవాతంతో బాధపడుతున్న పిల్లలు మరియు పెద్దలు తరచు సమాజం నుండి సవాళ్లను ఎదుర్కొంటారు. సెరిబ్రల్ పాల్సీ ఉన్నవారికి అవగాహన మరియు మద్దతు పెరగాల్సిన అవసరాన్ని ఈ రోజు వెలుగులోకి తెస్తుంది. 2023లో ప్రపంచ సెరిబ్రల్ పాల్సీ దినోత్సవం యొక్క థీమ్ "కలిసి బలంగా" ఈ థీమ్ సెరిబ్రల్ పాల్సీ కమ్యూనిటీలో మరియు వెలుపల ఐక్యత, సహకారం మరియు పరస్పర మద్దతు యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. వ్యక్తులు, కుటుంబాలు, సంరక్షకులు మరియు సంఘాలు కలిసి వచ్చినప్పుడు, వారు సానుకూల మార్పు మరియు  శక్తిగా మారతారని ఇది నొక్కి చెబుతుంది.

 

image.png


భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వికలాంగుల సాధికారత విభాగం (డిఈపిడబ్ల్యూడి) దేశంలోని వికలాంగుల అభివృద్ధి అజెండాను చూసేందుకు నోడల్ విభాగం. సెరిబ్రల్ పాల్సీ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో డిపార్ట్‌మెంట్ 6 అక్టోబర్ 2023న ప్రపంచ సెరిబ్రల్ పాల్సీ దినోత్సవాన్ని దానితో అనుబంధించబడిన సంస్థల ద్వారా ఫిజికల్ మరియు ఆన్‌లైన్ మోడ్‌లో వెబ్‌నార్ వంటి కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా అవగాహన కల్పన కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, దేశవ్యాప్తంగా 70కి పైగా ప్రదేశాలలో అసెస్‌మెంట్ మరియు హెల్త్ చెక్ క్యాంపులు, సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్, గ్రీన్ కలర్‌లో బిల్డింగ్‌ని మెరుపులాగించడం మరియు ఇతర వినోద కార్యకలాపాలను నిర్వహించింది.

 

image.png


ప్రపంచ సెరిబ్రల్ పాల్సీ దినోత్సవం యొక్క ప్రధాన కార్యక్రమాన్ని ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, మేధో వైకల్యం మరియు బహుళ వైకల్యం ఉన్న వ్యక్తుల సంక్షేమం కోసం నేషనల్ ట్రస్ట్ నిర్వహించింది.వికలాంగుల సాధికారత విభాగం (దివ్యాంగజన్)  ఇది భారత ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ. 6 అక్టోబర్ 2023న న్యూఢిల్లీలోని ద్వారకలో గల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ (ఎన్‌ఐఎస్‌డి) ఆడిటోరియంలో వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డేపై వర్క్‌షాప్ నిర్వహించారు. సెరిబ్రల్ పాల్సీ ఉన్న వ్యక్తుల కోసం సవాళ్లు, అవసరాలు మరియు సౌకర్యాలపై ప్యానెల్ చర్చలు, అనుభవ భాగస్వామ్యం మరియు చర్చలు జరిగాయి. వికలాంగుల సాధికారత విభాగం కార్యదర్శి (దివ్యాంగజన్) రాజేష్ అగర్వాల్ మరియు నేషనల్ ట్రస్ట్  సిఈఓ శ్రీ కె.ఆర్. వైధీశ్వరన్ అధ్యక్షతన వర్క్ షాప్ జరిగింది. 

image.png


డిఈపిడబ్ల్యుడి సెక్రటరీ వర్క్‌షాప్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ పేరెంట్స్ అసోసియేషన్ల ద్వారా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వికలాంగులకు ప్రభుత్వ పథకాలు, సౌకర్యాల గురించి కూడా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

సెరిబ్రల్ పాల్సీ ఉన్న వ్యక్తి మరియు పంజాబ్ & సింధ్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ మిస్టర్ మోహిత్ అరోరా తన ప్రసంగంలో దృఢ నిశ్చయంతో తన వైకల్యాన్ని అధిగమించి ఇప్పుడు పంజాబ్ & సింద్ బ్యాంక్ బ్రాంచ్‌కి నాయకత్వం వహిస్తున్నట్లు చెప్పారు. అవకాశాలను సులభతరం చేయడంపై ప్యానెల్ చర్చ జరిగింది. ఇందులో వైకల్యాలున్న వ్యక్తులు, తల్లిదండ్రులు & వృత్తి నిపుణులు పాల్గొన్నారు. దీనిలో ఒక నిపుణుడు సెరిబ్రల్ పాల్సీ ఉన్న వ్యక్తులు మరియు తల్లి సెరిబ్రల్ పాల్సీ వారి అనుభవాలను పంచుకున్నారు. పాల్గొనేవారిని ప్రోత్సహించారు మరియు వారి సూచనలను అందించారు.

image.png


సంభవ్‌పై చలనచిత్రం : మేకింగ్ ఇన్‌క్లూజన్ పాజిబుల్‌ (సెరెబ్రల్ పాల్సీ ఉన్న వ్యక్తుల కోసం సహాయక పరికరాలు)పై చిత్రం ప్రదర్శించబడింది. సెరిబ్రల్ పాల్సీ ఉన్న వ్యక్తుల కోసం వివిధ సహాయక పరికరాలు మరియు సాంకేతికతలతో ఒక ప్రదర్శన కూడా జరిగింది.

ఈ వర్క్‌షాప్‌లో ఎన్‌జీఓలు, ప్రొఫెషనల్స్, తల్లిదండ్రులు మరియు సెరిబ్రల్ పాల్సీ ఉన్న వ్యక్తులతో సహా భౌతిక మరియు వర్చువల్ మోడ్‌లలో 100 మందికి పైగా పాల్గొన్నారు.

 

***



(Release ID: 1965253) Visitor Counter : 80


Read this release in: English , Urdu , Hindi