వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారతదేశం మరియు యుఎఇ మధ్య రూపే దేశీయ కార్డ్ స్కీమ్ ఒప్పందం

Posted On: 05 OCT 2023 5:51PM by PIB Hyderabad

ఎన్ పీ సీ ఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీ సీ ఐ)  అనుబంధ సంస్థ, యుఎఇ లో దేశీయ కార్డ్ స్కీమ్ (డీ సీ ఎస్ ) అమలు కోసం అల్ ఎతిహాద్ పేమెంట్స్ (ఏ ఈ పీ )తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏ ఈ పీ  సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యుఎఇ  యొక్క పరోక్ష అనుబంధ సంస్థ. ఒప్పందం ప్రకారం, ఎన్ ఐ పీ ఎల్  మరియు ఏ ఈ పీ యుఎఇ  లు జాతీయ దేశీయ కార్డ్ స్కీమ్‌ను నిర్మించడానికి, అమలు చేయడానికి  కలిసి పని చేస్తాయి. యుఎఇలో ఇ-కామర్స్ మరియు డిజిటల్ లావాదేవీల వృద్ధిని సులభతరం చేయడం, ఆర్థిక చేరికలను బలోపేతం చేయడం, యుఎఇ యొక్క డిజిటలైజేషన్ ఎజెండాకు మద్దతు ఇవ్వడం, ప్రత్యామ్నాయ చెల్లింపు ఎంపికలను పెంచడం, చెల్లింపుల వ్యయాన్ని తగ్గించడం మరియు యుఎఇ యొక్క పోటీతత్వాన్ని మరియు ప్రపంచ స్థాయిని మెరుగుపరచడం డీ సీ ఎస్ లక్ష్యం. ఇతర దేశాలకు వారి స్వంత ఖర్చు-సమర్థవంతమైన మరియు సురక్షితమైన చెల్లింపు వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో సహాయం చేయడానికి దాని జ్ఞానం మరియు నైపుణ్యాన్ని అందించడానికి ఎన్ ఐ పీ ఎల్ లక్ష్యం తో ఈ భాగస్వామ్యం సంపూర్ణంగా సరిపోతుంది.

 

డీ సీ ఎస్ పరిష్కారం సార్వభౌమాధికారం, మార్కెట్‌కు వేగం, ఆవిష్కరణ, డిజిటలైజేషన్ మరియు వ్యూహాత్మక స్వాతంత్ర్యం సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఎన్ ఐ పీ ఎల్ అందించిన డీ సీ ఎస్ సొల్యూషన్‌లో రూపే స్టాక్ మరియు మోస పర్యవేక్షణ సేవలు మరియు విశ్లేషణలు వంటి విలువ ఆధారిత సేవలు ఉంటాయి. ఎన్ ఐ పీ ఎల్ వారి దేశీయ కార్డ్ స్కీమ్ కోసం నిర్వహణ నిబంధనలను రూపొందించడంలో ఏ ఈ పీ కి కూడా సహాయం చేస్తుంది.

 

రూపే అనేది భారతదేశంలో స్వదేశీ, అత్యంత సురక్షితమైన మరియు విస్తృతంగా ఆమోదించబడిన కార్డ్ చెల్లింపు నెట్‌వర్క్. రూపే కార్డులు డెబిట్, క్రెడిట్ మరియు ప్రీపెయిడ్ ప్రతిపాదనలను కలిగి ఉంటాయి. ఇప్పటి వరకు 750 మిలియన్ రూపే కార్డులు చెలామణిలో ఉన్నాయి. భారతదేశంలో జారీ చేయబడిన మొత్తం కార్డ్‌లలో రూపే కార్డ్‌లు 60% కంటే ఎక్కువగా ఉన్నాయి, ప్రతి రెండవ భారతీయుడు ఇప్పుడు రూపే కార్డ్‌ని కలిగి ఉన్నారు. ఈ కార్డులు ప్రభుత్వ రంగ, ప్రైవేట్ మరియు చిన్న బ్యాంకులతో సహా మొత్తం బ్యాంకింగ్ స్పెక్ట్రమ్ ద్వారా జారీ చేయబడతాయి.

 

భారతదేశం  ప్రపంచ ప్రఖ్యాత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డీ పీ ఐ) చెల్లింపు వ్యవస్థ లో భారీ పరివర్తనను తీసుకు వచ్చింది. డీ పీ ఐ ఫ్రేమ్‌వర్క్‌లో డిజిటల్ గుర్తింపు, డిజిటల్ చెల్లింపులు మరియు డిజిటల్ డేటా మార్పిడి లేయర్‌లు ఉన్నాయి, ఈ మూడింటి కలయిక భారతదేశంలో ఫిన్‌టెక్ విప్లవం వెనుక ఉన్న శక్తి.  సుదూరం గా సైతం తమను తాము (ఆధార్ ద్వారా) ప్రామాణీకరించుకునే మార్గం మరియు సమర్థవంతమైన మరియు సరసమైన మొబైల్ అనుసంధానం ద్వారా ఇంటర్నెట్‌ను చేరువ చేయడం తో భారతదేశంలో దాదాపు ప్రతి పెద్దవారికి బ్యాంకింగ్ సేవలకు ప్రాప్యత ఉంది,

 

ఈ మౌలిక సాంకేతికతల సమ్మేళనం భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఫిన్‌టెక్ పర్యావరణ వ్యవస్థగా చేస్తుంది. యునికార్న్‌లు వేగంగా వెలువడుతున్నాయి. భారతదేశం గత ఐదు సంవత్సరాలలో డిజిటల్ లావాదేవీలలో పాల్గొనే కస్టమర్లలో 367%  వృద్ధిని సాధించింది, 340 మిలియన్ల కంటే ఎక్కువ క్రియాశీల కస్టమర్ పునాది ఉంది.

 

***(Release ID: 1964849) Visitor Counter : 106


Read this release in: English , Urdu , Hindi