కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సిపిఎస్‌ఈల స్వతంత్ర డైరెక్టర్ల కోసం న్యూఢిల్లీలో ఓరియంటేషన్ & లెర్నింగ్ సమ్మిట్‌ను నిర్వహించిన ఐఐసిఏ

నాడు పోస్టు చేయడమైనది: 06 OCT 2023 5:36PM by PIB Hyderabad

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసిఎ)సిపిఎస్‌ఈల స్వతంత్ర డైరెక్టర్ల కోసం ఓరియంటేషన్ & లెర్నింగ్ సమ్మిట్‌ను అక్టోబర్ 5 మరియు 6 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ (డిపిఈ) ఆధ్వర్యంలో మరియు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ నాలెడ్జ్ పార్టనర్‌షిప్ (సిబిసి) కింద ఈ కార్యక్రమం జరిగింది.

 

image.png


ఐఐసిఎ డైరెక్టర్ జనరల్ మరియు సిఈఓ అయిన శ్రీ ప్రవీణ్ కుమార్ ప్రసంగంతో సమ్మిట్ ప్రారంభమైంది; శ్రీ అనిమేష్ భారతి, ఆర్థిక సలహాదారు, డిపిఈ; డా. అనుప్ కె. పూజారి, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి; మరియు డా. నిరాజ్ గుప్తా, స్కూల్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ & పబ్లిక్ పాలసీ హెడ్, ఐఐసిఏ తమ ప్రసంగంలో సిపిఎస్‌ఈ బోర్డుల్లో స్వతంత్ర డైరెక్టర్ల  పాలనా పద్ధతులు, మెరుగైన పనితీరు మరియు జాతీయ అభివృద్ధి లక్ష్యాలకు మెరుగైన సహకారం కోసం మరింత చురుకైన పాత్ర యొక్క ఆవశ్యకతను వివరించారు.

బోర్డు గవర్నెన్స్‌లోని వివిధ కోణాలను సమ్మిట్ కవర్ చేసింది.కార్యక్రమంలో పాల్గొన్నవారు బోర్డ్ గవర్నెన్స్  సూక్ష్మ నైపుణ్యాలు,సిపిఎస్‌ఈలలో స్వతంత్ర డైరెక్టర్ల ప్రభావం,సిఎస్‌ఆర్‌ మరియు ఆడిట్ కమిటీలలో వారి పాత్రలను అన్వేషించారు మరియు వారి బాధ్యతల చుట్టూ ఉన్న నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను పరిశీలించారు. అలాగే ఇంటరాక్టివ్ ప్యానెల్‌లు, ఓపెన్ హౌస్‌లు, బోర్డు సమావేశ సన్నాహాలకు సంబంధించిన అంశాలను మరియు బోర్డు డైనమిక్స్ వర్సెస్ మేనేజ్‌మెంట్ సంబంధాల అన్వేషణ కూడా ఎజెండా ప్రకారం చర్చించబడ్డాయి.

కార్యక్రమంలో డా.భాస్కర్ ఛటర్జీ, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి; నౌషీర్ మీర్జా, ప్రొఫెషనల్ ఇండిపెండెంట్ డైరెక్టర్; అనుపమ్ కులశ్రేష్ఠ, భారతదేశ మాజీ డిప్యూటీ సిఏజి; డాక్టర్ అనిల్ కుమార్, ఇండిపెండెంట్ డైరెక్టర్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్; మరియు డాక్టర్ అనిల్ ఖండేల్వాల్, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ చైర్‌పర్సన్ వంటి ఇతర ప్రముఖ వక్తలు పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 1965250) సందర్శకుల సూచీ సంఖ్య : : 87
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी